MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Samantha: మ్యారేజ్‌ లైఫ్‌ గొప్పగా ఊహించుకున్నా.. కానీ అంతా రివర్స్.. `కాఫీ విత్‌ కరణ్‌` షోలో సమంత వ్యాఖ్యలు

Samantha: మ్యారేజ్‌ లైఫ్‌ గొప్పగా ఊహించుకున్నా.. కానీ అంతా రివర్స్.. `కాఫీ విత్‌ కరణ్‌` షోలో సమంత వ్యాఖ్యలు

స్టార్‌ హీరోయిన్‌ సమంత.. తన పెళ్లి లైఫ్‌పై ఓపెన్‌ అయ్యింది. కరణ్‌ జోహార్ ని నిందిస్తూ తన లైఫ్‌ రివర్స్ అయ్యిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన కామెంట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jul 03 2022, 04:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సమంత(Samantha).. హీరో నాగచైతన్య(Naga Chaitanya)తో విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో చైతూ, సమంత తమ డైవర్స్ ని ప్రకటించి షాకిచ్చారు. ఆ తర్వాత ఎంతో కుమిలిపోయిన సమంత ఇప్పుడిప్పుడే కోలుకుని స్వతంత్రంగా నిలబడుతుంది. సినిమాల విషయంలోనూ జోరు పెంచింది. తెలుగుతోపాటు పాన్‌ ఇండియా సినిమాలు, ఇంటర్నేషనల్‌ మూవీస్‌ చేస్తుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

సమంతలో వ్యక్తిగానూ మార్పు వచ్చింది. ఆమె మరింత స్వేచ్ఛగా మారిపోయింది. పెళ్లి అనే బంధం నుంచి బయటపడినప్పట్నుంచి స్వేచ్ఛగా జీవిస్తుంది. తనకు నచ్చినట్టు ఉంటుంది. ఇష్టం వచ్చింది చేస్తుంది. మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇండిపెండెంట్‌ ఉమెన్‌గా తన లక్ష్యాల దిశగా దూసుకెళ్తుంది.
 

38

ఇదిలా ఉంటే తాజాగా సమంత హిందీలో పాపులర్‌ టాక్‌ షో `కాఫీ విత్‌ కరణ్‌`(Koffee with Karan Talk Show)లో పాల్గొంది. ప్రముఖ బాలీవుడ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ హోస్ట్ గా రన్‌ అయ్యే షో ఇది. అనేక మంది సెలబ్రిటీలు ఇందులో పాల్గొని బోల్డ్ గా తమ లైఫ్‌కి, కెరీర్‌కి, పర్సనల్‌ లైఫ్‌కి సంబంధించిన విషయాలను పంచుకుంటారు. ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తికాగా, ఇప్పుడు ఏడో సీజన్‌ రన్‌ అవుతుంది. ఈ సారి ఈ షో ఓటీటీలో ప్రసారమవుతుంది. ఈ నెల 7నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. 

48

తాజాగా ఈ షో ప్రోమో విడుదలైంది. ఇందులో సమంత, విజయ్‌ దేవరకొండ, అక్షయ్‌ కుమార్, రణ్‌ వీర్‌ సింగ్‌, అలియాభట్‌, అనిల్‌ కపూర్‌, జాన్వీ కపూర్, అనన్య పాండే, టైగర్‌ ష్రాఫ్‌, షాహిద్‌ కపూర్‌ పాల్గొన్నారు. సమంత.. అక్షయ్‌ కుమార్‌తో కలిసి సీట్‌ని పంచుకున్నారు. ఇందులో కరణ్‌కి, సమంతకి మధ్య జరిగిన కన్వర్జేషన్‌ ఆద్యంతం ఆసక్తికరంగా, సంచలనంగా మారడం విశేషం. 
 

58

ఇందులో కరణ్‌ జోహార్‌ ఫ్యామిలీ లైఫ్‌ గురించి సమంతని ప్రశ్నించారు. `అన్‌ హ్యాపీ మ్యారేజ్‌ లైఫ్‌`కి కారణమేంటని ప్రశ్నించగా, సమంత ఇరిటేట్‌(నవ్వుతూ) అయ్యింది. నీ వల్లే తన మ్యారేజ్‌ లైఫ్‌లో సంతోషం లేకుండా పోయిందని ఆరోపించింది. పెళ్లి  లైఫ్ `కభీ ఖుషీ కభీ ఘమ్‌`లో ఎంతో బాగా చూపించారు. కానీ రియాలిటీ అందుకు భిన్నంగా ఉంది. `కేజీఎఫ్‌`లా ఉంటుందని పేర్కొంది సమంత. కేజీఎఫ్‌లో హీరోయిన్‌  పరిస్థితిలా తన లైఫ్‌ అయ్యిందనే ఉద్దేశ్యంతో సమంత చెప్పింది. మొత్తంగా బోల్డ్ గా, షాకింగ్‌గా తన కామెంట్‌ చెప్పడంతో ఇప్పుడది వైరల్‌ అవుతుంది. 

68

అయితే జస్ట్ ప్రోమో కాబట్టి టచ్‌ చేసి వదిలేశారు, ఇక పూర్తి షోలో సమంత ఏం చెప్పబోతుంది, ఎంత బోల్డ్ గా మాట్లాడబోతుందని, ఇంకా ఎలాంటి సంచలన విషయాలు బయటపెట్టబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రోమోని బట్టి చూస్తుంటే రణ్‌వీర్‌ సింగ్‌, అలియా కలిసి మొదటగా పాల్గొన్నట్టు, ఆ తర్వాత సమంత, అక్షయ్‌ జోడీ పాల్గొన్నట్టు తెలుస్తుంది. 

78

సమంత, నాగచైతన్య విడాకులకు సంబంధించిన అసలు కారణం ఏంటనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. దీనిపై వాళ్లు నోరు విప్పలేదు. మరి ఈ టాక్‌ షోలో సమంత చెబుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. మరి ఏం చెప్పబోతుందో చూడాలి. 

88

సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. `యశోద` చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. `శాకుంతలం` పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. విజయ్‌దేవరకొండతో నటిస్తున్న `ఖుషి` చిత్రీకరణ జరుపుకుంటోంది. మరోవైపు ఓ ఇంటర్నేషనల్‌ మూవీలోనూ నటిస్తుంది సమంత. బాలీవుడ్‌లోనూ ఆమె నటించబోతున్నట్టు సమాచారం. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Recommended image2
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Recommended image3
Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved