ప్రభాస్ భోజనం ఖర్చు రోజుకు ఎంతో తెలుసా..? మీ ఊహకు అందదు!
ప్రభాస్ గురించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డైలీ భోజనానికి ప్రభాస్ ఖర్చు చేసే మొత్తం తెలిస్తే... నోరెళ్లబెట్టాల్సిందే.
Prabhas
ప్రభాస్ భోజన ప్రియుడన్న విషయం తెలిసిందే. ఆయన నాన్ వెజ్ ఐటమ్స్ బాగా ఇష్టపడతారు. ప్రపంచంలోని అనేక అరుదైన వంటలు టేస్ట్ చేశాడు. నచ్చిన ఆహారాన్ని ఇంట్లో స్వయంగా తయారు చేయించుకుని తినడం అలవాటు.
Prabhas
ఇక ప్రభాస్ తో పనిచేసిన నటులు, హీరోయిన్స్ కి ఆయన ఆతిథ్యం గురించి తెలుసు. లెక్కకు మించిన రుచికరమైన వంటకాలతో వాళ్ళను మెస్మరైజ్ చేస్తారు. ఈ విషయాన్ని పలువురు కరీనా కపూర్, దీపికా పదుకొనె, పూజ హెగ్డే లాంటి వాళ్ళు స్వయంగా తెలియజేశారు. అందుకే ఆయన్ని డార్లింగ్ అంటారని చెప్పారు.
ప్రభాస్ ట్రీట్మెంట్ చూస్తే ఎవరైనా ప్రేమలో పడిపోతారు. ఆయన డౌన్ టు ఎర్త్ నేచర్ కి ఫిదా అవుతారు. సలార్ మూవీలో ప్రభాస్ తో కలిసి పని చేసిన పృథ్విరాజ్ కూడా ప్రభాస్ ట్రీట్ గురించి ప్రత్యేకంగా చెప్పారు.
Prabhas
ఒకరోజు సెట్స్ కి పృథ్విరాజ్ భార్య, పిల్లలు వచ్చారట. ఆ విషయం తెలిసిన ప్రభాస్ విందు సిద్ధం చేశాడట. గది నిండా వంటకాలతో సర్ప్రైజ్ చేశాడట. ప్రభాస్ తో ఉంటే డేంజర్, డైట్ పాటించలేమని ఆయన ఓపెన్ అయ్యారు.
సెట్స్ లో పని చేసే టీమ్ కి కూడా ప్రభాస్ భోజనాలు ఏర్పాటు చేశాడట. ఇక ప్రభాస్ కి రొయ్యల పులావు అంటే అత్యంత ఇష్టం అట. ఒక ఛాలెంజ్ లో భాగంగా ప్రభాస్ ఈ విషయం బయటపెట్టాడు. ప్రభాస్ ఒంటరిగా భోజనం చేయరట. చుట్టూ ఓ పది మంది ఉండాల్సిందేనట.
అందరితో కలిసి భోజనం చేస్తాడట. మెనూలో చికెన్, మటన్, రొయ్యలు, చేపలు ఉండాల్సిందేనట. ప్రభాస్ ఇంట్లో వంట్లను చేయడానికి ఒక టీమ్ ఉందట. ఒక రోజు వాళ్ళు ప్రభాస్ కోసం ప్రిపేర్ చేసే భోజనం ఖర్చు రూ. 2 లక్షలు ఉంటుందట. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం అంటున్నారు.
ఆ రెండు లక్షలు ఖర్చు చేస్తే ఒక వెయ్యి మందికి జబర్దస్త్ భోజనం ఏర్పాటు చేయవచ్చు. కానీ ప్రభాస్ రోజుకు అంత మొత్తం ఖర్చు చేస్తున్నాడట. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ప్రముఖంగా ప్రచారం అవుతుంది...
Salaar
ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే... సలార్ థియేటర్స్ లో సందడి చేస్తుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే... సలార్ థియేటర్స్ లో సందడి చేస్తుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది.