MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పరువు నష్టం దావా కేసులో సమంత స్టేట్మెంట్ ఇదిగో.. అబార్షన్, 300 కోట్ల డీల్ అంటూ..

పరువు నష్టం దావా కేసులో సమంత స్టేట్మెంట్ ఇదిగో.. అబార్షన్, 300 కోట్ల డీల్ అంటూ..

సౌత్ లో క్రేజీ కపుల్స్ గా ఉన్న సమంత, నాగ చైతన్య విడిపోతారని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. కానీ ఈ జంట విడాకులతో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు.

2 Min read
Author : pratap reddy | Asianet News
| Updated : Oct 21 2021, 05:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సౌత్ లో క్రేజీ కపుల్స్ గా ఉన్న సమంత, నాగ చైతన్య విడిపోతారని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. కానీ ఈ జంట విడాకులతో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. ఈ విడాకుల వ్యవహారం సమంతకు మరింతగా సమస్యలు తెచ్చిపెట్టింది. సమంతపై అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి. దీనికి తోడు మీడియాలో Samantha, Naga Chaitanya విడాకులకు కారణాలు ఇవే అంటూ అనేక రూమర్లు ప్రచారం జరిగాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సమంతకు తన స్టైలిస్ట్ Preetham సంబంధం ఉన్నట్లు కూడా ప్రచారం చేశారు. ఇలాంటి పుకార్లు సమంతకి తీవ్ర వేదనగా మారాయి. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు బ్రేక్ పడాలంటే తాను మౌనం వీడాలని సమంత డిసైడ్ అయింది. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. 

36

యూట్యూబ్ ఛానల్స్ అయితే సమంత వ్యక్తిగత జీవితంపై డిబేట్లు నడిపాయి. సమంతని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాయి. యూట్యూబ్ ఛానల్స్ తన పర్సనల్ లైఫ్ పై శృతి మించేలా కథనాలు వేస్తుండడంతో సమంత వారికి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది. కూకట్ పల్లి కోర్టులో సమంత ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ అయిన సుమన్ టివి, తెలుగు పాపులర్ టివి, టాప్ తెలుగు టివి యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేసింది. 

46

ఈ పరువు నష్టం దావా కేసులో సమంత స్టేట్మెంట్ ని ఒకసారి పరిశీలిద్దాం.  తెలుగులో అత్యంత పాపులర్ నటిని నేను. ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ తో జాతీయ వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందాను. నా నటనకి గాను 4 ఫిలిం ఫేర్ అవార్డులు. 2 నంది అవార్డులు, 6 సౌతిండియా అవార్డులు, 3 సినీ మా అవార్డులు అందుకున్నా.మల్టీనేషనల్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వంలో చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేశా. 

56


ఇంతటి గుర్తింపు పొందిన నాపై కొందరు కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. నా పరువు బజారున పడేలా చేస్తున్నారు. 2017లో నాగ చైతన్యని వివాహం చేసుకున్నా. ఈ ఏడాది అక్టోబర్ 2న ఇద్దరం విడిపోతున్నట్లు కలసి ప్రకటన చేశాం. అప్పటి నుంచి నాపై దుష్ప్రచారం మొదలైంది. నేను అబార్షన్ చేయించుకునాన్ని, 300 కోట్ల డీల్ కుదుర్చుకున్నాను అంటూ యూట్యూబ్ ఛానల్స్, సీఎల్ వెంకట్రావు నాపై అసభ్యంగా కామెంట్స్ చేశారు. ఫ్యాషన్ డిజైనర్ తో సంబంధం ఉన్నట్లు నా దాంపత్య జీవితంపై అనుమానాలు రేకెత్తించారు. 

Also Read: సమంత దర్శకురాలి షాకింగ్ డెసిషన్.. విజయ్ దేవరకొండని కాదని చైతూతో..

66


నా డ్రెస్సింగ్ విధానంపై అసభ్యంగా వీడియోలు చేశారు. నా అనుమతి, వివరణ లేకుండా తప్పుడు కథనాలు ప్రసారం చేశారు. నా ప్రతిష్టని దిగజార్చేందుకే పక్కా ప్రణాళికతో ఈ వీడియోలు చేశారు. యూట్యూబ్ ఛానల్స్ లో నాపై చేసిన వీడియో లింకులు తొలగించండి. బహిరంగంగా నాకు క్షమాపణ చెప్పించండి. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోండి అంటూ సమంత కోర్టుని కోరింది. 

Also Read: థైస్ అందాలతో అనసూయ హాట్ షో.. ఇంటర్నెట్ లో మంటలు రేపేలా ఫోజులు

About the Author

PR
pratap reddy
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudhakar: ఫ్లాప్ తర్వాత ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిరు.. దెబ్బకు ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కమెడియన్
Recommended image2
Kattalan Review: కాటాలన్‌ మూవీ రివ్యూ.. ఏనుగు దంతాల స్మగ్లింగ్, KGF మ్యూజిక్ డైరెక్టర్ BGMతో అరాచకం
Recommended image3
Anchor Sowmya Rao: తండ్రి అంటే ఇష్టం లేదు, ఓ పెద్ద హీరో నా ఫోన్ నంబర్ తీసుకున్నారు.. యాంకర్ సౌమ్యరావు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved