- Home
- Entertainment
- చిరంజీవి టాప్ 10 అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలు.. ఫ్లాప్ టాక్‌తోనూ దుమ్ములేపిన సినిమాలివే
చిరంజీవి టాప్ 10 అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలు.. ఫ్లాప్ టాక్‌తోనూ దుమ్ములేపిన సినిమాలివే
మెగాస్టార్ చిరంజీవి నేడు శుక్రవారం తన 70వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10 సినిమాల గురించి తెలుసుకుందాం.

1.సైరా నరసింహ రెడ్డి
ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు: రూ. 244 కోట్లు
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2019 లో విడుదలైంది. ఇందులో చిరంజీవితో పాటు, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా వంటి వారు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 200 కోట్లు. క్రిటికల్‌గా ప్రశంసలందుకున్న ఈ మూవీ కమర్షియల్‌గా ఫెయిల్ అయ్యింది.
KNOW
2. వాల్టర్ వీరయ్య
ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు: రూ. 232 కోట్లు
బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ, శ్రుతి హాసన్ నటించారు. రూ. 125 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 2023లో విడుదలైంది. చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
3. ఖైదీ నంబర్ 150
ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు: రూ. 164 కోట్లు
ఈ సినిమా 2014లో విడుదలైన దళపతి విజయ్ నటించిన `కత్తి` చిత్రానికి తెలుగు రీమేక్. వి.వి. వినాయక్ దర్శకత్వం వహించిన 'ఖైదీ నంబర్ 150' సినిమా దాదాపు రూ. 75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఇందులో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్, విలన్‌గా తరుణ్ అరోరా నటించారు. 2017లో విడుదలైన ఈ మూవీ చిరంజీవి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి ఆయనకు మంచి రీఎంట్రీగా నిలిచింది.
4. గాడ్ ఫాదర్
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు: రూ. 108 కోట్లు
2022లో విడుదలైన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇది 2019లో విడుదలైన మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం 'లూసిఫర్'కి రీమేక్. దాదాపు రూ. 90 కోట్లతో నిర్మించారు. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కమర్షియల్‌గా సత్తా చాటలేకపోయింది.
5. ఆచార్య
ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు: రూ. 71 కోట్లు
కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ నటించారు. వీరిద్దరు కలిసి పూర్తి స్థాయిలో నటించిన సినిమా ఇది. పూజా హెగ్డే చరణ్‌కి జోడీగా చేసింది. 2022లో విడుదలైన ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 130 కోట్లు. ఇది చిరు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.
6. ఇంద్ర
ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు: రూ. 51.2 కోట్లు
2002 లో విడుదలైన ఈ చిత్రం బడ్జెట్ కేవలం రూ. 12 కోట్లు. బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే నటించారు. శివాజీ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
7. ఠాగూర్
ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు: రూ. 51 కోట్లు
వి.వి. వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2003లో విడుదలైంది. ఇది 2002 లో విజయకాంత్ నటించిన తమిళ చిత్రం 'రమణ' కి రీమేక్. రూ.15 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన జ్యోతిక, శ్రియ శరణ్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ అప్పట్లో టాలీవుడ్ ని షేక్ చేసింది. చిరుని తిరుగులేని మెగాస్టార్‌గా నిలిపింది.
8.శంకర్దాదా MBBS
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్: రూ. 50.8 కోట్లు
ఈ చిత్రం సంజయ్ దత్ నటించిన 'మున్నాభాయ్ MBBS' చిత్రానికి రీమేక్. 2004 లో విడుదలైన ఈ చిత్రానికి జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించారు. చిరంజీవి సరసన సోనాలి బింద్రే నటించగా, శ్రీకాంత్ మరో హీరోగా నటించారు. ఈ చిత్ర బడ్జెట్ కేవలం రూ. 15 కోట్లు. ఈ మూవీ పెద్ద హిట్ అయ్యింది.
9.స్టాలిన్
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్: రూ. 50 కోట్లు
రూ. 20 కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించారు. 2006లో విడుదలైన ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటించింది. ఖుష్బూ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. నెగటివ్ టాక్‌ని తెచ్చుకున్న ఈ మూవీ కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్ములేపింది.
10. శంకర్దాదా జిందాబాద్
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్: రూ. 40 కోట్లు
ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2007 లో విడుదలైంది. దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీలో చిరంజీవితో పాటు శ్రీకాంత్ మరో హీరోగా నటించగా, కరిష్మా కోటక్ హీరోయిన్‌గా చేసింది. ఇది సంజయ్ దత్ నటించిన 'లగే రహో మున్నాభాయ్' చిత్రానికి సీక్వెల్. ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.