`సమంత-నాగచైతన్య విడాకులు`లో బిగ్ ట్విస్ట్.. తెరపైకి పిల్లల మ్యాటర్.. సామ్ అందుకే దూరంగా ఉంటుందా?
టాలీవుడ్ స్టార్స్ సమంత(samantha), నాగచైతన్య(naga chaitanya) డైవర్స్(divorce) విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా వీరిద్దరి గురించే చర్చ జరుగుతుంది. ఆల్మోస్ట్ డైవర్స్ కన్ఫమ్ అంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది.
సమంత, నాగచైతన్య ప్రేమించి 2017లో పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. మ్యారేజ్ తర్వాత కూడా ఎలాంటి గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు సమంత, చైతూ. మ్యారేజ్ తర్వాత సమంత సైతం అందాల అరబోతకు గేట్లు ఎత్తేసిందా అనేంతగా ఫోటో షూట్లకి పోజులిస్తూ షాకిచ్చింది.
కెరీర్ పరంగా చైతూ, సామ్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని, చైతూ, సమంత విడిపోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. అందుకు సమంత తన ట్విట్టర్, ఇన్‌స్టాలో నేమ్ ఛేంజ్ చేయడమే కారణమైంది. సమంత ఆ మధ్య తన ట్విట్టర్, ఇన్‌స్టా పేరులో `అక్కినేని` తీసేసి కేవలం `ఎస్`గా మార్చింది. దీంతో చైతూతో విభేదాలు తలెత్తాయా? అనే రూమర్ ఊపందుకుంది.
దీనికి సమంత కూడా స్పందించకపోవడంతో ఈ రూమర్లు మరింతగా పెరుగుతూ పోయాయి. అందుకు బలాన్ని చేకూరుస్తూ ఇటీవల నాగార్జున బర్త్ డే వేడుకలకు, బర్త్ డే పార్టీకి సమంత దూరంగా ఉన్నారు. కేవలం సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు. ఫ్యామిలీ డిన్నర్‌లోనూ సమంత మిస్సింగ్.
మరోవైపు భర్త నాగచైతన్య `లవ్ స్టోరి` చిత్ర ప్రీ రిలీజ్ టైమ్‌లోనూ ఆమె లేరు. చైతూ కోసం బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ హైదరాబాద్‌కి రాగా, సమంత లేరు. ఆ రోజు రాత్రి పార్టీలోనూ సమంత లేదు. వీటన్నింటికి దూరంగా సమంత తన ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేసింది.
దీంతో సమంత, చైతన్య విడిపోతున్నారనే వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది. దీంతో వీరి డైవర్స్ పై అనేక వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ అటు సమంతగానీ, ఇటు చైతూ గానీ స్పందించలేదు. చైతూ చెబుతూ, ఈ వార్తలను తనని బాగా బాధించాయని, వార్తలకు వార్తే సమాధానం చెబుతుందన్నారు. అంతేకాదు డైవర్స్ వార్తల్లో నిజం లేదనే విషయాన్ని చెప్పలేకపోయారు.
మరోవైపు తను స్టార్ట్ చేసిన `సాకీ` ఆన్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం సమంత అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా కూడా ఆమె రూమర్స్ లో నిజం లేదు. తాను ముంబయికి వెళ్లడం లేదని, హైదరాబాదే తన హోమ్ టైన్ అని, ఇక్కడే ఉంటానని స్పష్టం చేసింది. ఇంకా అనేక రూమర్స్ లోనూ నిజం లేదని తెలిపింది. కానీ విడాకుల వార్తలు నిజం కాదని చెప్పలేకపోయింది. ఇవన్నీ వీరిద్దరి మధ్య ఏదో జరిగిందని, ఇంకేదో జరగబోతుందనే వార్తలకు ఊతమిస్తున్నాయి.
ఇదిలా ఉంటే సమంత, చైతూ డైవర్స్ మ్యాటర్‌లో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. డైవర్స్ వార్తలు నిజం కాదని, వీరు తమ ఫ్యామిలీని పెంచుకునే పనిలో ఉన్నారని ఓ వార్త బయటకు వచ్చింది. చైతూ, సమంత బేబీ(పిల్లలు కనేందు)కి ప్లాన్ చేస్తున్నారట. అందుకోసమే సమంత వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుందని, అందులో భాగంగానే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని, కొత్తగా మరే స్క్రిప్ట్ కూడా వినడం లేదని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ కొత్త ట్విస్ట్ మరింత వైరల్‌గా మారింది.