Samantha: వాళ్ళ ముందు సమంత క్రేజ్ పనిచేయలేదా.. బాంబులా పేలుతుంది అనుకుంటే..
నార్త్ లో సమంత పాపులారిటీ క్రమంగా పెరుగుతోంది. రీసెంట్ గా సమంత కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది. ఈ షో సమంతకి నార్త్ లో మంచి మైలేజి తీసుకువచ్చిందనే చెప్పాలి.

నార్త్ లో సమంత పాపులారిటీ క్రమంగా పెరుగుతోంది. రీసెంట్ గా సమంత కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది. ఈ షో సమంతకి నార్త్ లో మంచి మైలేజి తీసుకువచ్చిందనే చెప్పాలి. సమంత, అక్షయ్ కుమార్ కలిసి పాల్గొన్న కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్ హాట్ స్టార్ లో ట్రెండింగ్ లో నిలిచింది. ఈ ఎపిసోడ్ లో సమంత చెప్పిన విషయాల గురించి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చర్చించుకున్నారు.
ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించిన కరణ్ జోహార్ సమంత పర్సనల్ విషయాలని కూడా ప్రస్తావించారు. సమంత కూడా చైతూతో డివోర్స్ గురించి ఓపెన్ అయింది. అలాగే తనకున్న క్రేజ్, డివోర్స్ తర్వాత లైఫ్, బాలీవుడ్ లో అవకాశాలు ఇలా చాలా అంశాల గురించి కరణ్ జోహార్ ప్రశ్నించారు. సమంత కూడా తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చింది.
దీనితో ఈ ఎపిసోడ్ కి హైయెస్ట్ వ్యూస్ వస్తాయని నెటిజన్లు భావించారు. సమంత, అక్షయ్ కుమార్ ఎపిసోడ్ కి మంచి వ్యూస్ వచ్చాయి కానీ భారీ స్థాయిలో అయితే రాలేదు. కాఫీ విత్ కరణ్ సీజన్ 7 ప్రారంభ ఎపిసోడ్ లో అలియా భట్, రణ్వీర్ సింగ్ పాల్గొన్నారు. ఫస్ట్ వీకెండ్ లో ఈ షోకి 12.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అదే సమంత, అక్షయ్ కుమార్ ఎపిసోడ్ కి ఫస్ట్ వీకెండ్ లో 11.6 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. దీనితో సమంత ఎపిసోడ్ అలియా భట్ ఎపిసోడ్ ని బీట్ చేయలేకపోయింది.
సమంత వ్యక్తిగత విషయాల ప్రస్తావన, ప్రస్తుతం ఆమెకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ ఎపిసోడ్ కి భారీ స్థాయిలో వ్యూస్ అంచనా వేశారు. కానీ అది జరగలేదు. ఇదిలా ఉండగా సమంత తొలిసారి కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది.
Ranveer Singh reveals some SHOCKING family secrets on Koffee With Karan Season 7
విడాకుల తర్వాత కొన్ని రోజులు జీవితం కఠినంగా అనిపించింది అని, ఆ తర్వాత తాను మరింత స్ట్రాంగ్ అయ్యానని సామ్ ఈ షోలో పేర్కొంది. ఏది ఏమైనా సమంత ప్రస్తుతం పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు ఆమెకి అవకాశాలు వస్తున్నాయని, నిర్మాతలతో చర్చలు జరుగుతున్నాయని బిటౌన్ లో రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో, అలాగే తానే ప్రధాన పాత్రలో యశోదలో నటిస్తోంది. మరోవైపు గుణశేఖర్ 'శాకుంతలం' చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.