- Home
- Entertainment
- Salaar VS Dunki : ప్రశాంత్ నీల్, రాజ్ కుమార్ హిరానీ.. ఈ టాప్ డైరెక్టర్లలో ఎవరు తోపు?
Salaar VS Dunki : ప్రశాంత్ నీల్, రాజ్ కుమార్ హిరానీ.. ఈ టాప్ డైరెక్టర్లలో ఎవరు తోపు?
ఇండియన్ సినిమాల్లోనే డిసెంబర్ 22న Salaar, Dunki బిగ్గెస్ట్ క్లాష్ జరుగుతోంది. ఈ రెండు భారీ చిత్రాల పోరుపైనే అందరి చూపు నెలకొంది. ఈ సందర్బంగా బిగ్గెస్ట్ డైరెక్టర్లు ప్రశాంత్ నీల్ (Prashanth Neel), రాజ్ కుమార్ హిరానీ మూవీస్, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Salaar, Dunki ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ RajKumar Hirani దర్శకత్వం వహించిన ‘డంకీ’ విడుదలైంది. రేపు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ Salaar Cease Fireను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా టాప్ డైరెక్టర్ల మధ్య కూడా పోటీ నెలకొంది. తిరుగులేని రికార్డులను సెట్ చేసిన ప్రముఖ దర్శకుల గురించి కొన్ని అంశాలు ఆసక్తికరంగా మారాయి.
20 ఏళ్ల కెరీర్ లో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించినవి ఆరు సినిమాలు మాత్రమే. అందులో తాజాగా విడుదలైన డంకీ ఒకటి. ‘మున్నా భాయ్ ఎంబీబీఎస్’తో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘లగే రహో మున్నా భాయ్’, ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’, ‘సంజు’ వంటి సినిమాలు తెరకెక్కించారు. తాజాగా షారుఖ్ ఖాన్ Shah Rukh Khanతో ‘డంకీ’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
బాలీవుడ్ లోనే 100 శాతం సక్సెస్ సాధించిన డైరెక్టర్ గా రాజ్ కుమార్ హిరానీ రికార్డు సెట్ చేశారు. గతంలో ఆయన చేసిన ఐదు సినిమాలు ఆడియెన్స్ రెస్పాన్స్ తో పాటు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. హిరానీ చిత్రాలకు ప్రముఖ రేటింగ్ సంస్థ IMDB అవరేజ్ గా ఇచ్చిన రేటింగే 8.1. PK తో హిరానీ వరల్డ్ వైడ్ గా రూ.769.89 కోట్లు కలెక్ట్ చేసి అత్యధికంగా వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. 3 Idiots కు ఐఎండీబీ హయ్యేస్ట్ రేటింగ్ 8.4 ఇచ్చింది.
సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా తన కెరీర్ లో చేసినవి తక్కువ సినిమాలే. హిరానీతో పోల్చితే దర్శకుడిగా తనకున్న అనుభవం కూడా తక్కువే. పదేళ్ల కెరీర్ లో కేవలం మూడు సినిమాలనే తెరక్కించారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తో ‘సలార్ సీజ్ ఫైర్’ను తీసుకొస్తున్నారు. ఈ చిత్రం డంకీతో పోటీపడుతుండటం అంతటా ఆసక్తికరంగా మారింది.
ఇక ప్రశాంత్ నీల్ కూడా సౌత్ లో 100 శాతం సక్సెస్ రేషియోను కలిగి ఉన్నారు. మొదటి చిత్రం ‘ఉగ్రం’తో తన ప్రతిభ చాటుకున్న నీల్.. KGF చాప్టర్ 1, 2తో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. 2014లో తన కెరీర్ ప్రారంభమైనా ప్రముఖ ఐఎండీఏ సంస్థ యావరేజ్ గా నీల్ కు 8.2 రేటింగ్ ఇచ్చింది. కేజీఎఫ్ ఛాప్టర్ 2తో ప్రపంచ వ్యాప్తంగా రూ.1,215 కోట్లు వసూళ్లు చేయించారు. దీంతో వరల్డ్ వైడ్ గా హయ్యేస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన నాలుగో సినిమాగా నిలిచింది. దీంతో ఈ చిత్రానికి Highest IMDB Rating 8.3 దక్కింది. ఇలా అన్నీ విషయాల్లో స్వల్ప తేడాతో ఇద్దరూ 100 శాతం సక్సెస్ రేషియోను దక్కించుకున్నారు.
ఊహించని విధంగా ఈ టాప్ డైరెక్టర్లు దర్వకత్వం వహించిన భారీ చిత్రాలు సలార్, డంకీ బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమయ్యాయి. దీంతో నీల్ వర్సెస్ హిరానీ రికార్డు ఇలా ఉండటంతో ఈపోరులో ఎవరిది పైచేయి అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. రెండు చిత్రాలూ లాంగ్ రన్ లో ఉంటాయనే తెలుస్తోంది. దీంతో వరల్డ్ వైడ్ గా ఎవరి చిత్రం భారీగా వసూళ్లు రాబడుతుందనేది అందరిలో ఉత్కంఠను నెలకొల్పింది.