2025 కొత్త ఏడాదిని సమంత ఎలా స్టార్ట్ చేసిందో తెలుసా..?
కొత్త ఏడాదికి సరికొత్తగా వెల్కం చెప్పింది స్టార్ హీరోయిన్ సమంత. 2025 న్యూ ఇయర్ వేడుకలను ఎక్కడ జరుపుకుందో తెలుసా..?
2025 సంవత్సరం సమంత రూత్ ప్రభు గ్రాండ్ వెల్కం పలికింది. నూతన సంవత్సరాన్ని పవిత్ర స్థలాన్ని సందర్శించడం ద్వారా జరుపుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో తన సెలబ్రేషన్స్ కు సబంధించిన ఫోటోలను శేర్ చేసుకుంది బ్యూటీ.
సమంత డ్రెస్సింగ్ స్టైల్ అద్భుతంగా ఉంది. పొడవాటి బూడిద రంగు కోటు ధరించి వెలిగిపోతోంది సమంత. చర్చిలో నిలుచుని ఉన్న సమంత వెనుకవైపు తిరిగి నిల్చుంది. చర్చిలో ప్రార్ధనలు చేస్తూ.. కొవ్వొత్తులు వేలిస్తూ కనిపించింది సమంత.
చర్చి లో సమంత తప్పించి మరెవరు కనిపించలేదు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫోటోకు "day 1, 2025" అని క్యాప్షన్ ఇచ్చింది, తర్వాత రెడ్ ఎమ్మెజీలను కూడా ఇచ్చింది.
సమంత తన క్రిస్మస్ వేడుకల ఫోటోలను కూడా ఫ్యాన్స్ కు శేర్ చేసింది. అనేక ఫోటోలలో, ఆమె వివిధ పవిత్ర స్థలాలలో పూజలు చేస్తున్నట్లు కనిపించింది. నటి తన అభిమానులను ఫాలోవర్స్ ను వారి రోజువారీ పనుల నుండి విరామం తీసుకోవాలని కోరింది.
2022లో మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత, ఆతరువాత కోలుకుని వెబ్ సిరీస్ చేసింది. సిటాడెల్ వెబ్ సీరీస్ తో పాటు హనీ బన్నీలో కనిపించింది. ఈ సిరీస్ ఆమె అనారోగ్యం తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుని చేసింది. ఈసిరిస్ తో రీ ఎంట్రీ ఇచ్చిన సమంత బాలీవుడ్ కే పరిమితం అవుతోంది.
సిటాడెల్ తర్వాత సమంత మరికొన్ని ప్రాజెక్టుల కోసం పని చేస్తోంది. 37 ఏళ్ల ఈ బ్యూటీ.. దివా రాజ్ & డీకే ఫాంటసీ యాక్షన్ సిరీస్, రక్త బ్రహ్మాండ్ - ది బ్లడీ కింగ్‌డమ్‌లో కనిపించనుంది. సమంత ఆదిత్య రాయ్ కపూర్, వామికా గబ్బీ, అలీ ఫజల్ , నికితిన్ ధీర్‌లతో కలిసి కనిపిస్తుంది.