- Home
- Entertainment
- సమంత, కాజల్, రష్మిక, కీర్తి, తమన్నా, నయనతార.. హీరోయిన్ ట్యాగ్‌ని బ్రేక్ చేస్తున్న భామలు..ఇక రచ్చ రచ్చే
సమంత, కాజల్, రష్మిక, కీర్తి, తమన్నా, నయనతార.. హీరోయిన్ ట్యాగ్‌ని బ్రేక్ చేస్తున్న భామలు..ఇక రచ్చ రచ్చే
టాలీవుడ్ హీరోయిన్లు కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేస్తున్నారు. `హీరోయిన్ ట్యాగ్`ని పక్కన పెడుతున్నారు. కెరీర్‌లో ఒకే ఇమేజ్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. సమంత, రష్మిక, నయనతార, కాజల్, కీర్తి వంటి హీరోయిన్లు అదే చేస్తున్నారు.

సినిమాల్లో హీరోయిన్ అంటే హీరోకి జోడీగా యాక్ట్ చేయడం, హీరోతో లవ్ లో పడటం, ఆయనతో ఆడిపాడటం. డ్యూయెట్లు పాడుకుని, అలా వచ్చి ఇలా పోవడం అనేది జరుగుతుంది. హీరోయిన్ అంటే జనాలు కూడా అలానే చూస్తారు. కానీ దాన్ని బ్రేక్ చేస్తున్నారు నేటి స్టార్ హీరోయిన్లు. `హీరోయిన్` ట్యాగ్ నుంచి బయటపడుతున్నారు. నటిగా ఆవిష్కరించుకుంటున్నారు. ప్రయోగాలు చేస్తున్నారు. తమని తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. హీరోయిన్ పాత్రనే కాదు, కీ రోల్స్ చేస్తున్నారు. బలమైన పాత్రలతో సినిమాలో భాగమవుతున్నారు. విజయంలోనూ షేర్ చేసుకుంటున్నారు. మరి ఆ కథానాయికలెవరు? వారేం చేస్తున్నారనేది చూస్తే.
సమంత హీరోయిన్ ట్యాగ్ నుంచి నెమ్మదిగా బయటపడుతుంది. దానికి `ది ఫ్యామిలీ మ్యాన్ 2`వెబ్ సిరీస్‌తో పునాది వేసుకుంది. ఇందులో పూర్తి డీ గ్లామర్ రోల్‌లో, ఓ బలమైన పాత్రలో నటించింది సమంత. హీరోయిన్ ట్యాగ్‌ని పక్కన పెట్టేసి నటించింది. రాజీ పాత్రలో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. దీంతోపాటు `శాకుంతలం`, `యశోద` వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. ఇంటర్నేషనల్ చిత్రంలోనూ ఆమెది కీలక పాత్రనే అని తెలుస్తుంది.
లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్. ఇప్పటికే పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి విజయాలు అందుకుంది. ఇప్పుడు హీరోయిన్ ట్యాగ్ నుంచి పూర్తిగా బయటపడబోతుంది. ఆమె చిరంజీవితో కలిసి `గాడ్ ఫాదర్`లో నటిస్తుంది. ఇందులో ఆమె చిరంజీవికి చెల్లి పాత్రని పోషిస్తుండటం విశేషం.
తమన్నా.. హీరోయిన్ ట్యాగ్‌ని దూరం పెట్టేస్తుంది. ఆమె గ్లామర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో పేరుతెచ్చుకుంది. కానీ ఇప్పుడు ఆ ట్యాగ్ నుంచి బయటపడుతుంది. కీలక పాత్రల్లో నటన విశ్వరూపం చూపిస్తుంది. చిరంజీవి నటించిన `సైరా` చిత్రంలో ఆమె కీలక పాత్రలో నటించి ఫుల్ క్రెడిట్ కొట్టేసింది. హైలైట్‌గా నిలిచింది. ఆ తర్వాత నితిన్‌తో `మ్యాస్ట్రో` చిత్రంలో నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. రానున్న సినిమాల్లోనూ హీరోయిన్‌గానే కాదు, కీ రోల్స్ లోనూ మెప్పించబోతుంది మిల్కీ బ్యూటీ.
