- Home
- Entertainment
- మానవ సంబంధాలపై సమంత ఎమోషనల్ పోస్ట్.. స్టైలిష్ ఫొటోస్ షేర్ చేస్తూ వేదాంతం చెబుతున్న సామ్
మానవ సంబంధాలపై సమంత ఎమోషనల్ పోస్ట్.. స్టైలిష్ ఫొటోస్ షేర్ చేస్తూ వేదాంతం చెబుతున్న సామ్
సమంత ఇటీవల తన తల్లితో కలసి చికిత్స కోసం న్యూయార్క్ వెళ్ళింది. కొంతకాలం అక్కడే ఉంది సామ్ ట్రీట్మెంట్ తీసుకోనుంది. ఏడాది కాలంగా సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

ఏడాది కాలంగా సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. సమంత మయోసైటిస్ వ్యాధికి గురైంది. విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుని కాస్త కోలుకుంది. చకచకా యశోద, శాకుంతలం చిత్రాలు పూర్తి చేసిన సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషి చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.
మంచి బజ్ సొంతం చేసుకున్న ఖుషి చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఇదిలా ఉండగా సమంతని మయోసైటిస్ వ్యాధి ఏడాది నుంచి వేధిస్తోంది. ఆ మధ్యన యుఎస్ లో సమంత చికిత్స తీసుకుంది. అయితే పూర్తిగా వ్యాధి నయం కాలేదు. దీనితో సమంత ట్రీట్మెంట్ తీసుకుంటూనే యోగా లాంటి సహజసిద్ధమైన పద్ధతులు పాటిస్తోంది.
ఖుషి చిత్రం పూర్తి చేశాక సమంత సినిమాల నుంచి ఏడాది సమయం బ్రేక్ తీసుకుంది. ఆరోగ్యం కుదుటపడేవరకు ఏ చిత్రానికి అంగీకరించకూడదని సామ్ నిర్ణయించుకుంది. ఇదిలా ఉండగా సమంత ఇటీవల తన తల్లితో కలసి చికిత్స కోసం న్యూయార్క్ వెళ్ళింది. కొంతకాలం అక్కడే ఉంది సామ్ ట్రీట్మెంట్ తీసుకోనుంది.
అయితే సమంత నెటిజన్లకు చిన్న షాక్ ఇచ్చింది. న్యూయార్క్ వెళ్ళగానే ఎంజాయ్ మూడ్ లోకి వెళ్ళిపోయింది సామ్. తన ఫ్రెండ్స్ తో కలసి సిటీ మొత్తం చక్కర్లు కొడుతోంది. చికిత్స అన్ని సమయాల్లో ఉండదు కాబట్టి సామ్ ఇలా ఎంజాయ్ చేస్తోంది అని అంటున్నారు.
తాజాగా సమంత న్యూయార్క్ లో స్టైలిష్ గా ఉన్న పిక్స్ షేర్ చేసింది. ఈ పిక్స్ కి సామ్ ఆసక్తికర క్యాప్షన్ కూడా ఇచ్చింది. మానవ సంబంధాలపై సామ్ వేదాంత ధోరణిలో కామెంట్స్ చేసింది.
ఈ భూమి మీద ఉన్న జీవులన్నింటికీ సంబంధం ఉంది. మన చేతులు గబ్బిలం రెక్కల లాగా ఉంటాయి. మన కణాలు పైనాపిల్ కణాల లాగా ఉంటాయి. మన డి ఎన్ ఏకి పుట్టగొడుగులతో సంబంధాలు ఉన్నాయి.
ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి మరో జీవితో సంబంధం ఉంటుంది. కాకపోతే కొంచెం దగ్గరా లేదా దూరంగా అంతే.. మనం అంతా ఒక కణం నుంచి ఉద్భవించిన వాళ్ళమే అని సమంత క్యాప్షన్ ఇచ్చింది.