- Home
- Entertainment
- Samantha:అల్ట్రా స్టైలిష్ లుక్ లో సమంత క్రేజీ ఫోజులు... మ్యాగజైన్ కోసం మరింత హాట్ గా తయారైన స్టార్ లేడీ
Samantha:అల్ట్రా స్టైలిష్ లుక్ లో సమంత క్రేజీ ఫోజులు... మ్యాగజైన్ కోసం మరింత హాట్ గా తయారైన స్టార్ లేడీ
సమంత (Samantha)తన ఫుల్ ఫోకస్ కెరీర్ పై పెట్టి ముందుకు వెళుతున్నారు. విడాకుల ఎపిసోడ్ తో సమంత కొంత డల్ అయ్యారు. కొన్ని నెలలు సినిమాలకు ఆమె విరామం ప్రకటించారు. తీరిక లేని షెడ్యూల్స్ కారణంగా బ్రేక్ తీసుకుంటున్నట్లు సమంత అప్పట్లో ప్రకటించారు.

సమంత నిర్ణయం వెనకున్న అసలు నిజం చైతూ(Naga Chaitanya)తో తలెత్తిన విబేధాలే అని తర్వాత తేలింది. అక్టోబర్ 2న సమంత-నాగ చైతన్య పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. మొత్తంగా రెండు నెలలు ఆమె తీవ్ర మానసిక వేదన అనుభవించారు. దాని నుండి బయటపడడం కోసం సన్నిహితులతో వరుస యాత్రలు చేశారు.
గతాన్ని ఆలోచిస్తూ కూర్చుంటే భవిష్యత్తు ఉండదు. అందుకే సమంత పనిలో బిజీ కావడం ద్వారా, జీవితంలో కొత్త వెలుగులు నింపుకుంటున్నారు. ఆమె వరుస చిత్రాల ప్రకటించడం జరిగింది. అలాగే షూటింగ్స్, మీటింగ్స్ లో విరివిగా పాల్గొంటున్నారు.
ప్రత్యేకించి సమంత ఫోటో షూట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇంస్టాగ్రామ్ లో ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు గ్లామర్ కి కొత్త అర్థం చెబుతున్నాయి. వివిధ మ్యాగజైన్స్, వ్యాపార ప్రకటనలు, ఉత్పత్తుల ప్రమోషన్స్ కోసం సమంత విరివిగా ఫోటో షూట్స్ చేస్తున్నారు.
తాజాగా సమంత ప్రముఖ ట్రావెల్ మ్యాగజైన్ 'ట్రావెల్ లీజర్' ని ప్రమోట్ చేస్తూ సమంత ఓ ఫోటో షూట్ చేశారు. చిరుత స్కిన్ ని పోలిన డిజైన్ కలిగిన ట్రెండీ వేర్ లో ఆమె అల్ట్రా స్టైలిష్ గా కనిపించారు. సమంత లేటెస్ట్ లుక్ సూపర్ బోల్డ్ గా ఉంది. గతంలో సమంత అసలు ఫోటో షూట్స్ చేసేవారు కాదు. కేవలం వ్యక్తిగత ఫోటోలు మాత్రమే పంచుకునేవారు.
విడాకుల ప్రకటన తర్వాత ఆమె ఈ తరహా ఫోటో షూట్స్ అధికంగా చేస్తున్నారు. అలాగే పదేళ్ల కెరీర్ లో సమంత ఒక్క ఐటెం సాంగ్ లో కూడా నటించలేదు. అలాంటిది పుష్ప కోసం ఓ అడల్ట్ లిరిక్స్ తో సాగే, మసాలా సాంగ్ లో హాట్ హాట్ స్టెప్స్ వేశారు. సమంత తన బిహేవియర్ పూర్తిగా మార్చివేయడం జరిగింది.
ఆమెకు నచ్చినట్లు కెరీర్ ని నిర్మించుకుంటూ ముందుకు వెళుతుంది. సమంత ప్రస్తుతం రెండు పాన్ ఇండియా చిత్రాలు చేయడం విశేషం. దర్శకుడు గుణశేఖర్ తెరక్కించిన శాకుంతలం మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
ఇటీవల యశోద పేరుతో ఓ మూవీ ప్రకటించగా... ఇది కూడా ఇండియాలోని ప్రముఖ బాషలలో విడుదల కానుందని సమాచారం. మొత్తంగా వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సమంత వృత్తిపరంగా జెట్ స్పీడ్ తో దూసుకు వెళుతున్నారు. కాగా సమంత తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు.
Also read 2021లో ఒక ఊపు ఊపేసిన ఐటెం సాంగ్స్ ఇవే.. 'భూమ్ బద్దల్ నుంచి 'ఊ అంటావా' వరకు
Also read Pushpa: సమంత ఐటెం సాంగ్ కి బ్రహ్మానందం వర్షన్... చూస్తే మతిపోవాల్సిందే