Samantha: సమంత లేడి విరాట్ కోహ్లీ.. ఇదేం పోలిక, వైరల్ అవుతున్న అతడి కామెంట్స్
సమంత ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా క్రేజీ నటిగా మారిపోయింది. ఫ్యామిలీ మ్యాన్ 2 తో సమంత నార్త్ ఆడియన్స్ కి కూడా చేరువైంది. ఇక గత ఏడాది తన లైఫ్ లో జరిగిన చేదు సంఘటనతో సమంత ఎక్కువగా వార్తల్లో నిలిచింది.

సమంత ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా క్రేజీ నటిగా మారిపోయింది. ఫ్యామిలీ మ్యాన్ 2 తో సమంత నార్త్ ఆడియన్స్ కి కూడా చేరువైంది. ఇక గత ఏడాది తన లైఫ్ లో జరిగిన చేదు సంఘటనతో సమంత ఎక్కువగా వార్తల్లో నిలిచింది. గత ఏడాది సామ్ చైతు విడాకులు తీసుకుని విడిపోయారు. దీనితో సమంత తీవ్రమైన మానసిక వేదన అనుభవించింది.
samantha
అయితే ఇటీవల కొన్ని రోజులుగా సమంత తన వర్క్ విషయంలో యాక్టివ్ గా మారింది. వరుసగా సినిమాలు చేస్తూ, వెకేషన్స్ కి వెళుతూ, సోషల్ మీడియాలో వరుసగా పోస్ట్ లు పెడుతూ బిజీగా గడుపుతోంది.
ఇక సమంత ఫిట్ నెస్ విషయంలో ఎంత కేర్ తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమంత ఎక్కువగా జిమ్ లో చెమటలు చిందిస్తూ అత్యంత కఠినంగా కసరత్తులు చేస్తూ ఉంటుంది. ఇటీవల సమంత పర్సనల్ ఫిట్ నెస్ ట్రైనర్ జునైద్ షేక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సమంతని విరాట్ కోహ్లీతో పోల్చాడు. ఫిట్ నెస్ విషయంలో ఇద్దరికి పోలికలు ఉన్నాయని జునైద్ పేర్కొన్నాడు. ఫిట్ నెస్ విషయంలో విరాట్ కోహ్లీ తన లిమిట్స్ ని పుష్ చేసుకుంటూ వెళతారు. అథ్లెట్స్ ఎవరైనా సరే విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకుంటారు. ఇప్పుడు చాలా మంది నెటిజన్లు సమంతని ఆదర్శంగా తీసుకుని జిమ్ వర్క్ చేస్తున్నారు.
సమంత తరచుగా తన జిమ్ వీడియోలు, ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. వాటిని చూస్తే సామ్ ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో అర్థం అవుతుంది అని జునైద్ పేర్కొన్నాడు.
samantha work out video
ఎంత కష్టమైన ఫిట్ నెస్ వర్క్ అయినా సమంత నేను ట్రై చేస్తా అని చెబుతుంది. ప్రాక్టీస్ చేసి విజయవంతంగా ఫినిష్ చేస్తుంది అని జునైద్ ప్రశంసలు కురిపించాడు. సమంత కూడా ఇటీవల తన ఫిట్ నెస్ ట్రైనర్ గురించి కామెంట్స్ చేసింది. జిమ్ వర్కౌట్ వీడియో పోస్ట్ చేసి 'నా ఫిట్ నెస్ ట్రైనర్ మీకన్నా క్రేజీ'అని కామెంట్ పెట్టింది. ప్రస్తుతం సమంత యశోద, శాకుంతలం చిత్రాల్లో నటిస్తోంది.