- Home
- Entertainment
- Tollywood Heroines: ఒకటికి నాలుగు... 2022 లో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కి సిద్దమైన స్టార్ లేడీస్
Tollywood Heroines: ఒకటికి నాలుగు... 2022 లో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కి సిద్దమైన స్టార్ లేడీస్
దాదాపు సంవత్సరాల కాలం కరోనా కోరల్లో కరిగిపోయింది. 2020-21 సంవత్సరాల్లో కనీసం ఇరవై శాతం చిత్రాలు కూడా విడుదల కాలేదు. ముఖ్యంగా భారీ చిత్రాల షూటింగ్స్, విడుదల ఆగిపోయింది. చిన్న చిత్రాలతో పాటు మరికొందరు హీరోలు ఓటీటీ బాట పట్టారు.

అయితే 2022 లో బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి నెలకొననుంది. అలాగే హీరోలతో పాటు కొందరు స్టార్ హీరోయిన్స్ ఒకటి మూడు చిత్రాలతో ఫ్యాన్స్ ని అలరించనున్నారు. రష్మిక మందాన, అలియా భట్, పూజా హెగ్డే తో పాటు సమంత, రకుల్ వంటి హీరోయిన్స్ వరుస చిత్రాలతో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచనున్నారు.
ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ ప్రేక్షకులను పలకరించిన రష్మిక మందాన (Rashmika Mandanna)ఖాతాలో మరో మూడు చిత్రాలు ఉన్నాయి. ఆ మూడు చిత్రాలు 2022లో విడుదల కానున్నాయి. అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఇక బాలీవుడ్ లో చేస్తున్న మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కిన మిషన్ మజ్ను సమ్మర్ కానుకగా మే 13న విడుదల కానుంది.
Pooja Hegde
వరుస విజయాలతో దూసుకుపోతున్న పూజా హెగ్డే (Pooja Hegde)మరో మూడు రోజుల్లో రాధే శ్యామ్ చిత్రంతో థియేటర్స్ లో దిగుతుంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలున్నాయి. అలాగే విజయ్ బెస్ట్ ఏప్రిల్ 14న విడుదలకు సిద్దమవుతుంది. చిరంజీవి-చరణ్ ల మల్టీస్టారర్ ఆచార్య ఏప్రిల్ 29న విడుదల కానుంది. వీటితో పాటు హిందీ చిత్రం సర్కస్ జులై 15న విడుదల అవుతుంది. ఈ మూడు చిత్రాలలో పూజా హీరోయిన్ గా నటిస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt)వరుసగా భారీ చిత్రాలలో నటిస్తూ సత్తా చాటుతున్నారు. ఆమె లేటెస్ట్ మూవీ గంగూబాయి కతియావాది వంద కోట్ల వసూళ్లు సాధించింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మార్చి 25న విడుదల కానుంది. అలియా నటించిన మరో భారీ బడ్జెట్ మూవీ బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న విడుదల కానుంది. వీటితో పాటు డార్లింగ్స్ మూవీ ఓటిటిలో నేరుగా స్ట్రీమ్ కావడానికి సిద్దమవుతుంది.
లక్కీ చార్మ్ సమంత (Samantha)పుష్ప మూవీలో ఐటెం సాంగ్ చేశారు. సమంత ఈ ఏడాది మరో మూడు చిత్రాలు విడుదల చేయనున్నారు. నయనతార, విజయ్ సేతుపతితో ఆమె నటించిన కాతు వాకుల రెండు కాదల్ ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఇక ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యశోద, శాకుంతలం ఇదే ఏడాది విడుదల కానున్నాయి. యశోద పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుండగా, యశోద చిత్రీకరణ జరుపుకుంటుంది.
ఇక టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన రకుల్ (Rakul Preeth Singh)చేతినిండా చిత్రాలతో బిజీగా ఉంది. ఈ సంవత్సరం రకుల్ నుండి నాలుగు చిత్రాలు విడుదల కానున్నాయి. అటాక్ మూవీ పార్ట్ వన్ ఏప్రిల్ 1న అలాగే రన్ వే మూవీ ఏప్రిల్ 29న విడుదల కానుంది. డాక్టర్ జీ, చత్రీవాలీ రకుల్ నటించిన చిత్రాలు కాగా ఇదే ఏడాది థియేటర్స్ లో దిగనున్నాయి.
మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannah Bhatia)నుండి ఈ ఏడాది అరడజను చిత్రాల వరకు విడుదల కానున్నాయి. మే 27న ఎఫ్ 3 విడుదల కానుంది. అలాగే సత్యదేవ్ కి జంటగా నటించిన గుర్తుందా శీతాకాలం మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. చిరంజీవికి జంటగా ఆమె భోళా శంకర్ మూవీ చేస్తున్నారు. అది ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం కలదు.
రాశి ఖన్నా (Raashi Khanna)కొంచెం గ్యాప్ ఇచ్చి టాలీవుడ్ లో బిజీ అయ్యారు. ఆమె ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాలు చేస్తున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ, దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న పక్కా కమర్షియల్ చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. అయితే ఇదే ఏడాది విడుదల కానున్నాయి.