ఎట్టకేలకు నోరు విప్పిన సమంత.. నాగచైతన్య తో విడాకులపై సంచలన వ్యాఖ్యలు
ఎట్టకేలకు సమంత నోరు విప్పింది. ఎప్పుడూ ఇండైరెక్ట్ గా తమ విడాకులపై స్పందిస్తూ వస్తున్న సమంతా.. ఈసారి డైరెక్ట్ గా మాట్లాడేసింది. సంచలన నిజాలు బయట పెట్టింది. ఇంతకీ సమంత ఏం మాట్లాడింది.

డివోర్స్ విషయం అనౌన్స్ చేసిన పది నెలల తరువాత ఈ విషయంపై స్పందించింది సమంత, ఇప్పటి వరకూ ఈ విషయంలో డైరెక్ట్ గా మాట్లాడింది లేదు సామ్. గతేడాది అక్టోబర్ మొదటి వారంలో నాగచైతన్య, సమంత విడిపోతున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా తమ విడాకుల ప్రకట చేసిన జంట.. ఆతరువాత ఈ విషయం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.
రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ షో సీజన్ 7 ఎపిసోడ్ 3కు సమంత.. అక్షయ్ కుమార్‌తో కలిసి పాల్గోంది. ఈ సందర్భంగా కరణ్ జోహార్ సమంతను తన పెళ్ళి, విడాకులపై కొన్ని ప్రశ్నలు అడిగారు. దాంతో సమంత ఈ విషయంపై ఫస్ట్ టైమ్ స్పందించింది.
నాగ చైతన్యతో విడిపోయిన తరువాత జీవితం ఎలా ఉంది అని కరణ్ జోహర్ అడగ్గా.. విడాకుల తరువాత తన జీవితం చాలా కష్టంగా మారిందని చెప్పింది సమంత. కాని తాను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాననంటోంది. నాగచైతన్యతో విడిపోవడం అందరూ అనుకుంటున్నట్టు సామరస్యంగా జరగలేదని.. విడిపోయిన తరువాత తాను చాలా మనోవేదనకు గురైనట్లు తెలియజేసింది.
చైతూపై సంచలన వ్యాఖ్యలు చేశారు సమంత. తమ మధ్య చాలా గ్యాప్ ఉందని, ఇద్దరిని ఒక గదిలో పెడితే అక్కడ పదునైన ఆయుధాలు లేకుండా చూసుకోవాలని సమంత తీవ్ర వాఖ్యలు చేశారు. మీ భర్త అంటూ కరణ్ వ్యాఖ్యానించడానికి కూడా సమంత తిప్పి కొట్టారు. మాజీ భర్త అని కరెక్ట్ చేశారు. దాంతో కరణ్ జోహార్ సమంతకు క్షమాపణలు చెప్పి కార్యక్రమం కొనసాగించారు.
ఈ పురుషాదిక్య సమాజంపై కోపంతోనే తాను పుష్పలో సాంగ్ ను చేశానన్నారు సమంత. విడాకులు తీసుకున్నాక ఊ అంటామా మావా పాట చేసే ఛాన్స్ వచ్చిందని. కొంత మంది పురుషుల నైజాన్ని చెప్పడానికి మంచి అవకాశం రావడం, అందులోను తన లాంటి సెలబ్రెటీ చెపితే ప్రభావం ఉంటుంది కనుక తాను ఈ పాట చేయడానికి ఒప్పుకున్నాను అన్నారు సమంత.
భవిష్యత్‌లో ఏం జరుగుతుందో తాను చెప్పలేనుకాని ప్రస్తుతం అయితే తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని అంటోంది సమంత. ఇక చైతూతో విడాకుల తరువాత సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి సమంత మాట్లాడింది. విడాకుల తరువాత చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. నేను వాటిపై ఏం చేయలేకపోయాను అంటోంది సామ్.
