ముంబయిలో మెరిసిన సమంత.. స్లీవ్‌లెస్ట్ బ్లాక్ జాకెట్, టైట్ టాప్‌లో హాట్‌నెస్ ఓవర్ లోడ్..
స్టార్ బ్యూటీ సమంత.. ఏడాదిపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. విదేశాల్లో రిలాక్స్ అవుతున్న ఆమె అడపాదడపా ముంబయిలో మెరుస్తుంది. చాలా వరకు ఆమె విదేశాల్లోనే గడుపుతుంది. లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది.
సమంత.. ఇటీవల `ఖుషి` చిత్రంతో ఆకట్టుకుంటుంది. పెళ్లైన తర్వాత కొత్త జంట మధ్య ఏర్పడే మనస్పార్థాలు, గొడవలు, అలకలను ఆవిష్కరించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో కలిసి నటించింది. ఈ ఇద్దరి జోడీ బాగా సెట్ అయ్యింది. ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేసింది. ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. వరుసగా పరాజయాల్లో ఉన్న సమంత, విజయ్‌లకు కొంత ఊరటనిచ్చిందని చెప్పొచ్చు.
ఇక ఈ సినిమా షూటింగ్ అనంతరం సమంత.. ఏడాదిపాటు సినిమాలకు బ్రేక్‌ని ప్రకటించింది. తాను హిందీలోనూ నటిస్తున్న వెబ్ సిరీస్ `సిటాడెల్` షూటింగ్ పూర్తయ్యాక తాను సినిమాలు చేయనని, ఏడాది పాటు విశ్రాంతి తీసుకుంటానని, అరోగ్య పరంగా పూర్తి స్థాయిలో కోలుకున్నాక మళ్లీ సినిమాలు చేస్తానని చెప్పింది సమంత.
అందులో భాగంగానే ఆమె ఓవైపు మెడిటేషన్ చేస్తుంది. ఆధ్యాత్మిక సేవలో మునిగితేలింది. ప్రకృతిని ఆస్వాదిస్తుంది. అందమైన లొకేషన్లలో ఎంజాయ్ చేస్తుంది. అప్పుడప్పుడు ఇండియాలో మెరుస్తుంది. ఏదైనా ప్రైవేట్ ఈవెంట్లో కనిపిస్తుందని సందడి చేస్తుంది. తాజాగా ఈ భామ ముంబయిలో మెరిసింది.
ముంబాయిలోని బాంద్రాలో ఆమె కెమెరా కళ్లకి చిక్కింది. చాలా ఫ్రెష్ అందాలతో కనువిందు చేసింది. స్లీవ్‌లెస్ బ్లాక్ జాకెట్, టైట్ డ్రెస్ ధరించింది. బ్లాక్ జీన్స్ వేసుకుని ఓ ప్రముఖ స్టూడియో (క్రోమె) నుంచి ఆమె బయటకు వస్తుంది. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు ఫోటోలకు కోసం ఎగబడ్డారు.
వారికి నవ్వుతూ రియాక్ట్ అయ్యింది. ఇందులో చాలా అందంగా ఉంది సమంత. ఆమె అందం, క్యూట్ నెస్ ఓవర్‌లోడ్ అనేలా ఉండటం విశేషం. ప్రస్తుతం ఆయా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. అయితే ఎక్కువగా విదేశాల్లో కనిపిస్తున్న సమంత ఒక్కసారిగా ముంబయిలో మెరవడంతో అభిమానులు కూడా హ్యాపీ ఫీలవుతున్నారు. తమ అభిమాన తార ఇండియాకి రావడం పట్ల వాళ్లు సంతోషిస్తున్నారు.
స్టూడియో నుంచి బయటకు రావడంతో మళ్లీ సినిమాలు స్టార్ట్ చేస్తుందని ఫీలవుతున్నారు. మరి సమంత ఎప్పుడు కమ్ బ్యాక్ అవుతుంది? మరి నిజంగానే ఆమె సినిమా కోసం ముంబయిలో ఉందా? కొత్త ప్రాజెక్ట్ లను ఓకే చేసే పనిలో ఉందా? అనేది తెలియాల్సి ఉంది. త్వరలో ఆమె `సిటాడెల్` వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకు రానుంది.
మరోవైపు సమంత నటించాల్సిన ఓ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకుంది. సిద్దు జొన్నలగడ్డతో నీరజ కోన రూపొందించే చిత్రంలో హీరోయిన్‌గా సమంతని అనుకున్నారు. అయితే ఆమె స్థానంలో `కేజీఎఫ్` బ్యూటీ శ్రీనిధి శెట్టి వచ్చింది. రాశీఖన్నా మరో హీరోయిన్. ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది.
దీంతో ఇప్పట్లో సమంత సినిమాలు ఓకే చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇండస్ట్రీలో ఎప్పుడూ హీరోలు, హీరోయిన్లు కనిపించాలి. అప్పుడే వారికి మనుగడ, క్రేజ్ ఉంటుంది. ఒక్కసారి ఇండస్ట్రీ నుంచి పక్కకు వెళ్లారంటే వారిని జనాలు మర్చిపోతారు. కొత్త వారి మాయలో పడ పాత వారిని పట్టించుకోవడం మానేస్తారు. అది వారి కెరీర్‌పై ప్రభావం పడుతుంది. మరి సమంతకి దాన్ని ఎలా ఫేస్ చేస్తుందో, ఎలా సస్టెయిన్ అవుతుందనేది చూడాలి.