కీర్తిసురేష్ `మహానటి` చిత్రంతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు తెరలేపింది. ఇందులో ఆమె అద్బుతమైన నటనతో మెప్పించి జాతీయ అవార్డుని అందుకుంది. ప్రస్తుతం హీరోయిన్‌గానూ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ మెరిసింది. ఇటీవల రజనీకాంత్‌తో `అన్నాత్తే`లో కీ రోల్ చేసింది. రజనీకాంత్‌కి చెల్లిగా కీలక పాత్రలో మెరిసింది. ఇప్పుడు చిరంజీవితో `భోళాశంకర్` చిత్రంలోనూ ఆయనకు చెల్లిగా కీర్తి నటిస్తుండటం విశేషం. ఇందులో తమన్నా కథానాయిక.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా `పుష్ప` చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారింది. ఆమెకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ స్టార్ హీరోలతో ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆమె ఓ కీలక పాత్రలో నటించేందుకు ఒప్పుకోవడం విశేషం. దుల్కర్ సల్మాన్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న `సీతారామం` చిత్రంలో రష్మిక కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో కనిపించే దుల్కర్‌ను, సీత పాత్రధారి మృణాళినీ ఠాకూర్‌లను కలిపే కశ్మీర్ ముస్లిం అమ్మాయి అఫ్రీన్ పాత్రలో రష్మికా మందన్నా కనిపిస్తారు.
కాజల్ సైతం హీరోయిన్ ట్యాగ్ నుంచి బయటపడబోతుంది. మంచు విష్ణుతో `మోసగాళ్లు` చిత్రంలో కీలక పాత్రలో ఆయనకు చెల్లిగా నటించడం విశేషం. అయితే ప్రస్తుతం ప్రెగ్నెంట్‌తో ఉన్న కాజల్ మంగళవారం పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది.
యంగ్ సెన్సేషన్ నివేతా పేతురాజ్ సైతం ఇదే దారిలో రన్ అవుతుంది. ఆమె హీరోయిన్‌గా చేసుకుంటూ కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటుంది. మరోవైపు ఇలాంటి కీరోల్స్ లోనూ నటిస్తుంది. ఆమె `బ్రోచేవారెవరురా` చిత్రంలో కీలక పాత్రలో మెరిసింది. అలాగే బన్నీ `అల వైకుంఠపురములో` చిత్రంలో చిన్న పాత్రలో నటించింది. `రెడ్`లోనూ కీ రోల్ చేసింది. `విరాటపర్వం`లోనూ కీరోల్ చేస్తుంది నివేతా పేతురాజ్.
ఇదిలా ఉంటే ఓ వైపు హీరోయిన్‌గా రాణిస్తూనే మరోవైపు కీలక పాత్రల్లో మెరుస్తుంది ప్రియమణి. `ఢీ`లో సందడి చేస్తున్న ఈ బ్యూటీ `విరాటపర్వం` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే `ది ఫ్యామిలీ మ్యాన్ 2`లోనూ కీలక పాత్రలో మెరిసింది. ఇలా వరుసగా ఆమె మెయిన్ రోల్స్ చేస్తూ హీరోయిన్ ట్యాగ్ నుంచి బయటపడిందనే చెప్పాలి. పూర్ణ కూడా అదే దారిలో ఉందని చెప్పొచ్చు.
మరో యంగ్ హీరోయిన్స్ శివాత్మిక, శివానీలు సైతం కెరీర్ బిగినింగ్‌లోనే కీ రోల్స్ చేస్తున్నారు. `దొరసాని` చిత్రంతో ఆకట్టుకున్న శివాత్మిక ప్రస్తుం `రంగమార్గాండ` చిత్రంలో కీ రోల్ చేస్తుంది. ఆమె అక్క శివానీ తండ్రి రాజశేఖర్ నటిస్తున్న `శేఖర్` చిత్రంలో కీ రోల్ చేస్తుంది. హీరోయిన్ ట్యాగ్‌ని ఆదిలోనూ బ్రేక్ చేస్తున్నారు. పూజా, రాశీఖన్నాలు సైతం హీరోయిన్‌గానే కాదు, కీ రోల్స్ కి కూడా సిద్ధమవుతున్నారు.