- Home
- Entertainment
- Guppedantha manasu: రిషీతో పెళ్లి ఫిక్స్ అయ్యిందంటూ ప్రకటించిన సాక్షి.. ఆనందంలో దేవయాని!
Guppedantha manasu: రిషీతో పెళ్లి ఫిక్స్ అయ్యిందంటూ ప్రకటించిన సాక్షి.. ఆనందంలో దేవయాని!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 30వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఎపిసోడ్ ప్రారంభంలోనే..... వసుధార,రిషి దగ్గరకు వెళ్లి,తను ఇవ్వాలనుకున్న బహుమతిని ఇస్తుంది. రిషి ఆ బహుమతిని తెరిచి చూస్తాడు. "నేనిచ్చిన బహుమతినే తిరిగి నాకు ఇస్తున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావ్ వసుధారా?" అని మనసులో అనుకుంటాడు. ఆ గిఫ్ట్ కింద రాసి ఉన్న "ఈ లవ్ యూ" నీ రిషి చూడడు.ఈలోగా సాక్షి తన స్పీచ్ ని మొదలుపెడుతుంది. మొదలు పెడుతూనే" నాకు ఈ కాలేజీకి ఏ సంబంధం లేదు కానీ ఈ కాలేజ్ నాదే. ఎందుకంటే ,ఈ కాలేజ్ MD రిషి కి కాబోయే భార్య నేను" అంటుంది.ఆ ఒక్క మాటతో అందరూ ఆశ్చర్యపోతారు.
ఈలోగా రిషి సాక్షిని ఆపాలని చూస్తాడు.కానీ, సాక్షి మాత్రం" మా ఇద్దరికీ ముందే ఎంగేజ్మెంట్ అయిపోయింది" అని చెబుతుంది. ఈలోగా రిషి స్టేజ్ ఎక్కి ఏం చేస్తున్నావ్? అని అడగగా నేను నీ ఫోన్ కి చాలా ఫోటోలు పంపించాను దాన్ని చూడు అని సాక్షి అంటుంది. ఆ ఫోటోలలో రిషి,వసుధారని పట్టుకొని ఉంటాడు. సాక్షి ఆ ఫోటోలను మీడియాకి చూపిస్తానని బెదిరిస్తుంది. రిషి ఏం చేయలేక అలా ఉండిపోతాడు ఈ లోగసాక్షి మీడియా వాళ్ళ అందరితోని "త్వరలోనే మీ అందరి సమక్షంలో మా పెళ్లి జరుగుతుంది మాకు మీ ఆశీర్వాదాలు కావాలి" అని అంటుంది.
వసుధార అదంతా చూసి ఏమీ చేయలేక అలా ఉండిపోతుంది. సాక్షి మాత్రం ఎంతో ఆనంద పడిపోతుంది అందరూ వచ్చి రిషి కి సాక్షికి శుభాకాంక్షలు చెబుతారు. ఆ దృశ్యాన్ని చూసి వసుధారా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వసుధార వెళ్ళిపోవడం చూసి రిషి చాలా బాధపడతాడు. తర్వాత సీన్లో మహేంద్ర, జగతి ఇద్దరు కలిసి జరగకూడని సంఘటన జరిగిపోయింది అని అనుకుంటారు. సాక్షి అంత మాట్లాడుతున్న రిషి ఏమి అనలేదు ఎందుకు? అని జగతి మహీంద్రాలు ఆలోచనలో పడతారు.
ఈలోగా అందరూ వెళ్ళిపోయారు అని జగతి మహేంద్రలు కూడా బయలుదేరడానికి చూస్తారు .అప్పుడు దేవయాని వచ్చి "జగతితో నేను కొంచెం మాట్లాడాలి మీరు వెళ్ళండి" అని మహేంద్ర తో అంటుంది. మహేంద్ర వెళ్ళిపోయిన తర్వాత దేవయాని, జగతితో "సాక్షి నా ఆయుధం, నీ ఓటమి నా లక్ష్యం"అని చెప్పి ఎప్పటికైనా నేనే గెలుస్తాను అని అంటుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను సాక్షి రిషీల పెళ్లికి నువ్వు కూడా రావాలి అని దేవయాని అనగా,"జరగని పెళ్లికి నేనెందుకులే , నా కొడుకు పెళ్లి నా చేతుల మీదగా నేను అనుకున్న అమ్మాయితోనే జరుగుతుంది" అని చెప్పి వెళ్ళిపోతుంది జగతి.
రిషి ,ఇందాక జరిగిన సంఘటన గుర్తుతెచ్చుకుంటూ, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు .వసుధార మాత్రం క్యాంటీన్ కి వెళ్లి ఒక్కత్తే కూర్చొని బాధపడుతూ, "ఇందాక అంత జరిగినా మీరు ఎందుకు ఒక మాట అయినా మాట్లాడలేదు?, ఆ సంఘటన ఆపలేదు?, అసలు మీ మనసులో ఏముంది సార్? అని అనుకుంటూ ఉంటుంది. అదే సమయంలో సాక్షి,వసుధార దగ్గరికి వస్తుంది. వచ్చి" నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను, మహేంద్ర భూషణ్ కొడుకుని పెళ్లి చేసుకుంటున్నాను అని మీడియా అందరి ముందు చెప్పడానికి చాలా గర్వంగా ఉంది ఆ మాటలు విని అగ్నిపర్వతంలా నీ మనసు బద్దలపై ఉంటది కదా?" అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే,సోమవారం వరకు ఎదురు చూడాల్సిందే!!