- Home
- Entertainment
- డబ్బులిచ్చి నెంబర్‌వన్ హీరోయిన్ అయ్యా.. సమంత వివాదాస్పద వ్యాఖ్యలు.. నెట్టింట దుమారం
డబ్బులిచ్చి నెంబర్‌వన్ హీరోయిన్ అయ్యా.. సమంత వివాదాస్పద వ్యాఖ్యలు.. నెట్టింట దుమారం
సమంత ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారుతున్న హీరోయిన్. ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న నటి కూడా. ఈ క్రమంలో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను నెంబర్ వన్ హీరోయిన్ అనే దానిపై స్పందిస్తూ షాకిచ్చారు.

సమంత(Samantha) టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్. తెలుగు, తమిళంలో ఆమెకి తిరుగేలేదు. ఇప్పుడు హిందీలో మార్కెట్ పెంచుకుంటుంది. `ది ఫ్యామిలీ మ్యాన్ 2`, `పుష్ప`లో ఐటెమ్ సాంగ్‌తో నార్త్ లో విపరీతమైన క్రేజ్‌ని ఏర్పర్చుకుంది సమంత. మరోవైపు ఇటీవల పాపులర్ షో `కాఫీ విత్ కరణ్`(Koffee with Karan)లో పాల్గొని మరింత క్రేజ్‌ని, పాపులారిటీని సొంతం చేసుకుంది.
దీంతోపాటు తన మాజీ భర్త నాగచైతన్యతో విడాకులపై స్పందించిన తీరు సైతం దుమారం రేపుతున్నాయి. చైతూ విషయంలో సమంత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇదే `కాఫీ విత్ కరణ్` షోలో మరో సెన్సేషనల్ కామెంట్ చేసింది సమంత. ఇటీవల సమంత `ఓర్ మాక్స్` (Ormax)అనే రేటింగ్ సంస్థ ఇచ్చిన ర్యాంకింగ్‌లో సమంత ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్‌గా నిలిచింది.
తరచూ వార్తల్లో నిలవడం, ఇండియా వైడ్‌గా క్రేజ్, పాపులారిటీ, సినిమాలు, ఫాలోయింగ్ ఇలా అనేక విషయాలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చే ఈ రేటింగ్‌లో సమంత నెంబర్ వన్ గా నిలవడం విశేషం. అయితే దీనిపై కరణ్ జోహార్ ప్రశ్నించారు. `ఓర్‌మాక్స్ సంస్థ సర్వేలో నెంబర్ వన్ స్థానాన్ని ఎలా దక్కించుకున్నారు? అని ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ పెద్ద బాంబ్ పేల్చింది సమంత.
సమంత చెబుతూ, నిజం చెప్పనా అంటూ తాను ఆ సంస్థకి భారీ మొత్తంలో డబ్బు ఇచ్చానని తెలిపింది. దీంతో కరణ్‌తోపాటు అక్షయ్ కూడా నవ్వులు పూయించారు. అయితే సమంత ఈ సందర్భంగా సరదాగా కామెంట్ చేసినా ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వివాదంగా మారాయి. సమంత అంత సెటైరికల్‌గా సమాధానం చెప్పడం పట్ల కొంత మంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆమెని ట్రోల్స్, మీమ్స్ తో వైరల్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే సమంత బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. `శాకుంతలం`, `యశోద`, `ఖుషి`తోపాటు తెలుగు, తమిళంలో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తుంది. అలాగే హిందీలోకి ఎంట్రి ఇస్తూ ఆయుష్మాన్ ఖురానాతో ఓ చిత్రానికి కమిట్ అయ్యిందట. దీంతోపాటు అక్షయ్ కుమార్‌తోనే మరో సినిమాకి కన్ఫమ్ అయినట్టు సమాచారం. ఇది మైథలాజికల్ స్టోరీగా తెరకెక్కనుందని తెలుస్తుంది. దీంతోపాటు ఓ అంతర్జాతీయ మూవీలో నటిస్తుంది సమంత.