చాలా కాలం తరువాత ఇష్టమైన ఫుడ్ తిన్న సమంత, ఎమోషనల్ పోస్ట్ వైరల్..
మయోసైటిల్ వల్ల చాలా ఇబ్బందులు పడింది సమంత. తనకు నచ్చినవి చాలా వదులుకోవల్సి వచ్చింది. తాజాగా తాను ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ ను కూడా ఆపానంటూ... ఎమోషనల్ పోస్ట్ పెట్టింది బ్యూటీ.
ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానంతో పాటు.. ఫ్యాన్ బేస్ ను కూడా సాధించింది సమంత. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఏమాత్రం బెదరకుండా.. లైఫ్ ను లీడ్ చేస్తోంది సమంత. వరుస సినిమాలతో తన టైమ్ ను బిజీ చేసుకుని.. కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ చేదుజ్ఞాపకాలు మరిచిపోతుంది.
ఇష్టపడి నాగచైతన్యను పెళ్ళాడితే.. ఆ పెళ్ళి పెటాలకులవడం.. బాగా కృంగిపోయింది సమంత, ఆతరువాత కోలుకుని సినిమాలు చేసుకుంటుంటే.. మయోసైటిస్ అనే మహమ్మరి రోగం ఆమెను ఇంకా ఇబ్బందులోకి నెట్టింది. ప్రస్తుతం దానితో పోరాడుతూ.. అంత ఇబ్బందుల్లో కూడా తనసినిమాలు కంప్లీట్ చేసింది సమంత.
Samantha Ruth Prabhu
ప్రస్తుతం సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చిన సమంత ట్రీట్మెంట్ తీసుకుంటూ.. ఖాళీ టైమ్ ను విదేశాల్లో టూర్లు వేస్తూ గడిపేస్తోంది. నచ్చిన ప్రాంతాలకు తిరుగుతూ.. హ్యాపీగా ఉండటానికి ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా ఖుషి సినిమాతో మంచి సక్సెస్ సాధించిన సమంత.. నెక్ట్స్ తాను చేసే సినిమాలపై క్లారిటీ ఇవ్వలేదు.
తనకు ఎంతో ఇష్టమైన ఫుడ్‌ను కూడా తీసుకోవట్లేదు. ముఖ్యంగా బ్రెడ్‌ను పూర్తిగా తినటం మానేసింది. ఈ క్రమంలోనే దాదాపు ఏడాది తర్వాత ఇప్పుడు తనకు ఎంతో ఇష్టమైన బ్రెడ్డును బట్టర్‌తో కలిపి తిన్నట్లు సామ్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దాదాపుగా ఒక సంవత్సరం నాలుగు నెలల తర్వాత బ్రెడ్డు ముక్కల్ని తింటున్నా అని పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.
ఇక ప్రస్తుతం తాజాగా సమంత పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమె తనకు ఇష్టమైన ఫుడ్ గురించి ఓ పోస్ట్ పెట్టింది. తాను మయోసైటిస్ వల్ల చాలాకోల్పోయింది. నిలబడటం కూడా సాధ్యం కాక కష్టపడింది. ఇక తనకు ఎంతో ఇష్టమైన ఫుడ్ కూడా మానేయాల్సి వచ్చింది. దాంతో ఆఫ్టర్ వన్ ఇయర్.. తాను ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ ను తీసుకుందట సామ్.
ఖుషి మూవీ పూర్తి చేశాక సమంత సినిమాల నుంచి ఏడాది సమయం బ్రేక్ తీసుకుంది. ఆరోగ్యం కుదుటపడేవరకు ఏ చిత్రానికి అంగీకరించకూడదని సామ్ నిర్ణయించుకుంది. ఇదిలా ఉండగా సమంత ఇటీవల తన తల్లితో కలసి చికిత్స కోసం న్యూయార్క్ వెళ్ళింది. కొన్ని రోజులు అక్కడ చికిత్స తీసుకుని తిరిగి వచ్చింది.