MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Samantha-Preetham: 'ఐ లవ్ యూ' 'ఐ టూ లవ్ యూ' చెప్పుకున్న సమంత-ప్రీతమ్... ఆ పిలుపుతో రిలేషన్ బయటకు! 

Samantha-Preetham: 'ఐ లవ్ యూ' 'ఐ టూ లవ్ యూ' చెప్పుకున్న సమంత-ప్రీతమ్... ఆ పిలుపుతో రిలేషన్ బయటకు! 

స్టార్ లేడీ సమంత సోషల్ మీడియా పోస్ట్స్ తరచూ సంచలంగా మారుతున్నాయి. తాజాగా ఆమె స్టైలిష్ ప్రీతమ్ జుకల్కర్ కి ఐ లవ్ యూ... చెప్పారు. దానికి ప్రతిస్పందనగా ప్రీతమ్ ఐ టూ లవ్ యూ చెప్పారు. సమంత జీవితంలో జుకల్కర్ కారణంగా చాలా కాంట్రవర్సీ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఈ సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తికరంగా మారింది.

2 Min read
Author : Sambi Reddy
| Updated : May 04 2022, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Samantha Preetham Jukalker

Samantha - Preetham Jukalker


సమంత నాగ చైతన్య (Naga chaitanya)విడాకుల వెనుక వినిపించిన ప్రధాన కారణాల్లో ప్రీతమ్ జుకల్కర్ ఒకరు. సమంత పర్సనల్ స్టైలిష్ట్, డిజైనర్ అయిన ప్రీతమ్ తో సమంత సన్నిహితంగా ఉంటున్నారని, ఇది నచ్చని నాగ చైతన్య విడాకులు ఇచ్చారన్న ప్రచారం గట్టిగా జరిగింది. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు తీసి పలు కథనాలు ప్రచురించడం జరిగింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
Samantha - Preetham Jukalker

Samantha - Preetham Jukalker

దీంతో ప్రీతమ్ (Preetham Jukalker) అక్కినేని అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాడు. వారి నుండి అతడు వేధింపులు ఎదుర్కొన్నాడు. చేసేది లేక అతడు వివరణ ఇచ్చుకున్నాడు. సమంతతో తనకు ఎలాంటి బంధం ఉందో నాగ చైతన్యకు తెలుసు, నేను ఆమెను అక్కగా భావిస్తానంటూ ప్రీతమ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ పుకార్ల తర్వాత కూడా సమంత-ప్రీతమ్ సన్నిహితంగానే ఉంటున్నారు. ప్రస్తుతానికి కూడా అతడే ఆమె స్టైలిస్ట్. 
 

37
Samantha - Preetham Jukalker

Samantha - Preetham Jukalker

కాగా సమంత (Samantha)లేటెస్ట్ మూవీ కథువాకుల రెండు కాదల్ విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు విగ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి లవర్స్ గా నయనతార, సమంత నటించారు. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో సమంత ఓ థాంక్యూ నోట్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తనకు కామెడీ జోనర్ అంటే చాలా ఇష్టమని, కథువాకుల రెండు కాదల్ మూవీతో ఆ కోరిక తీరినట్లు వెల్లడించారు. 
 

47

అలాగే ఆమె దర్శకుడు విగ్నేష్ శివన్ తో పాటు మూవీకి పని చేసిన టీమ్ పై ప్రేమ కురిపించారు. వాళ్ళను ట్యాగ్ చేసి, లవ్ సింబల్స్ పోస్ట్ చేశారు. ఈ సినిమాకు స్టైలిస్ట్ గా పని చేసిన ప్రీతమ్ ని కూడా ట్యాగ్ చేసి లవ్ సింబల్స్ జోడించారు. ఇక సమంత మెసేజ్ కి ప్రీతమ్ స్పందించారు. ఐ లవ్ యూ టూ జిజి అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు.

57


అయితే సమంతను అతడు జిజి అని సంబోధించడం తో మరోమారు వాళ్ళ రిలేషన్ పై క్లారిటీ ఇచ్చారు. హిందీలో సిస్టర్ ని జిజి అని కూడా పిలుస్తారు. కాబట్టి అతడు ఐ లవ్ యూ అక్క అని చెప్పాడన్న మాట. మరోవైపు ప్రీతమ్ గే, అతడు సమంతతో ఎఫైర్ పెట్టుకొనే అవకాశమే లేదంటూ ఓ వాదన ఉంది. 

67


కాగా విడాకుల డిప్రెషన్ నుండి పూర్తిగా కోలుకున్న సమంత కెరీర్ పై ఫోకస్ పెట్టారు. ఆమె మకాం కూడా ముంబైకి మార్చారు. అక్కడ ఓ ఖరీదైన ఇల్లు కొన్న సమంత అక్కడే సెటిల్ కానున్నారట. బాలీవుడ్ లో స్టార్ గా ఎదగాలనేది ఆమె ఆలోచనగా తెలుస్తుంది. 

77


సమంత రెండు భారీ చిత్రాలలో నటిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం మూవీ రూపొందుతుంది. పౌరాణిక గాథగా శాకుంతలం తెరకెక్కుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మరొక చిత్రం యశోద కూడా పాన్ ఇండియా చిత్రంగా పలు భాషల్లో విడుదల కానుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Renu Desai: సినిమాలు చేయకుండానే రేణు దేశాయ్‌ కోట్ల సంపాదన, ఎలానో తెలిస్తే మైండ్‌ బ్లాక్‌
Recommended image2
Venu Swamy: విజయ్, త్రిష విషయంలో వేణు స్వామి చెప్పిందే జరిగింది.. రెండేళ్ల ముందే బయటపెట్టాడుగా..!
Recommended image3
Superstar Krishnaతో సినిమా ఆగిపోయింది, మహేష్‌ 3 సార్లు రిజెక్ట్ చేశాడు, అయినా తగ్గని డైరెక్టర్‌.. కొడితే ఇండస్ట్రీ షేక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved