- Home
- Entertainment
- సెవెన్ స్టార్ హోటల్ లో సమంత.. పాన్ ఇండియా చిత్రానికి మహేష్ బాబు 'ఒక్కడు' మూవీ మ్యాజిక్
సెవెన్ స్టార్ హోటల్ లో సమంత.. పాన్ ఇండియా చిత్రానికి మహేష్ బాబు 'ఒక్కడు' మూవీ మ్యాజిక్
నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత తిరిగి తన సినిమాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం సమంత పాన్ ఇండియా చిత్రాలు కూడా చేస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంతకి ఇండియా వ్యాప్తంగా క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే.

నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత తిరిగి తన సినిమాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం సమంత పాన్ ఇండియా చిత్రాలు కూడా చేస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంతకి ఇండియా వ్యాప్తంగా క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో సమంత పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేసింది.
ప్రస్తుతం సమంత 'యశోద' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి - హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా చిత్ర నిర్మాత కృష్ణ ప్రసాద్ యశోద మూవీకి సంబంధించిన ఇంటరెస్టింగ్ డీటెయిల్స్ రివీల్ చేశారు.
కథ పరంగా ఈ చిత్రంలో కీలక భాగం ఓ ప్రాంతంలో జరుగుతుంది. దానికోసం విలాసవంతమైన హోటల్స్ అవసరం. హైదరాబాద్ లో చాలా హోటల్స్ ని పరిశీలించాం . 35, 40 రోజులు హోటల్స్‌లో చిత్రీకరణ చేయడం అంత సులభం కాదు. దీనితో సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ నేతృత్వంలో రామానాయుడు స్టూడియోలో రూ 3 కోట్ల వ్యయంతో సెవెన్ స్టార్ హోటల్ సెట్ నిర్మించాము.
ఆర్ట్ డైరెక్టర్ అశోక్.. మహేష్ బాబు ఒక్కడు చిత్రంలో చార్మినార్ సెట్ తో అబ్బురపరిచిన సంగతి తెలిసిందే. అదే మ్యాజిక్ సమంత చిత్రానికి కూడా తీసుకురాబోతున్నారు . ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ అక్కడే జరుగుతోంది. సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ తదితర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం.ఏప్రిల్ కల్లా షూటింగ్ పూర్తి చేస్తాం అని నిర్మాత అన్నారు.
అయితే ఈ చిత్రం ఎలాంటి కథతో తెరకెక్కుతోంది అనే అంశం రివీల్ చేయలేదు. 30 నుంచి 40 రోజుల షూటింగ్ సెవెన్ స్టార్ హోటల్ లో జరుగుతోంది అంటే.. బహుశా థ్రిల్లర్ కథ అయి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. అశోక్ నిర్మించిన సెట్స్ కళ్ళు చెదిరేలా అబ్బురపరుస్తాయి అని నిర్మాత తెలిపారు.
ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం అని తెలిపారు. సో సమంత నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ యశోద. ఇదిలా ఉండగా సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే పౌరాణిక చిత్రంలో నటిస్తోంది.