- Home
- Entertainment
- ట్రెడిషనల్ లుక్ లో అట్రాక్ట్ చేస్తున్న సమంత.. అందానికే అసూయ పుట్టిస్తున్న స్టార్ హీరోయిన్ గ్లామర్..
ట్రెడిషనల్ లుక్ లో అట్రాక్ట్ చేస్తున్న సమంత.. అందానికే అసూయ పుట్టిస్తున్న స్టార్ హీరోయిన్ గ్లామర్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇటు లేటెస్ట్ అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ అభిమానులనూ ఫిదా చేస్తోంది. ఈ సందర్భంగా కొన్ని పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

చైతూతో డివోర్స్ తీసుకున్న సమంత తన కేరీర్ పైనే పూర్తి శ్రద్ధ వహిస్తోంది. ఈ మేరకు వరుస సినిమాలకు సైన్ చేసుకుంటూ పోతోంది. ఏమాత్రం ఖాళీగా లేకుండా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటూ బిజీయేస్ట్ హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తోంది. సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత ‘పుష్ప’ (Pushpa The Rule)తో రీఎంట్రీ ఇచ్చింది.
ఈ చిత్రంలో ఏకంగా సమంత ఐటెం సాంగ్ లో నటించడం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘ఊ అంటావా మావ’ సాంగ్ లో గ్లామర్ స్టెప్పులేసి కుర్రాళ్లను ఉర్రూతలూగించింది. ఇప్పటికీ ఈ సాంగ్ డీజే బాక్సుల్లో మోత మోగుతూనే ఉంది.
ప్రస్తుతం సమంత తన కేరీర్ లోనే రెండు భారీ చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘యశోద’ (Yashoda), మరోకటి ‘శాకుంతలం’. ఇప్పటికే యశోద మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. తెలుగు, తమిళంతో పాటు హిందీ, మలయాళం, కన్నడలోనూ రిలీజ్ కానుంది.
యశోద మూవీలో సమంతను మునుపెన్నడూ చూడని విధంగా దర్శకులు హరిశంకర్, హరీశ్ నారాయణ చూపించనున్నారు. గతంలో రిలీజ్ అయిన చిత్ర పోస్టర్స్, గ్లింప్స్ కు ఆడియెన్స్ నుంచి తెగ రెస్పాన్స్ వచ్చింది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై నిర్మాత శివలెంక క్రిష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
అటు నేరుగా బాలీవుడ్, అంతర్జాతీయా సినిమాల్లో నటిస్తూ షాకిస్తోంది. సైలెంట్ గా సినిమాలకు సైన్ చేసుకుంటూ పోతోందీ బ్యూటీ. ఈ సందర్భంగా తన అభిమానులతో సోషల్ మీడియా వేదికన టచ్ లో ఉంటోంది. తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ నెట్టింట గ్లామర్ పిక్స్ ను వదులుతోంది.
తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన పలు చిత్రాలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. లెహంగా వోణీ, చూడీదార్ లో, శారీలో సమంత అదిరిపోయే లుక్స్ ను సొంతం చేసుకుంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో స్టార్ హీరోయిన్ అందాలను ఆరబోయడంతో నెటిజన్లు, ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు.