- Home
- Entertainment
- సమంత, దీపికా, కంగనా.. టాప్ సెలెబ్రిటీల స్టన్నింగ్ మేకప్ లుక్స్, దసరాకి యువతులు ట్రై చేయొచ్చు
సమంత, దీపికా, కంగనా.. టాప్ సెలెబ్రిటీల స్టన్నింగ్ మేకప్ లుక్స్, దసరాకి యువతులు ట్రై చేయొచ్చు
స్టైల్ ఐకాన్స్ గా గుర్తింపు పొందిన సినీ హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. సమంత, దీపికాపదుకునే, కంగనా , అలియాభట్ లాంటి సెలెబ్రటీల మేకప్ లుక్స్ ఫాలో అయ్యే యువతులు కూడా ఉన్నారు.

Samantha
స్టైల్ ఐకాన్స్ గా గుర్తింపు పొందిన సినీ హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. సమంత, దీపికాపదుకునే, కంగనా , అలియాభట్ లాంటి సెలెబ్రటీల మేకప్ లుక్స్ ఫాలో అయ్యే యువతులు కూడా ఉన్నారు. ఫెస్టివ్ సీజన్ అంటే యువతుల అలంకరణ కూడా ఉంటుంది. ఫెస్టివ్ సీజన్ లో అంతా అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. సో సమంత, దీపికా లాంటి సెలెబ్రిటీల మేకప్ లుక్స్ మీ ముందుకు తీసుకువస్తున్నాం.
సమంత : సౌత్ లో సమంత గ్లామర్, స్టైల్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. సమంత ఇటీవల బన్సారీ శారీలో కనిపించిన లుక్ అదుర్స్. చిరునవ్వులు చిందిస్తూ.. ఒంటినిండా ఆభరణాలతో సమంత ఆకట్టుకుంది.
దీపికా పదుకొనె : దీపికా పదుకొనె లాంటి క్రేజీ బ్యూటీ కాస్త హాట్ గా కనిపిస్తేనే బావుంటుంది. అందుకే దీపికా ఎలాంటి కాస్ట్యూమ్ ధరించినా ఏదో ఒక విధంగా హాట్ టచ్ ఇస్తుంది. ఈ పిక్ లో శారీలో కనిపిస్తున్న దీపికా.. తన రెడ్ లిప్స్ తో మతిపోగొడుతోంది.
అలియా భట్ : సింపుల్ గా ఉంటూ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకోవడం అలియా భట్ స్టైల్. అలియా ఎప్పుడూ పెద్దగా మేకప్ లేకుండా సింపుల్ గా ఉంటుంది. ఈ పిక్ లో ఆర్ఆర్ఆర్ బ్యూటీ కాటుక కళ్ళు, పాపిడి బిళ్ళతో క్రేజీగా ఉంది.
కంగనా రనౌత్ : హాట్ గా కనిపించడంతో పాటు శారీలో హుందాగా కనిపించడం కూడా కంగనాకి తెలుసు. తలైవి ప్రమోషన్స్ లో భాగంగా కంగనా ఈ శారీలో మెరిసింది.
అనుష్క శర్మ : ఈ పిక్ లో అనుష్క శర్మ డార్క్ లిప్స్, అందమైన ఇయర్ రింగ్స్ తో ఆకర్షిస్తోంది. డ్రెస్ సింపుల్ గా ఉన్నప్పటికీ మేకప్ పరంగా మెప్పిస్తోంది.