- Home
- Entertainment
- సమంత బాలీవుడ్ ఎంట్రీకి లైన్ క్లీయర్?.. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు.. డిటెయిల్స్ తెలిస్తే వాహ్ అనాల్సిందే!
సమంత బాలీవుడ్ ఎంట్రీకి లైన్ క్లీయర్?.. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు.. డిటెయిల్స్ తెలిస్తే వాహ్ అనాల్సిందే!
స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ పరంగా జోరుపెంచింది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది. ఇక లేటెస్ట్ గా బాలీవుడ్ ఎంట్రీ కూడా ఫిక్స్ చేస్తుందట. అక్కడ సమంత జాక్‌పాట్ కొట్టినట్టు తెలుస్తుంది.

సమంత(Samantha) ఇప్పుడు బ్రేకుల్లేని బుల్డోజర్ అని చెప్పొచ్చు. ఆమె చేసే సినిమాలను చూస్తుంటేనే అర్థమవుతుంది. తెలుగు సినిమాల నుంచి, పాన్ ఇండియా సినిమాలు, ఇంటర్నేషనల్ మూవీస్ వరకు చేస్తుంది. ఇప్పటికే ఐదు సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె కెరీర్ పరంగా మరో ముందడుగు వేసింది. బాలీవుడ్‌లోకి అడుగుపెడుతుంది.
సమంతకి `ది ఫ్యామిలీ మ్యాన్2`తో హిందీలో మంచి మార్కెట్ ఏర్పడింది. అందులో రాజీ పాత్రలో నటించి నార్త్ ఆడియెన్స్ ని అలరించింది. అద్భుతమైన యాక్షన్‌తో మెప్పించింది. దీంతో సమంత బాలీవుడ్‌లోనూ అభిమానులు ఏర్పడ్డారు. పైగా వరుసగా హిందీల ఈవెంట్లలోనూ పాల్గొంటూ అక్కడ తన పీఆర్ రిలేషన్స్ పెంచుకుంటుంది సమంత.
ఈ నేపథ్యంలో సమంత బాలీవుడ్‌లోకి ఎంట్రీ (Samantha Bollywood Entry) ఇవ్వబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఓ రకంగా విజయ్ దేవరకొండతో నటిస్తున్న `ఖుషి` మూవీతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది సమంత. అదే సమయంలో స్ట్రయిట్ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఏకంగా రెండు సినిమాల్లో నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఏక కాలంలో రెండు సినిమాలకు కమిట్ అయినట్టు తెలుస్తుంది.
సమంత మొదటి బాలీవుడ్ ఎంట్రీ ఆయుష్మాన్‌ఖురానా(Ayushmann Khurrann)తో కలిసి నటించబోతుందట. దినేష్ విజన్ దీనికి నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలుస్తుంది. ఆల్‌రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని, ఈ ఏడాదిలోనే సినిమా ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. వచ్చే ఏడాది చివర్లో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ కూడా జరుగుతుందని సమాచారం.
దీంతోపాటు మరో సినిమాకి కూడా సామ్ కమిట్ అయ్యిందట. ఒక మైథలాజికల్ మూవీకి సైన్ చేసిందని సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుందని సమాచారం. అయితే దర్శకుడెవరు, బ్యానర్ ఏంటనేది మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ చర్చల దశలో ఉందని, అన్ని కుదిరితే అధికారిక ప్రకటన రానుందని టాక్.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత.. కరణ్ జోహార్ పాపులర్ టాక్ షో `కాఫీ విత్ కరణ్` షోలో పాల్గొంది. ఈ షో ప్రోమో విడుదలై ఆకట్టుకుంది. ఇందులో సమంత పెళ్లి గురించి ఓపెన్ అయినట్టు ప్రోమోని బట్టి అర్థమవుతుంది. ఈ నెల 7నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో `కాఫీ విత్ కరణ్` షో స్ట్రీమింగ్ కానుండగా, రెండో ఎపిసోడ్‌లో సమంత పాల్గొన్నది రాబోతుందని తెలుస్తుంది. ఇందులో అక్షయ్ కుమార్‌తో కలిసి సమంత సీట్ షేర్ చేసుకుంది.
సమంత ప్రస్తుతం నటిస్తున్న సినిమాలో విజయ్ దేవరకొండతో చేస్తున్న `ఖుషి` పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు. `యశోద` మూవీ కూడా పాన్ ఇండియాగానే రిలీజ్ చేస్తున్నారు. `శాకుంతలం` రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు ఓ ఇంటర్నేషనల్ మూవీ చేస్తుంది సమంత. అలాగే డ్రీమ్ వారియర్స్ ప్రొడక్షన్‌లో ఓ బైలింగ్వల్ మూవీకి కమిట్ అయిన విషయం తెలిసిందే.