- Home
- Entertainment
- మెట్టు మెట్టుకి కర్పూరం వెలిగిస్తూ సమంత ప్రత్యేక పూజలు.. మరోసారి ఆధ్యాత్మిక బాటలో సామ్, వైరల్ పిక్స్
మెట్టు మెట్టుకి కర్పూరం వెలిగిస్తూ సమంత ప్రత్యేక పూజలు.. మరోసారి ఆధ్యాత్మిక బాటలో సామ్, వైరల్ పిక్స్
సమంత ఎక్కువగా భక్తి మార్గంలో పయనించే నటి. నాగ చైతన్యతో బ్రేకప్ సమయంలో సమంత ఇండియాలో ప్రముఖ దేవాలయాల్లో పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

వరుసగా అద్భుతమైన చిత్రాలతో దూసుకుపోతున్న సమంతకి ఆరోగ్య సమస్యలు బ్రేక్ వేశాయి. కొన్ని నెలల నుంచి సమంత మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సమంత పూర్తిగా కోలుకుంది. తన ఆరోగ్యం నార్మల్ స్థితికి చేరుకున్న వెంటనే సమంత తన తదుపరి చిత్రాల షూటింగ్స్, ఇతర కార్యక్రమాలు మొదలు పెట్టింది.
సమంత ఎక్కువగా భక్తి మార్గంలో పయనించే నటి. నాగ చైతన్యతో బ్రేకప్ సమయంలో సమంత ఇండియాలో ప్రముఖ దేవాలయాల్లో పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. గత ఏడాది సమంత మయో సైటిస్ అనే వ్యాధికి గురైంది. కోలుకోవటానికి చాలా సమయమే పట్టింది. ఈ వ్యాధి సోకినప్పుడు కండరాలు విపరీతంగా బాధిస్తాయి. ఆ బాధని దిగమింగుతూ చికిత్స చేయించుకున్న సామ్ తిరిగి ఫిట్ గా మారింది.
ప్రస్తుతం సమంత వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. అయినప్పటికీ తన ఆధ్యాత్మిక బాటని వదిలిపెట్టడం లేదు. కాస్త తీరిక దొరకడంతో సమంత తమిళనాడులోని పళని మురుగన్ స్వామి దేవాలయాన్ని సందర్శించింది. అరుళ్ ముగు శ్రీ దండాయుధపాణి స్వామి క్షేత్రం అని కూడా ఈ ఆలయాన్ని పిలుస్తారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని దర్శించాలి అంటే 600 మెట్లు ఎక్కాలి.
సమంత 600 మెట్లు ఎక్కడం మాత్రమే కాదు.. మెట్టు మెట్టుకూ కర్పూరం వెలిగిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. సమంత టీంతో పాటు.. జాను (తమిళంలో 96) చిత్ర దర్శకుడు సి ప్రేమ్ కుమార్ కూడా సమంత దర్శన ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నారు.
సమంత కర్పూరం వెలిగిస్తూ మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత మొక్కు తీర్చుకునేందుకు సామ్ ఈ ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. సమంత ఫొటోల్లో సింపుల్ గా సల్వార్ కమీజ్ డ్రెస్ ధరించి, మాస్క్ పెట్టుకుని కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా సమంత ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు ఈ నెలలో రిలీజ్ కావలసిన సమంత పౌరాణిక చిత్రం శాకుంతలం ఏప్రిల్ 14కి వాయిదా పడింది. ఆలాగే సమంత విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటించాల్సి ఉంది.