MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 30 ఏళ్ల తరువాత మళ్ళీ సందడి చేయబోతున్న సల్మాన్ - రేవతి, లవ్ కాంబో పై క్లారిటీ ఇచ్చిన జంట

30 ఏళ్ల తరువాత మళ్ళీ సందడి చేయబోతున్న సల్మాన్ - రేవతి, లవ్ కాంబో పై క్లారిటీ ఇచ్చిన జంట

దాదాపు 30 ఏళ్ళ తరువాత వెండితెరపై సందడి చేయబోతోంది లవ్ కాంబినేషన్. అప్పట్లో కుర్ర కారునుఉర్రూతలూగించిన సల్మాన్ ఖాన్ - రేవంతి కాంబోలో.. ప్రస్తుతం సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని ఈజంట రీసెంట్ గా కన్ ఫార్మ్ చేశారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Nov 29 2022, 07:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సాథియా.. తూనే క్యా కియా.. ఈ పాట గురించి బాలీవుడ్ ఆడియన్స్ కు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముందుగా అసలీ పాట  తెలియని బాలీవుడ్‌  సినీ ప్రేమికుడు ఉండడు. 30 ఏళ్ల క్రితం వచ్చిన లవ్ సినిమాలోని ఈ పాట ఇప్పటికీ  నార్త్ ఆడయిన్స్ నోట హమ్మింగ్ అవుతూనే ఉంటుంది. మెలోడీ రాగంతో మైమరపింపచేసే  ఈ పాటలో..  సల్మాన్ ఖాన్ -రేవతి జంట చేసిన సందడి అంతా ఇంత కాదు. 
 

27

ఈపాట  హిట్ లో అది మెలోడియస్‌గా ఉండటం ఒక కారణమైతే.. అందులో నటించిన సల్మాన్‌ ఖాన్‌, రేవతి జోడి మరో ఎత్తు. అప్పటి బాలీవుడ్ ఆడియన్స్ ఈ జోడీని చూసి మైమరపించిపోయారు. ఇక ఇద్దరినీ చూడటానికి రెండు కళ్లూ చాలవు అని ఆ రోజుల్లో  ప్రతీ అభిమాని అనేవారు. తెరపై వీరిని చూసి  తెగ ఆనందపడిపోయేరు. ఇక ఈ  లవ్ జంట  మళ్ళీ 30 ఏళ్ళ తరువాత మరోసారి తెరపై సందడి చేయబోతోంది. 

37

బాలీవుడ్‌  స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌, రేవతి 31 ఏళ్ల క్రితం వచ్చిన  లవ్‌ సినిమాలో నటించి మెపించారు. మళ్లీ ఇన్నేళ్లకు ఓ సినిమాలో కలిసి నటించబోతున్నారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌  నిర్మిస్తున్నయాక్షన్‌  మూవీ టైగర్‌ 3. ఈ సినిమాలో ఈ జంట రెండోసారి స్క్రీన్ షేర్‌ చేసుకోబోతున్నారు.  30 ఏళ్లతరువాత  సల్మాన్‌ ఖాన్‌, రేవతి ఒక సినిమాలో నటిస్తున్నారు.  అయితే ఈసినిమాలో రేవతి పాత్ర  ఏంటీ అనేది మాత్రం  సస్పెన్స్‌. 
 

47

ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ - రేవతి కలిసి రివిల్ చేశారు. రేవతి, కాజోల్‌ కలసి నటించిన సలామ్‌ వెంకీ సినిమా  ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా  హిందీ బిగ్‌బాస్‌ షోకి వచ్చారు.  ఈ నేపథ్యంలోనే టైగర్‌ 3 ప్రస్తావన వచ్చింది. అప్పుడే సల్మాన్‌ ఇద్దరూ కలసి నటిస్తున్న విషయం చెప్పాడు. 

57

అయితే ఈ సినిమాలో రేవతి పాత్ర గురించి మాత్రం ఇంత వరకూ రివిల్ చేయలేదు మేకర్స్. ఆవిషయంలో వాళ్లు సీక్రేట్ మెయింటేన్ చేస్తున్నట్టు బాలీవుడ్‌ మీడియా చెపుతోంది.  వచ్చే ఏడాది దీపావళి కానుకగా  టైగర్‌ 3   రిలీజ్ కాబోతోంది.  అయితే బిగ్ బాస్ లో సల్మాన్ ఈ విషయాన్ని చెప్పడంతో.. ఈమూవీపై భారగా  అంచనాలు  పెరుగుతున్నాయి. 
 

67

ఇక టైగర్‌ 3 లో నటించడంపై  రేవతి కూడా స్పందించారు..  ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆమె కొన్ని వివరాలు తెలిపారు. ఈ సినిమాలో రేవతి రా చీఫ్‌గా నటిస్తోందట. ఇంతకు ముందు వచ్చిన  సినిమాల్లో ఆ పాత్రలో గిరీష్‌ కర్నాడ్‌ నటించారు. ఈ విధంగా చూసుకుంటే సల్మాన్ ను నడిపించే ఇంపార్టెంట్ రోల్ లో ఆమె నటిస్తున్నట్టు తెలుస్తోంది. 
 

77

ఏక్‌ థా టైగర్‌, టైగర్‌ జిందా హై సిరీస్‌లో వస్తున్న మూడో సినిమా టైగర్‌ 3. మనీష్‌ శర్మ దర్శకత్వం వహిస్తుండగా… సల్మాన్‌కి జోడీగా కత్రీనా కైఫ్‌ నటిస్తోంది. ఇంకా ఈ సినిమాలో రణ్‌వీర్‌ షోరే, ఇమ్రాన్‌ హష్మీ లాంటి బాలీవుడ్ స్టార్స్  కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతే కాదు ఈ మూవీలో  షారుఖ్‌ ఖాన్‌ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఆయన్ని నమ్మి వచ్చిన హీరోయిన్, చిరంజీవి సినిమాతో ఘోర అవమానం..సెట్ లో అందరి ముందు అసభ్యంగా..
Recommended image2
సంజూ శాంసన్ vs కీర్తి సురేష్ .. వీరిలో నెంబర్ 1 ఎవరో తెలుసా..?
Recommended image3
Maheshbabu కోసం కదిలి వచ్చిన పవన్ కళ్యాణ్‌, వెంకటేష్‌, నాగార్జున.. కట్‌ చేస్తే సినిమా ఫ్లాప్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved