- Home
- Entertainment
- Samantha:ఎవరేమనుకుంటే నాకేంటీ... ప్రీతమ్ కి సేవలు చేస్తున్న సమంత... ఆపై డబ్బులు డిమాండ్
Samantha:ఎవరేమనుకుంటే నాకేంటీ... ప్రీతమ్ కి సేవలు చేస్తున్న సమంత... ఆపై డబ్బులు డిమాండ్
సీతయ్య ఎవరి మాటా వినడు... ఈ డైలాగ్ అప్పట్లో పిచ్చ ఫేమస్. రియల్ లైఫ్ లో సమంత ఈ డైలాగ్ తూచా తప్పకుండా పాటిస్తుంది. ఎవరేమనుకుంటే నాకేంటి నేనేంటో నాకు తెలుసు, నచ్చినట్లు ఉంటానంటూ ముందుకెళుతోంది.

Samantha
సమంత-నాగ చైతన్యల (Naga Chaitanya)విడాకులు నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. ఇద్దరూ టాప్ సెలబ్రిటీలు కావడంతో ఈ వార్త పతాక శీర్షికలకు ఎక్కింది. నెలల తరబడి మీడియాలో దీనిపై చర్చ నడిచింది. ముఖ్యంగా సమంత-చైతూ విడిపోవడానికి గల కారణాలేమిటనే డిబేట్లు నడిచాయి. ఈ క్రమంలో అనేక పుకార్లు తెరపైకి వచ్చాయి.
Samantha
ఈ వివాదంలో సమంత(Samantha)దే తప్పు అన్నట్లు వార్తలు వచ్చాయి. ఆమెకు కొన్ని తప్పులు ఆపాదించారు. వాటిలో ప్రధాన ఆరోపణ తన పర్సనల్ స్టైలిష్ ప్రీతమ్ జుకల్కర్ తో ఎఫైర్. చాలా కాలంగా స్టైలిష్, సెలబ్రిటీ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ సమంత వద్ద పని చేస్తున్నారు. సమంత జుకల్కర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.
Samantha
ఈ క్రమంలో వారిద్దరూ కొంచెం సన్నిహితంగా ఫోటోలు కూడా దిగారు. వీటిని ఆధారంగా చూపుతూ సమంత-ప్రీతమ్ (Preetham Jukalker)మధ్య ఎఫైర్ ఉందని కథనాలు రాశారు. దీంతో ప్రీతమ్ పై మండిపడ్డ అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో అతనికి టార్చర్ చూపారు. చివరకు ప్రీతమ్.. సమంతను నాకు అక్క లాంటిది, మా మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో చైతూకు తెలుసు అంటూ వివరణ ఇచ్చాడు.
Samantha
వారి స్నేహంపై ఇంత పెద్ద అపవాదు పడినా కూడా సమంత ప్రీతమ్ తో సన్నిహితంగానే ఉంటున్నారు. వివాదం సద్దుమణగక ముందే అతనితో కలిసి దుబాయ్ టూర్ వెళ్ళింది. తాజాగా ప్రీతమ్ తో ఫన్ మూమెంట్స్ కి సంబంధించిన షార్ట్ వీడియో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసింది.
Samantha
సమంత ప్రీతమ్ కి స్వయంగా హెయిర్ కట్ చేశారు. సదరు వీడియో షేర్ చేసిన సమంత... నేను మల్టీ టాలెంటెడ్. నేను చేసిన ఈ సర్వీస్ కి నువ్వు ఇంకా డబ్బులు చెల్లించలేదు.. అంటూ కామెంట్ పెట్టింది. దానికి నన్ను ఇప్పుడే చంపు.. అంటూ ప్రీతమ్ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Samantha
మరోవైపు నటిగా సమంత ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమాలు, సిరీస్లు చేస్తూ ముందుకెళుతున్నారు. సమంత నటించిన బైలింగ్వల్ మూవీ కాతు వాకుల రెండు కాదల్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుండగా... యశోద చిత్రీకరణ దశలో ఉంది. ఈ రెండు పాన్ ఇండియా చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి.