MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్లాక్‌ ఔట్‌ఫిట్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న సాక్షి ధోని.. ఎంత క్యూట్‌గా ఉందో.. అల్లు అర్జున్‌పై అభిమానం..

బ్లాక్‌ ఔట్‌ఫిట్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న సాక్షి ధోని.. ఎంత క్యూట్‌గా ఉందో.. అల్లు అర్జున్‌పై అభిమానం..

లెజెండరీ క్రికెటర్ ఎం ఎస్‌ ధోని భార్య సాక్షి ధోని హైదరాబాద్‌లో సందడి చేశారు. ఆమె సోమవారం తన సినిమా ప్రమోషన్స్ కోసం సిటీకి వచ్చారు. బ్లాక్‌ ఔట్‌ఫిట్‌లో ఆకట్టుకున్నారు. ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు.

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jul 24 2023, 09:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టీమిండియా క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని భార్య సాక్షి ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు తాను బన్నీకి పెద్ద అభిమానిని అని, ఆయన సినిమాలన్నీ చూస్తానని తెలిపింది. తెలుగు సినిమాలను హిందీలోకి అనువాదం చేస్తూ యూట్యూబ్‌లో రిలీజ్‌ చేస్తుంటారని, వాటిని తాను ఎక్కువగా చూస్తుంటానని చెప్పింది సాక్షి ధోని. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

సాక్షి ధోని.. నిర్మాతగా మారి `ఎల్‌జీఎం` చిత్రాన్ని నిర్మించారు. క్రికెట్‌ రంగంలో లెజెండ్‌గా రాణిస్తున్న ధోని ఎంటర్‌టైన్‌ మెంట్ రంగంలోకి అడుగుపెడుతూ `ధోనీ ఎంటర్టైన్‌మెంట్‌ ప్రై లి బ్యానర్‌ని స్థాపించారు.  ఈ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా `ఎల్‌జీఎం`(లెట్స్ గెట్‌ మ్యారీడ్‌) అనే చిత్రాన్ని నిర్మించారు. సాక్షి ధోని, వికాస్‌ హాస్టా నిర్మాతలు. రమేష్‌ తమిళ్మని దర్శకత్వం వహించారు. హరీష్‌ కళ్యాణ్‌, ఇవానా జంటగా నటించగా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

38

ఆగస్ట్ 4న ఈ సినిమా విడుదల కానుంది. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ అనువాదం చేసి రిలీజ్‌ చేస్తున్నారు. ప్రమోషన్స్ లో బాగంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈవెంట్‌ నిర్వహించారు. ఇందులో సాక్షి ధోని స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. హైదరాబాద్‌ సాక్షి సందడి చేశారు. అందరి చూపులను తనవైపు తిప్పుకున్నారు. 

48

బ్లాక్‌ ఔట్ ఫిట్‌ లో అదిరిపోయేలా ఉంది సాక్షి ధోని. బబ్లీ లుక్‌లో కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ సందర్భంగా `ఎల్‌జీఎం` సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సాక్షి ధోని. తెలుగు సినిమాలపై తన అభిమానాన్ని చాటుకుంది. అలాగే బన్నీకి పెద్ద అభిమానిని అంటూ ఇక్కడ బన్నీ ఫ్యాన్స్ మనసు దోచుకుంది. 
 

58

ఇంకా సాక్షి ధోని మాట్లాడుతూ, సాధార‌ణంగా మావారు ధోని ఎప్పుడూ స‌ర్‌ప్రైజ్‌లిస్తుంటారు. ఆయ‌న్నుంచి వ‌చ్చిన మ‌రో స‌ర్ప్రైజ్ ఇది(సినిమా). సాధార‌ణంగా క్రికెట్ అంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్. కానీ, మా వారికి అది ప్రొఫెష‌న్‌. క్రికెట్ ఎలాగో సినిమా కూడా ఎంట‌ర్‌టైన్మెంట్ కాబ‌ట్టి సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చాం. ఇద్ద‌రం చాలా సినిమాలు చూస్తాం. అది థియేట‌ర్‌లో కావ‌చ్చు. ఓటీటీలో కావ‌చ్చు. ఆ ఇష్టంతోనే ఈ రంగంలోకి వ‌చ్చాం. ఇంకా మ‌రెన్నో సినిమాల‌ను చేయ‌టానికి సిద్ధంగా ఉన్నాం. 

68

‘ఎల్‌జీఎం’ సినిమాను త‌మిళంలో చేసినా, తెలుగులో ధోనికి భారీ సంఖ్య‌లో అభిమానులున్నారు. అందువ‌ల్ల తెలుగులో డ‌బ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. తెలుగు సినిమాల‌ను హిందీలోకి అనువాదం చేసి యూ ట్యూబ్‌లో రిలీజ్ చేసేవాళ్లు నేను వాటిని చూసేదాన్ని. ముఖ్యంగా నేను అల్లు అర్జున్ సినిమాల‌న్నింటినీ చూశాను. నేను త‌న‌కు పెద్ద అభిమానిని. 
 

78

నేను స్టోరీ డిస్క‌ష‌న్‌లో డైరెక్ట‌ర్‌తో మాట్లాడేదాన్ని. ఎక్కువ‌గా ఫీడ్ బ్యాక్ తీసుకుని మంచి ఔట్‌పుట్ కోసం డిస్క‌స్ చేసుకునేవాళ్లం. అలా క్రియేటివ్ సైడ్ నా వంతు పార్ట్‌ను నేను తీసుకున్నాను. ఇదొక ఇండిపెండెంట్‌గా ఉండే అమ్మాయి క‌థ‌. సాధార‌ణంగా మ‌న రిలేష‌న్స్‌లో పొర‌ప‌చ్చాలు వ‌స్తుంటాయి. వాటిని తిరిగి నిల‌బెట్టుకుటూ వెళుతుంటాం.
 

88

మ‌న లైఫ్‌లో రిలేష‌న్ షిప్స్ గురించి చెప్పే సినిమా ఇది. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి పెళ్లి చేసుకోవాల‌నుకున్న‌ప్పుడు త‌న మ‌న‌సులో ఎలా ఫీల్ అవుతుంటుంది. దానికి ఆమె ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంద‌నే పాయింట్‌తో ‘ఎల్‌జీఎం’ సినిమాను తెర‌కెక్కించాం. ఆగ‌స్ట్ 4న మూవీ రిలీజ్ అవుతుంది. సినిమా కచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం` అని తెలిపింది సాక్షి ధోని. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Anchor Sowmya Rao: తండ్రి అంటే ఇష్టం లేదు, ఓ పెద్ద హీరో నా ఫోన్ నంబర్ తీసుకున్నారు.. యాంకర్ సౌమ్యరావు
Recommended image2
Trikala Movie Review: త్రికాల మూవీ రివ్యూ.. సరికొత్త మైథాలజీ డార్క్ ఫాంటసీ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Recommended image3
Lady Superstar: 50 కోట్ల ప్రైవేట్ జెట్, 200 కోట్ల పైగా ఆస్తి, CA అవ్వాలనుకుని.. హీరోయిన్ అయిన బ్యూటీ ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved