మయోసైటిస్ తో సమంత పోరాటం..స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల కొత్త సమస్య, ముఖంలో మార్పులపై ఇలా..
ఖుషి చిత్రం పూర్తి చేశాక సమంత సినిమాల నుంచి ఏడాది సమయం బ్రేక్ తీసుకుంది. ఆరోగ్యం కుదుటపడేవరకు ఏ చిత్రానికి అంగీకరించకూడదని సామ్ నిర్ణయించుకుంది.
ఖుషి చిత్రం పూర్తి చేశాక సమంత సినిమాల నుంచి ఏడాది సమయం బ్రేక్ తీసుకుంది. ఆరోగ్యం కుదుటపడేవరకు ఏ చిత్రానికి అంగీకరించకూడదని సామ్ నిర్ణయించుకుంది. ఇదిలా ఉండగా సమంత ఇటీవల తన తల్లితో కలసి చికిత్స కోసం న్యూయార్క్ వెళ్ళింది. దీనితో సమంత ఖుషి మ్యూజిక్ కన్సర్ట్ తప్ప ఇతర ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయింది. అయితే ఖుషి చిత్రం విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
యుఎస్ టూర్ ముగించుకుని ఇటీవల సమంత ఇండియా తిరిగి వచ్చింది. ఏడాది కాలంగా సమంత మయోసైటిస్ వ్యాధితో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ కారణంగా సమంత పూర్తిస్థాయిలో సినిమాలకు సమయం కేటాయించలేక పోతోంది.
అయితే ఇటీవల ఎక్కువగా ఆధ్యాతిక ప్రాంతాల్లో సందర్శిస్తూ యోగ, పూజలు చేస్తోంది. తన ఆరోగ్యం కుదుటపడడం కోసం సమంత చేయని ప్రయత్నం అంటూ లేదు. అమెరికా నుంచి తిరిగి వచ్చాక సమంత అభిమానులతో సోషల్ మీడియాలో లైవ్ వీడియో సెషన్ నిర్వహించింది.
ఈ లైవ్ లో సమంత ముఖంలో కంగారుగా అనిపించే మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె స్కిన్ గ్లో దెబ్బతిన్నట్లు అర్థం అవుతోంది. దీనితో ఓ అభిమాని మీ స్కిన్ కి ఏమైంది అని ప్రశ్నించారు. సమంత బదులిస్తూ మయోసైటిస్ ట్రీట్మెంట్ లో భాగంగా నేను చాలా స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వస్తోంది. ఆ స్టెరాయిడ్స్ ప్రభావం స్కిన్ పై ఇలా పడుతోంది అని సమంత తెలిపింది.
అయితే మరీ ఇంతలా ఎందుకు అవుతోందో నాకు అర్థం కావడం లేదు.తన స్కిన్ ప్రాబ్లెమ్ ని పరిష్కరించే బాధ్యత చిన్మయి తీసుకుందని సమంత సరదాగా తెలిపింది. మునుపటిలా నా స్కిన్ మార్చే భాద్యత నాదే అని చిన్మయి ప్రామిస్ చేసినట్లు సమంత తెలిపింది. స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఇలా స్కిన్ అలర్జీ కి కారణం అవుతోందని సమంత పేర్కొంది.
samantha
ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగించుకునేందుకు సమంత సినిమాల నుంచి ఏడాది బ్రేక్ తీసుకుంది. సమంత చివరగా ఖుషి, సిటాడెల్ షూటింగ్ పూర్తి చేసింది. భవిష్యత్తు ప్రాజెక్ట్స్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. అయితే సమంతకి ఒకదాని తర్వాత మరో సమస్య ఎదురవుతుండడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.