అంతే కాదు నేను పారదర్శకంగా ఉండాలని అనుకున్నాను. నా జీవితంలో చాలా విషయాలను చెప్పి విడిపోయాను. సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి నేను పెద్దగా బాధ పడలేదు. ట్రోల్ చేసే వారు నా జీవితాన్నేమి బాగు చేయరు కదా, వాళ్ళేమి నన్ను పోషించరు కదా.. అలాంటప్పుడు వాటి గురించి నేను ఎందుకు స్పందించాలి. అయినా వాటికి నా దగ్గర సమాధానాలు లేవు అని స్పస్టంగా మాట్లాడింది సమంత.
ఇక అసలు విషయానికి వస్తే... తనకు 250 కోట్ల భరణం వచ్చిందన్న వార్తలపై కూడా సమంత క్లారిటీ ఇచ్చింది. నాకు భరణంగా 250 కోట్లు వచ్చాయని పుకార్లు వచ్చాయి. అవి అబద్ధపు ప్రచారాలు అని అందరికి తెలిసిపోయింది. ముఖ్యంగా మీడియాకు తెలిసిపోయింది. అందుకే ఆ రూమర్స్ వాటంతట అవే ఆగిపోయాయి అంటోంది సామ్. ఇలా తన డివోర్స్ గురించి ఫస్ట్ టైమ్ నోరి విప్పింది సామ్.
ఏ మాయ చేశావె సినిమా టైమ్ లో ప్రేమించుకున్నారు నాగ చైతన్య- సమంత. వారి రెండు ప్యామిలీల అంగీకారంతో 2017 అక్టోబర్ 6న పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు. తరువాత 4 ఏళ్ల పాటు వీరు అన్యోన్యంగా ఉన్నారు. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్ లో విడాకులు తీసుకుంటున్నామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
వీని విడాకుల ప్రకటనతో ఫ్యాన్స్,ఆడియన్స్ ,ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే ఈ ప్రకటన తరువాత చాలా పరిణామాలు జరిగాయి. సోషల్ మీడియాలో రకరకాల కథలు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా ఈ విషయంలో చైతూను సపోర్ట్ చేస్తూ.. సమంతను విమర్షిస్తూ ట్రోలింగ్ జరిగింది.సమంతనే కావాలని చైతూకు విడాకులు ఇచ్చిందని.. భర్త అంటే ప్రేమ లేదని.. పిల్లల్ని కనే ఉద్దేశం లేదని.. అబార్షన్లు జరిగాయని.. రకరకాలుగా ట్రోల్ చేశారు నెటిజన్లు
అయితే సోషల్ మీడియాలో ఇంత జరుగుతున్నా...ఈ జంటలో ఎవరూ ముందుకు రాలేదు, డైరెక్ట్ గా మాట్లాడింది లేదు. వీళ్లకు సపోర్ట్ చేస్తున్నాం అనుకునేవారు.. సోషల్ మీడియాలో యుద్దాలు చేసుకున్నారు అంతే. ఇక సమంత కూడా వరుసగా వేదాంత ధోరణిలో సోషల్ మీడియా పోస్ట్ లు పెట్టి తన బాధ చెప్పుకునే ప్రయత్నం చేసింది కాని.. ఎప్పుడు నోరు తెరిచి ఈ విషయంపై మాట్లాడింది లేదు.
ఇక ఒక దశలో ట్రోలింగ్ ముదిరిపోయింది. రకరకాలుగా మాట్లాడటం మొదలెట్టేశారు. నాగచైతన్య 250 కోట్ల భరణం ఇచ్చాడని.. ఇప్పుడు ఉంటున్న ఇల్లు కూడా ఇచ్చేశాడని, కాని వాటిని సమంత కాదనుకుందని కూడా వార్తలు వచ్చాయి. ఇక వీటన్నీంటికి సమాధానంగా సమంత స్పందించారు. విడాకులు అనౌన్స్ మెంట్ అయిన 10 నెలల తరువాత ఆమె నోరు విప్పారు.