Samantha: మీడియా ముందుకు సమంత.. చైతు గురించి ప్రశ్నలు తప్పవుగా
విడాకుల తర్వాత నాగ చైతన్య, సమంత గురించి వార్తలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, ఆమె నటిస్తున్న సినిమాల గురించి ఫ్యాన్స్ లో ఎక్కువగా చర్చ జరుగుతోంది.

Samantha
విడాకుల తర్వాత నాగ చైతన్య, సమంత గురించి వార్తలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, ఆమె నటిస్తున్న సినిమాల గురించి ఫ్యాన్స్ లో ఎక్కువగా చర్చ జరుగుతోంది. అభిమానులందరికి షాక్ ఇస్తూ గత ఏడాది చైతు, సమంత విడిపోయారు.
Samantha
మొదట ఇద్దరూ మౌనం వహించారు. ఆ తర్వాత బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత.. చైతూతో విడిపోవడం గురించి స్పందించింది. తనపై జరుగుతున్న ట్రోలింగ్ ఆపాలని కోరింది. కొన్ని నెలల తర్వాత సమంత తన సినిమాలతో బిజీ అయిపోయింది.
Samantha
ప్రస్తుతం సమంత మల్టిపుల్ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. విడాకుల తర్వాత సమంత నుంచి రాబోతున్న తొలి చిత్రం 'కణ్మణి రాంబో ఖతీజా'. విజయ్ సేతుపతి హీరోగా.. నయనతార, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు తమిళ ద్విభాషా చిత్రంగా ఈ మూవీ రాబోతోంది. ఏప్రిల్ 28న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది.
Samantha
ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి. ఇటీవలే ఈ చిత్రంలోని ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. విగ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకుడు. నయనతార సొంత ప్రొడక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సో నయన్ కూడా ప్రమోషన్స్ లో భాగం కానుంది. సాధారణంగా అయితే సినిమా ప్రచార కార్యక్రమాలకు నయన్ హాజరు కాదు.
Samantha
ప్రాజెక్ట్స్ కి సైన్ చేసే ముందే నిర్మాతలకు నయన్ ఆ విషయం చెబుతుంది. సొంత ప్రొడక్షన్ కాబట్టి తప్పకుండా మీడియా ముందుకు రానుందట. అంతే కాదు సినిమా ప్రమోషన్స్ కి హాజరు కావాలని నయన్ సమంతని కూడా రిక్వస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సమంత కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.
Samantha
సో సమంత చైతుతో బ్రేకప్ తర్వాత తొలిసారి సౌత్ మీడియా ముందుకు రానుంది. దీనితో ఆమెకు తప్పకుండా చైతు గురించి ప్రశ్నలు ఎదురవుతాయి. మరి సమంత చైతూతో బ్రేకప్ గురించి మాట్లాడుతుందా.. ఆ ప్రశ్నలని అవాయిడ్ చేస్తుందా వేచి చూడాలి.