- Home
- Entertainment
- Samantha : దర్శకుడితో సమంత డేటింగ్ ? మరో మహిళ జీవితాన్ని నాశనం చేయకు అంటూ దారుణంగా ట్రోలింగ్
Samantha : దర్శకుడితో సమంత డేటింగ్ ? మరో మహిళ జీవితాన్ని నాశనం చేయకు అంటూ దారుణంగా ట్రోలింగ్
Samantha and Raj Nidimoru : సమంత రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో పాటు, సిటాడెల్ అనే సిరీస్ లో కూడా నటించింది. ఈ రెండు సమంతకి పాన్ ఇండియా గుర్తింపు తీసుకువచ్చాయి.

Samantha ruth prabhu, Raj Nidimoru
Samantha and Raj Nidimoru : సమంత సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్. సమంత, నాగ చైతన్యతో ప్రేమ పెళ్లి, ఆ తర్వాత జరిగిన విడాకులు కూడా చర్చకు దారితీశాయి. సమంత ఇప్పుడు తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను అధిగమించి తన నటనా జీవితంలో ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఓ ఫోటో చర్చనీయాంశంగా మారింది.
Samantha
సమంత రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో పాటు, సిటాడెల్ అనే సిరీస్ లో కూడా నటించింది. ఈ రెండు సమంతకి పాన్ ఇండియా గుర్తింపు తీసుకువచ్చాయి. ఫ్యామిలీ మ్యాన్ దర్శకులలో ఒకరైన రాజ్ నిడమూరుతో సమంత క్లోజ్ గా ఉందనే రూమర్స్ కొంత కాలంగా ఎక్కువగా వినిపిస్తున్నాయి.
Raj Nidimoru
రాజ్ తో సమంత డేటింగ్ లో ఉన్న విషయం దాదాపుగా ఖాయం అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. దానికి కారణం సమంత ఓపెన్ గా షేర్ చేసిన కొన్ని ఫోటోలు. పిక్ బాల్ లీగ్ మ్యాచ్ చూసేందుకు రాజ్, సమంత కలసి వచ్చారు. సమంత రాజ్ తో చాలా సన్నిహితంగా ఉన్నట్లు ఈ ఫొటోస్ ద్వారా అర్థం అయింది. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు కాబట్టే అంత క్లోజ్ గా ఉంటున్నారు అని నెటిజన్లు అంటున్నారు.
Raj Nidimoru
దీనితో సమంతపై ఊహించని విధంగా ట్రోలింగ్ మొదలైంది. అందుకు కారణం రాజ్‌కి పెళ్లయి ఉండడమే. రాజ్ కుటుంబంతో నివసిస్తున్నారని, అతనితో ఉన్న ఫోటోను పబ్లిక్‌గా షేర్ చేయకూడదని విమర్శలు వస్తున్నాయి. సమంత పోస్ట్‌కు నెటిజన్లు ఈ విధంగా స్పందిస్తున్నారు. 'మీ పెళ్లి బంధం విచ్ఛిన్నమైంది, మరో మహిళ జీవితాన్ని నాశనం చేయవద్దు' అని వ్యాఖ్యానించారు.అంటే రాజ్ కుటుంబాన్ని నాశనం చేయవద్దు అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.
Samantha
ఇదిలా ఉండగా, రాజ్అ, తని భార్య దూరంగా ఉన్నారని కొన్ని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. త్వరలో వీరిద్దరూ విడిపోతారని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే రాజ్, సమంత మంచి స్నేహితులని అభిమానులు అంటున్నారు. రాజ్ తో డేటింగ్ నిజమో కాదో సమంత క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది.