MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Samantha Remuneration: `మా ఇంటి బంగారం`కి సమంత పారితోషికం ఎంతో తెలుసా? కొడితే కుంభస్థలమే

Samantha Remuneration: `మా ఇంటి బంగారం`కి సమంత పారితోషికం ఎంతో తెలుసా? కొడితే కుంభస్థలమే

Samantha Remuneration: సమంత ప్రధాన పాత్రలో నటించిన `మా ఇంటి బంగారం` మూవీ సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతుంది. మరి ఈ చిత్రానికి సమంత ఎంత పారితోషికం తీసుకుందో తెలుసా? మామూలుగా కాదు.   

3 Min read
Author : Aithagoni Raju
Published : Jun 26 2026, 04:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మా ఇంటి బంగారంతో సమంత రచ్చ
Image Credit : instagram/@samantharuthprabhuoffl

మా ఇంటి బంగారంతో సమంత రచ్చ

సమంత తెలుగులో లేడీ సూపర్‌ స్టార్‌ అనిపించుకుంటోంది. `మా ఇంటి బంగారం` రిజల్ట్ తో ఆమె ఈ ట్యాగ్‌కి కరెక్ట్ గా సెట్‌ అవుతుందని చెప్పొచ్చు. అభిమానులు కూడా అదే పేరుతో పిలుస్తున్నారు. అయితే సామ్‌ మాత్రం ఈ విషయంలో స్పష్టంగా ఉంటోంది. లేడీ సూపర్‌ స్టార్‌ అంటే నయనతార కదా అని ఓపెన్‌గా స్టేట్‌మెంట్‌ ఇచ్చేసింది. తాను కేవలం సమంత మాత్రమే అని చెప్పి తన గొప్పతనం చాటుకుంది. ఇదిలా ఉంటే సమంత నటించిన `మా ఇంటి బంగారం` మూవీ థియేటర్లో సందడి చేస్తోంది. విజయవంతంగా రన్‌ అవుతోంది. వీకెండ్ లోనే కాదు, వీక్‌ డేస్‌లోనూ అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న సమంత మా ఇంటి బంగారం మూవీ
Image Credit : Asianet News

సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న సమంత మా ఇంటి బంగారం మూవీ

సమంత ప్రధాన పాత్రలో నటించిన `మా ఇంటి బంగారం` మూవీ గత శుక్రవారం విడుదలైంది. నందిని రెడ్డి రూపొందించిన ఈ మూవీకి సామ్‌ భర్త, దర్శకుడు రాజ్‌ నిడిమోరు కథ, స్క్రీన్‌ ప్లే అందించారు. అదే సమయంలో సమంతతో కలిసి ఈ మూవీని నిర్మించారు. ట్రాలాల ప్రొడక్షన్‌లో ఈ మూవీని నిర్మించిన విషయం తెలిసిందే. ఇందులో గుల్షన్ దేవయ్య, దిగంత్‌, శ్రీముఖి, గౌతమి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. రెండో వారంలోనూ విజయవంతంగా రన్‌ అవుతున్న ఈ సినిమా విడుదలై వారం రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు మంచి వసూళ్లని రాబట్టింది.

Related Articles

Related image1
Vadde Naveen: వడ్డే నవీన్‌ మొదటి భార్య ఎవరో తెలుసా? విడాకుల కారణంగానే హీరోగా కెరీర్‌ క్లోజ్‌, తొక్కేసింది ఎవరు?
Related image2
Nagadurga: నిర్మాతకు 15 కండీషన్స్ పెట్టిన నాగదుర్గ.. హీరోయిన్‌గా `ఇడుపుకాయితం` స్టార్ట్
35
మా ఇంటి బంగారం మూవీ కలెక్షన్లు
Image Credit : Asianet News

మా ఇంటి బంగారం మూవీ కలెక్షన్లు

`మా ఇంటి బంగారం` ఏడు రోజుల్లో సుమారు అరవై కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు దీనికి రూ.59.53కోట్ల కలెక్షన్లు వచ్చాయి. గురువారం దీనికి రూ.2.65కోట్లు రావడం విశేషం. బుధవారంతో పోల్చితే గురువారం వసూళ్లు పెరిగాయి. ఈ రోజు శుక్రవారం మరింతగా పెరిగే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం మరోసారి తన సత్తా చాటబోతుంది సమంత. ఈ మూవీ ఈ మూడు రోజులు అదిరిపోయే వసూళ్లని రాబట్టనుంది. దీంతో మొత్తం కలెక్షన్లు రూ.70-80కోట్లకు వెళ్లనుంది. లాంగ్‌ రన్‌ లో వంద కోట్ల దిశగా వెళ్తుందని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. మరి అది సాధ్యమేనా అనేది చూడాలి.

45
సమంత పొందే పారితోషికం, ప్రాఫిట్‌ డిటెయిల్స్
Image Credit : Asianet News

సమంత పొందే పారితోషికం, ప్రాఫిట్‌ డిటెయిల్స్

మరి `మా ఇంటి బంగారం` మూవీకి సమంత ఎంత పారితోషికం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఆ విషయాలు తెలిస్తే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. ఈ మూవీకి అయిన బడ్జెట్‌ రూ.30కోట్లు. థియేటర్లో విడుదలకు ముందే నాన్‌ థియేట్రికల్‌గా ఈ సినిమాకి సుమారు రూ.33కోట్లు వచ్చాయి. ఓటీటీ, శాటిలైట్‌, ఆడియో రైట్స్ రూపంలో ఇంతటి భారీ ఇన్‌కమ్‌ని అర్జించారు. దీంతో రిలీజ్‌కి ముందే నిర్మాతలు సేఫ్‌లో ఉన్నారు, ఇంకా చెప్పాలంటే ప్రాఫిట్‌లో ఉన్నారు. ఇక ఇప్పుడు థియేట్రికల్‌గా వచ్చేదంతా భోనస్‌ అనే చెప్పాలి. ఇప్పటికే ముప్పై కోట్ల షేర్‌ కలెక్షన్లు వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్ల పర్సెంటేజ్‌ తీసేస్తే సమంతకి వచ్చిన డబ్బులు సుమారు రూ.25కోట్లు ఉంటాయని చెప్పొచ్చు. అయితే ఈ మూవీకి సమంతకి పారితోషికం ఇవ్వలేదు. సినిమా హిట్‌ అయితే ఏడు కోట్లు రెమ్యూనరేషన్‌ ఇస్తామని మాట్లాడుకున్నారు. ఇప్పుడు పారితోషికం రూపంలో ఆమెకి ఏడు కోట్లు వచ్చింది. అలాగే థియేట్రికల్‌ రన్‌ ద్వారా వచ్చింది మొత్తం సమంతకే చెందుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి నిర్మాత తనే. కాబట్టి లాభాలు మొత్తం తనకే చెందుతాయని చెప్పొచ్చు. అలా ఈ ప్రాజెక్ట్ ద్వారా సమంత పొందే లాభాలు ఏకంగా రూ.30-40కోట్ల వరకు ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

55
సమంత కొడితే కుంభస్థలమే
Image Credit : instagram/@samantharuthprabhuoffl

సమంత కొడితే కుంభస్థలమే

నిజానికి `మా ఇంటి బంగారం` మూవీ రిలీజ్‌కి ముందు ఎవరైనా చూస్తారా అనే టెన్షన్‌లో ఉన్నారు. అటు దర్శకురాలు నందిని రెడ్డి, సమంతతోపాటు అందరి ఫీలింగ్‌ కూడా అదే. అందుకే సరైన రిలీజ్‌ టైమ్ కోసం వెయిట్‌ చేస్తూ వచ్చారు. రెండు మూడు సార్లు వాయిదా కూడా వేశారు. సరైన సమయంలో సినిమాని రిలీజ్‌ చేశారు. ఇప్పుడు ఆడియెన్స్ ఎగబడి చూస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా చూస్తున్నారు. దీంతో విజయవంతంగా రన్‌ అవుతుంది. ఊహించని విధంగా కలెక్షన్లు వస్తున్నాయి. వచ్చే వారం కూడా ఈ మూవీకి తిరుగులేదు. మొత్తంగా సమంత లేట్‌గా వచ్చినా, లేటెస్ట్ గా వచ్చింది. కొడితే కుంభస్థలమే కొట్టేసింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సమంత రూత్ ప్రభు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Recommended image2
Suman: శోభన్‌ బాబు, సుమన్‌, నాగార్జున ముగ్గురిలో ఉన్న మైనస్‌ ఒక్కటే.. అందుకే మెగాస్టార్‌ కాలేకపోయారు
Recommended image3
Geetu Mohandas: టాక్సిక్‌కి డిజాస్టర్‌ టాక్‌.. గీతూ మోహన్‌దాస్‌ కామెంట్స్ దుమారం.. ట్రోలింగ్‌
Related Stories
Recommended image1
Vadde Naveen: వడ్డే నవీన్‌ మొదటి భార్య ఎవరో తెలుసా? విడాకుల కారణంగానే హీరోగా కెరీర్‌ క్లోజ్‌, తొక్కేసింది ఎవరు?
Recommended image2
Nagadurga: నిర్మాతకు 15 కండీషన్స్ పెట్టిన నాగదుర్గ.. హీరోయిన్‌గా `ఇడుపుకాయితం` స్టార్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved