సల్మాన్ ఖాన్ సరసన సమంత..? క్రేజీ మూవీని తెరకెక్కించబోతున్న పవన్ కళ్యాణ్ డైరెక్టర్
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని క్రేజీ కాంబినేషన్స్ సందడి చేస్తుంటాయి. అలానే ఈసారి కూడా ఎవరూ ఊహించని విధంగా ఓ సూపర్ క్రేజీ కాంబినేషన్ వెండితెరపై సందడి చేయడానికి రెడీ అవుతుంది.
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. ఈ ఇద్దరి కాబినేషన్ కలుస్తుందని ఎవరైనా ఊహించారా..? కాని తాజాగా ఈ ఇద్దరికాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు సోషల్ మీడియాలో న్యూస్ హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ నుంచి సౌత్ వరకూ ఈన్యూస్ హల్ చల్ చేస్తోంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..?
తాజాగా విజయ్ దేరకొండ జోడీగా ఖుషి సినిమాలో నటించి మెప్పించింది సమంత. ఈమూవీ సూపర్ హిట్ అవ్వడంతో ఆమె క్రేజ్ ఇంకాస్త పెరిగింది. ఇక మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత దాదాపు ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం సమంత విహారయాత్రలు చేస్తూ.. విదేశాలకు తిరుగుతూ.. ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. ఈ ఏడాది తరువాత ఆమె చేయాల్సిన ప్రాజెక్ట్ లు రెండు మూడు ఉన్నాయి.
వరుసగా ఏడాది విరామం పూర్తి కాకముందే సమంతకు ఓ భారీ బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. పుష్ప చిత్రంలో ప్రత్యేక పాటతో పాటు, ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో ఉత్తరాది ప్రేక్షకులకు చేరువైంది. హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ హిందీ వెబ్ సిరీస్‌లోనూ నటించింది. ఈ సిరీస్ విడుదల కావాల్సి ఉంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు జోడీగా నటించే ఆఫర్ సమంత ముందుకొచ్చినట్టు తెలుస్తోంది.
Image: Instagram
ఇక ఈసినిమాను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారో తెలుసా..? పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో పంజా సినిమాను తెరకెక్కించిన విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఈసినిమా రూపొందబోతున్నట్టు తెలుస్తోంది. సల్మాన్ హీరోగా, కరణ్ జొహార్ ఓ భారీ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా సమంత పేరు తెరపైకి వచ్చింది.
షారుక్ ఖాన్, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా ఇటీవల వచ్చిన జవాన్ మంచి విజయం సాధించింది. ఇందులో షారుక్, నయన్ జంటకు మంచి పేరు వచ్చింది. దాంతో సల్మాన్ సినిమాలో దక్షిణాది హీరోయిన్ అయితే బాగుంటుందని కరణ్ జొహార్ భావిస్తున్నారని తెలుస్తోంది. సమంతతో పాటు త్రిష, అనుష్క పేర్లను పరిశీలిస్తున్నట్టు బాలీవుడ్ సమాచారం.
అయితే ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.. కాని ఈసినిమా కన్ ఫార్మ్ అయినట్టే అని.. ఇందులో సమంతనే హీరోయిన్ గా తీసుకోవాలని పట్టుదలతో ఉన్నారట టీమ్. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి సల్మాన్ సరసన సమంత కనిపిస్తే.. ఎలా ఉంటందా అని ఇప్పటి నుంచే కలలు కంటున్నారు ఫ్యాన్స్.