అప్పటికి సమంత ఆ వ్యాధిబారిన పడలేదు... కీలక విషయాలు వెల్లడించిన నటి వరలక్ష్మి!
సమంత ఆరోగ్య పరిస్థితిపై నటి వరలక్ష్మి స్పందించారు. సమంతతో పాటు యశోద చిత్రంలో నటించిన ఆమె ఓ కీలక విషయాన్ని వెల్లడించారు.

Samantha
రెండు రోజులుగా సమంత అభిమానులు, చిత్ర ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమంతకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సమంతకు మానసికంగా మద్దతు తెలుపుతున్నారు. సమంత తనకు మయోసైటిస్ సోకినట్లు వెల్లడించగా అందరూ షాక్ అయ్యారు. ఈ అరుదైన వ్యాధి సమంతకు ఎలా సోకిందని ఆవేదన చెందుతున్నారు.
samantha about her disease
మయోసైటిస్ సాధారణంగా 15 ఏళ్ళ లోపు పిల్లలకు లేదా 45 ఏళ్ళు పైబడిన వాళ్లకు మాత్రమే సోకుతుంది. యుక్త వయసులో ఉన్న సమంత మాయోసైటిస్ బారినపడడం ఎవరూ నమ్మలేకుకున్నారు. అదే సమయంలో ఈ మధ్య కెరీర్ పరంగా, పెర్సనల్ గా లైఫ్ లో సంభవించిన ఘటనలు కూడా కావచ్చని కొందరు అంచనా వేస్తున్నారు.
విడాకుల నేపథ్యంలో సమంత డిప్రెషన్ అనుభవించారు. నెలల తరబడి సమంత మానసిక వేదనకు గురయ్యారు. ఇది కూడా ఒక కారణం కావచ్చు. ముఖ్యంగా ఆమె అతిగా వ్యయామం చేయడం ఈ వ్యాధికి దారితీసింది అంటున్నారు. ది ఫ్యామిలీ మాన్ సిరీస్ కోసం సమంత హెవీ వర్క్ ఔట్స్ చేసి జీరో సైజ్ ప్యాక్ సాధించారు. అప్పటి నుండి ఆమె కఠిన వ్యాయామాలతో పర్ఫెక్ట్ అండ్ ఫిట్ బాడీ మారిటైం చేస్తున్నారు.
Samantha
సమంత జిమ్ లో బరువులు ఎత్తే వ్యాయామాలు ఎక్కువగా చేస్తుంటారు. ఈ క్రమంలో కండరాలపై ఒత్తిడి పెరిగి ఈ సమస్య ఏర్పడి ఉండవచ్చు అనే వాదన ఉంది.కారణం ఏదైనా సమంత పెద్ద సమస్యలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో నటి వరలక్ష్మి ఓ కీలక విషయాన్ని బయటపెట్టారు.
Samantha
సమంత నాకు గత 12ఏళ్లుగా తెలుసు. చెన్నైలో మాకు పరిచయం ఏర్పడింది. యశోద మూవీలో తనతో కలిసి నటించాను. షూటింగ్ సెట్స్ లో ఇద్దరం చాలా సరదాగా గడిపేవాళ్ళం. చెన్నైలో గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకొని నవ్వుకునేవాళ్ళం. ఆమెకు ఆరోగ్యం బాగోలేదని అప్పటి మాకు తెలియదు.
ఎందుకంటే సమంత చాలా ఎనర్జిటిక్ గా ఉండేవారు. ఒకవేళ యశోద షూటింగ్ తర్వాత ఆమెకు ఈ వ్యాధి సోకి ఉండవచ్చు. ఈ సమస్య నుండి యశోద బయటపడుతుంది. ఎందుకంటే ఆమె గొప్ప ఫైటర్, అంటూ వరలక్ష్మి చెప్పుకొచ్చారు. యశోద చిత్రం నవంబర్ 4న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది.