- Home
- Entertainment
- Samantha: చైతూతో గతంలో జీవించిన ఇంట్లో తిరిగి చేరిన సామ్... అమ్మేసిన దాన్ని తిరిగి దక్కించుకోవడానికి కారణం?
Samantha: చైతూతో గతంలో జీవించిన ఇంట్లో తిరిగి చేరిన సామ్... అమ్మేసిన దాన్ని తిరిగి దక్కించుకోవడానికి కారణం?
రోజులు గడిచే కొద్దీ సమంత, నాగ చైతన్య వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం సమంత గతంలో చైతుతో కలిసి జీవించిన ఇంట్లో ఉంటున్నారన్న విషయం విస్మయపరిచింది. ఈ విషయాన్ని నటుడు మురళీ మోహన్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Samantha
సమంత,నాగ చైతన్య చట్టబద్ధంగా విడిపోయారు. వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయి. అవేమి బయటికి రాలేదు. అయితే పెద్ద వివాదమే నడిచినట్లు సమంత లేటెస్ట్ కామెంట్స్ ద్వారా అర్థమవుతుంది. నాగ చైతన్య అంటే రగిలిపోతున్న సమంత కాఫీ విత్ కరణ్ టాక్ షోలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Samantha
నాగ చైతన్య(Naga Chaitanya) లాంటి మగాళ్ళపై కోపంతోనే పుష్ప మూవీలో ఐటెం సాంగ్ చేశానని సమంత తెలియజేశారు. పాటలో చెప్పినట్లు మగాళ్ళది వంకర బుద్దని సమంత అభిప్రాయపడ్డారు. నాగ చైతన్య నా భర్త కాదు, మాజీ భర్త మాత్రమే అన్న సమంత... మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచాల్సి వస్తే పదునైన కత్తులు కూడా ఉంచాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ సమంతకు చైతూ పై ఉన్న ద్వేషం, కోపాన్ని తెలియజేస్తున్నాయి.
Samantha
అలాంటి సమంత గతంలో భర్తతో కలిసి జీవించిన ఇంటిలోనే ఉంటున్నారట. ఈ విషయాన్ని నటుడు మురళీ మోహన్(Murali Mohan) తెలియజేశారు. గ్రేట్ ఆంధ్ర అనే మీడియా సంస్థ ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీ మోహన్... సమంత ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. విడిపోక ముందు చైతన్యతో ఉన్న ఇంటిలోనే సమంత ఉంటున్నారని చెప్పుకొచ్చారు.
Samantha
దానికి వివరణ ఇస్తూ... సమంత(Samantha), చైతన్య కలిసి ఉన్నప్పుడు మా అపార్ట్మెంట్ లోని ఫెంట్ హౌస్ లో ఉండేవారు. కలిసి జీవించాలని ఓ ఇండివిడ్యువల్ హౌస్ కొనుగోలు చేశారు. అది నిర్మాణంలో ఉండగానే అపార్ట్మెంట్ లో ఉంటున్న ప్లాట్ అమ్మేశారు. అయితే కొత్తగా కొన్న ఇల్లు పూర్తయ్యే వరకు అక్కడే ఉంటామని కొన్న ఓనర్స్ ని ఒప్పించారు. కొత్తింటికి వెళ్లేలోపే వాళ్ళ మధ్య విబేధాలు తలెత్తి విడిపోవడం జరిగింది.
Samantha
మనస్పర్థల తర్వాత ఆ ప్లాట్ ఖాళీ చేసి సమంత, నాగ చైతన్య వెళ్లిపోయారు. అప్పుడు సమంత మరో ఇల్లు కొనడానికి బాగా తిరిగారు. కానీ ఆవిడకు ఎక్కడా నచ్చలేదు. చైతూతో పాటు గతంలో ఉన్న ప్లాట్ కావాలి, అదైతే సెక్యూరిటీ పరంగా, సౌకర్యాల పరంగా బాగుంటుంది అని నన్ను అడిగారు. వేరే వాళ్లకు అమ్మేశాం కదా అని నేను అన్నాను. వాళ్లతో మాట్లాడమని సమంత రిక్వెస్ట్ చేయడంతో నేను మాట్లాడి ఒప్పించాను.
Samantha
సమంత ఫ్లాట్ కొన్నవాళ్లకు కొంత ప్రాఫిట్ కూడా కలిపి ఇచ్చి సొంతం చేసుకున్నారు. ఆ ఇంట్లో వాళ్ళ అమ్మతో పాటు సమంత మాత్రమే ఉంటారని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. ఏరి కోరి ఎక్కువ డబ్బులు చెల్లించి సమంత ఆ ప్లాట్ కొనడం వెనుక సెక్యూరిటీ రీజన్స్ అని తెలుస్తుంది. ఎక్కడో పై అంతస్థులో ఉండే ఫెంట్ హౌస్ కారణం తనకు ఎలాంటి డిస్టబెన్స్ ఉండదని భావించి సమంత ఇంటిని తిరిగి దక్కించుకున్నారు.
Samantha
ఈ స్టోరీలో అసలు ట్విస్ట్ ఏమిటంటే... సమంత చైతూ జీవితంలోకి రాకముందే ఆ ఇంటిని నాగ చైతన్య కొనుక్కున్నారు. మురళీమోహన్ తన అపార్ట్మెంట్ లో ఫ్యామిలీ కోసం పైన మూడు ఫెంట్ హౌస్లు నిర్మించారు. అనుకోకుండా ఆ హౌసెస్ చూసిన నాగ చైతన్య మురళీమోహన్ తో ఒకటి నాకు కావాలి అన్నాడు. అవి మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం కట్టినవి అమ్మడం కుదరదని చెప్పడంతో చైతూ.. నాగార్జునతో మాట్లాడించి సొంతం చేసుకున్నాడు.
Samantha
జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలతో ఆ ఫెంట్ హౌస్ చాలా ఆహ్లాదంగా ఉంటుందట. అందుకే మనసు పడి ఆ ఇంటిని సొంతం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఆ ఇంటిలోనే సమంతతో కాపురం పెట్టాడు. దురదృష్టవశాత్తు ఆ ఇంటిలోనే వాళ్లకు విడాకులు అయ్యాయి.