- Home
- Entertainment
- సల్మాన్ ఖాన్ తో మెరిసిన పూజా హెగ్దే.. ముంబై ఎయిర్ పోర్టులో సందడి చేసిన రొమాంటిక్ పెయిర్.. పిక్స్ వైరల్
సల్మాన్ ఖాన్ తో మెరిసిన పూజా హెగ్దే.. ముంబై ఎయిర్ పోర్టులో సందడి చేసిన రొమాంటిక్ పెయిర్.. పిక్స్ వైరల్
గ్లామర్ బ్యూటీ పూజా హెగ్దే (Pooja Hegde) తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో మెరిసింది. వీరిద్దరూ జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒకేసారి ఈస్టార్స్ ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమివ్వడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

గ్లామర్ బ్యూటీ పూజా హెగ్దే వరుస చిత్రాలతో తన అభిమానులను అలరిస్తోంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ పాపులారిటీని మరింత పెంచుకుంటోంది. చివరిగా రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘రాధే శ్యామ్’లో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ బ్యూటీ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది.
ఈ సందర్భంగా పూజా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)తో నటించే ఛాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ‘కభీ ఈద్ కభీ దివాలీ’ (Khabhi Eid Kabhi Diwali) చిత్రంలో సల్మాన్ కు ఖాన్ సరసన ఆడిపాడుతోంది. దర్శకుడు ఫర్హాద్ సామ్జీ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. యాక్షన్ మరియు కామెడీ ఫిల్మ్ గా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా లేహ్-లడఖ్‌లో యూనిట్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో సల్మాన్ ఖాన్, పూజా హెగ్దేలతో బ్యూటీఫుల్ సీన్లను షూట్ చేశారు. షెడ్యూల్ పూర్తి కావడంతో ఈరోజు ముంబైకి తిరిగి వచ్చారు.
ఈ సందర్భంగా పూజా హెగ్దే - సల్మాన్ ఖాన్ ఒకేసారి ముంబై ఎయిర్ పోర్టులో ఫొటోగ్రాఫర్స్ కు కనిపించారు. దీంతో వారికి సంబంధించిన కొన్ని పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత పూజా హెగ్దే సల్మాన్ తో కలిసి ఇలా తన అభిమానులకు దర్శనమివ్వడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఈ పిక్స్ లో సల్మాన్ ఖాన్ బ్లూషర్ట్, జీన్స్ లో ఊబర్ లుక్ ను సొంతం చేసుకున్నారు. అటు పూజా హెగ్దే కూడా ట్రెండీ వేర్ లో స్టైలిష్ గా కనిపించింది. వీరిద్దరూ కలిసి నడుచుకుంటూ వస్తున్న ఓ వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ జోడీపై నెటిజన్లు ‘ రొమాంటిక్ పెయిర్’ అంటూ క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు.
పూజా హెగ్దే ప్రస్తుతం బాలీవుడ్ లోనే పాతుకుపోయింది. వరుసగా రెండు హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ‘కభీ ఈద్ కభీ దివాలీ’తో పాటు ‘సర్కస్’ చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే తెలుగులో రూపొందుతున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘జన గణ మన’లోనూ హీరోయిన్ గా ఎంపికైంది. తొలిసారిగా విజయ్ దేవరకొండ సరసన నటించనుంది.