- Home
- Entertainment
- Samantha: పూల శారీలో కుందనపు బొమ్మలా సమంత.. ట్రెడిషనల్ లుక్‌లో ఇంత క్యూట్‌గానా.. ఇంటర్నెట్ షేకింగ్
Samantha: పూల శారీలో కుందనపు బొమ్మలా సమంత.. ట్రెడిషనల్ లుక్‌లో ఇంత క్యూట్‌గానా.. ఇంటర్నెట్ షేకింగ్
సమంత సోషల్ మీడియాలో ట్రెడిషనల్‌గా కనిపించి చాలా రోజులవుతుంది. బయట చీరలో మెరిసినా, సోషల్ మీడియాలో మాత్రం ఆమె ట్రెండీ వేర్‌లో, పొట్టి దుస్తుల్లోనే ఎక్కువగా కనిపించింది.

స్టార్ హీరోయిన్ సమంత.. తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోయింది. ఆమె కాజ్వల్ శారీ ధరించింది. పూల పూల శారీలో కట్టి ఫోటోలకు పోజులిచ్చింది. ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ శారీ ఫోటో ఆద్యంతం కట్టిపడేస్తుంది. వాటికి తనే బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తుంది.
తన సాకీ దుస్తుల బ్రాండ్‌కి సంబంధించిన డిజైన్‌ని ప్రదర్శించింది సమంత. వాటిని ధరించి ఫోటో షూట్ చేసింది. మోడల్ గర్ల్ లా పోజులిచ్చింది. ఇందులో ఆమె ఫోటో షూట్ పిక్స్ నెటిజన్లని కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఆయా ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే చాలా రోజుల తర్వాత సమంత ఇలా ట్రెడిషనల్ లో కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
సమంత మూడేళ్ల క్రితమే సాకి ఆన్‌లైన్ దుస్తుల బ్రాండ్‌ని ప్రారంభించింది. ఇతరుల భాగస్వామ్యంలో ఆమె దీన్ని స్థాపించింది. ఇది విజయవంతంగా రన్ అవుతుంది. అయితే దీన్ని సమంతనే సొంతంగా బ్రాండ్ అంబాసిడర్‌లా వ్యవహరిస్తుంది. తనే మోడల్‌గా ప్రమోట్ చేస్తుంది.
ఇక సమంత `సాకి` దుస్తులతోపాటు `ఏకం` పేరుతో ఎర్లీ లెర్నింగ్ స్కూల్‌ని కూడా నడిపిస్తుంది. మరోవైపు ప్రత్యుష పేరుతో ఓ ఎన్జీవోని రన్ చేస్తుంది సమంత. ఇలా ఓ వైపు సినిమాలతోపాటు వ్యాపారాల్లోనూ దూసుకుపోతుంది. మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ నాలుగు దారుల్లోనూ సంపాదిస్తుంది. గట్టిగానే వెనకేసుకుంటుంది.
సమంత సినిమా కెరీర్ ఒడిదుడుకులతోనే సాగుతుందని చెప్పాలి. విడాకుల తర్వాత, తన అనారోగ్యం తర్వాత ఆమె `యశోద`, `శాకుంతలం` చిత్రాల్లో మెరిసింది. `యశోద` మూవీ ఫర్వాలేదనిపించింది. బాగానే కమర్షియల్‌గా ఆడింది. కానీ `శాకుంతలం` బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా సమంతని బాగా కుంగదీసిందని చెప్పొచ్చు.
ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగాఉంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో `ఖుషి` సినిమాలో నటిస్తుంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా, ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది. దీంతోపాటు `సిటాడెల్` అనే వెబ్ సిరీస్‌లోనూ నటిస్తుంది. మరోవైపు హిందీలో ఒకటి రెండు సినిమాలకు కమిట్ అయ్యిందని సమాచారం. ఓ అంతర్జాతీయ మూవీ కూడా చేస్తుంది సామ్.
నటిగా సమంత ఇప్పుడు కెరీర్ పరంగా పీక్‌లో ఉంది. ఆమె స్టార్ హీరోలకు దీటుగా ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. క్రేజ్, ఇమేజ్, పాపులారిటీ ఇలా అన్ని విషయాల్లో సమంత హీరోలకు తక్కువ తినలేదు. ఓ రకంగా లేడీ సూపర్‌స్టార్‌గా మారబోతుందీ హాట్ హీరోయిన్. ఒకటి రెండు సక్సెస్‌లు పడితే సమంత రేంజ్ మారిపోతుందని చెప్పొచ్చు.