- Home
- Entertainment
- Samantha Comments: ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సమంత... ఐటమ్ సాంగ్ గురించి ఏమన్నదంటే...?
Samantha Comments: ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సమంత... ఐటమ్ సాంగ్ గురించి ఏమన్నదంటే...?
ఒకే ఒక్క పాట సమంత కు ఇంటర్నేషనల్ లెవల్లో ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. చిన్నా పెద్ద సోషల్ మీడియా జనాలను, ఊర్రూతలూగించిన ఊ అంటావా మావా సాంగ్ గురించి సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

పుష్ప సినిమా సూపర్ సక్సెస్ లో సమంత ఐటమ్ సాగ్ భాగం కూడా లేకపోలేదు. ఈ పాటను చివరి నిమిషయంలో ఆడ్ చేసినా..పాట వల్ల సినిమాకు ఎక్కడ లేదు క్రేజ్ వచ్చింది. సమంత ఊ అటావా అంటూ కుర్ర కారును ఊగిసలాడేలా చేసింది.
Samantha
ఇప్పటి వరకూ హీరోయిన్ గా మాత్రమే చేసిన సామ్.. ఈమధ్య ఉమెన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ వస్తోంది. ఇక తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ పుష్ప సినిమా కోసం ఊ అంటావా మావ పాటకు స్టెప్పులేసింది. దీనికోసం ఆమె దాదాపుగా 2 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ సాంగ్ ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక ఊ అంటావా మావాపై సమంత మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సమంత. అంతకు ముందు ఈ సినిమా విడుదల తర్వాత ఈ పాట విషయంలో తను హ్యాపీగా ఉన్నట్లుగా తెలిపిన సమంత.. మరోసారి ఈ సాంగ్ సూపర్ హిట్ అవ్వడంపై మాట్లాడింది.
ఇప్పుడు ఈ పాటకు ఇంత భారీ స్థాయిలో ఆదరణ లభిస్తుందని అస్సలు ఊహించలే దని అంటుంది. రీసెంట్ గా జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ ఫంక్షన్‌కు హాజరైన సమంత ఈ సాంగ్ గురించి మాట్లాడింది. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన సామ్..తన సంతోషాన్ని పంచుకుంది.
పుష్ప పాట గురించి సమం మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను చేసిన ఊ అంటావా మావా సాంగ్‌కు ఈ స్థాయిలో స్పందన వస్తుందని ఊహించలేదు. దేశ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. నేను ఇది కేవలం తెలుగు పాటగానే భావించాను.. కానీ పాన్ ఇండియా స్థాయిలో ఈ పాటకి క్రేజ్ వచ్చిందంటోంది సమంత.
అంతే కాదు నేను ఎక్కడికి వెళ్లినా.. ఇంతకు ముందు నేను చేసిన సినిమాల ప్రస్తావన రావడం లేదు. ఎవరు మాట్లాడినా..ఊ అంటావా మావా పాటలో మీరుబాగా చేశారని చెబుతున్నారు. అలా అటుంటే.. చాలా సంతోషంగా అనిపిస్తుంది.. అని సమంత అన్నారు.
అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పుష్ప సినిమా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రస్తుతం పుష్ప2 కి సంబంధించిన షూటింగ్‌పై చర్చలు నడుస్తున్నాయి.