Samantha: ప్రీతమ్ తో సమంత డేట్ నైట్.. మినీ డ్రెస్ లో హంగామా, ఫోటోలు వైరల్
సినిమాల పరంగా సమంత జోరు పెంచింది. ఏప్రిల్ 28న సమంత నటించిన కన్మణి రాంబో ఖతీజా అనే చిత్రం విడుదలయింది. అలాగే సమంత పాన్ ఇండియా మూవీ యశోద కూడా త్వరలో రిలీజ్ కాబోతోంది.

సినిమాల పరంగా సమంత జోరు పెంచింది. ఏప్రిల్ 28న సమంత నటించిన కన్మణి రాంబో ఖతీజా అనే చిత్రం విడుదలయింది. అలాగే సమంత పాన్ ఇండియా మూవీ యశోద కూడా త్వరలో రిలీజ్ కాబోతోంది. నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత బాగా బిజీగా మారిపోయింది. బాలీవుడ్ లో కూడా నటించేందుకు సామ్ రెడీ అవుతోంది.
అందుతున్న సమాచారం మేరకు సమంత ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సమంత ముంబైలో ఇల్లు కొన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వస్తుండడంతో సమంత తన మకాం ముంబైకి మార్చిందట.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత తరచుగా తన ఫోటోస్, ఇంటరెస్టింగ్ వీడియోస్ షేర్ చేస్తోంది. జిమ్ వర్కౌట్స్, తన ఇంట్లో ఉన్న పెట్స్ అల్లరిని అభిమానులతో పంచుకుంటోంది. ఇదిలా ఉండగా సమంత తాజాగా ఊహించని షాక్ ఇచ్చింది.
తన స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో కలసి సామ్ డేట్ నైట్ కి వెళ్ళింది. వీరిద్దరితో పాటు సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ కూడా ఉన్నారు. ఈ ఫోటోలని స్వయంగా సమంత డేట్ నైట్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫ్యాన్స్ కి ఇది ఊహించని షాక్ గా మారింది.
సమంత, ప్రీతమ్ లు బెస్ట్ ఫ్రెండ్స్. అయినప్పటికీ చైతుతో బ్రేకప్ సమయంలో ప్రీతమ్ గురించి అనేక రూమర్స్ వినిపించాయి. ఈ రూమర్స్ ని సామ్, ప్రీతమ్ ఇద్దరూ తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం సామ్ ఆ విషయాలన్నీ పక్కన పెట్టి వర్క్ పై ఫోకస్ పెడుతోంది. ఇలా సరదాగా వీరు ముగ్గురూ డేట్ నైట్ కి వెళ్లిన పిక్స్ షేర్ చేశారు. మరి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
సమంత మాత్రం ఈ పిక్స్ హాట్ గా క్యూట్ గా కనిపిస్తోంది. ఫ్రంట్ జిప్ రెడ్ మినీ డ్రెస్ ఓ సమంత హాట్ గా కనిపిస్తోంది. కానీ వీరు ముగ్గురూ క్యూట్ గా హంగామా చేస్తూ సెల్ఫీలకు ఫోజులు ఇచ్చారు.
ఇక సినిమాల విషయానికి వస్తే సమంత నటించిన యశోద చిత్రం ఆగష్టు 12న రిలీజ్ కి రెడీ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ప్రేక్షకులని అలరించబోతోంది. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ 'శాకుంతలం' చిత్రంలో కూడా నటించింది. విజువల్ వండర్ గా రాబోతున్న ఈ పౌరాణిక చిత్రంలో సామ్ టైటిల్ రోల్ పోషిస్తోంది.