తనలోని ఆధ్యాత్మిక యాంగిల్‌ని చూపించిన సమంత.. షాక్‌లో అభిమానులు
First Published Jan 11, 2021, 4:05 PM IST
సమంత అంటే స్టార్ హీరోయిన్, ట్రెండీ డ్రెస్సుల్లో అందాల విందు ఇస్తూ అభిమానులను సందడి చేస్తుంది. నటిగా వెండితెరపై మెస్మరైజ్ చేస్తుంటుందనేదే తెలుసు. కానీ సమంతలో జనాలకు తెలియని మరో కోణం ఉంది. ఆమెలో ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. తాజాగా దాన్ని బయటపెట్టింది సమంత.

సమంత ఇటీవల ఎయిర్‌పోర్ట్ లో మెరిసింది. ఎయిర్‌పోర్ట్ ఫోటోగ్రాఫర్ ఆమెని బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఆ ఫోటోలు హల్‌చల్ చేశాయి. కానీ సమంత అసలు ఎక్కడికి వెళ్తుందనేది ఎవరూ పట్టించుకోలేదు.

ఇప్పుడు సమంత దాన్ని రివీల్ చేసింది. సద్దురు సేవకు వెళ్లింది. తమిళనాడులోని `ఇషా ఫౌండేషన్`కి వెళారు. అక్కగ భగవాన్ సద్దురుని కలుసుకున్నారు. ఈ సందర్భంగా అనేక విషయాలు ఆయనతో ముచ్చటించారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?