MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • నయనతార, త్రిష కన్నా ఎక్కువ అవార్డులు అందుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

నయనతార, త్రిష కన్నా ఎక్కువ అవార్డులు అందుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

నయనతార కాదు, త్రిష కాదు అత్యధిక అవార్డులు గెలుచుకున్న నటి,   సినిమాల్లోకి అడుగుపెట్టిన 10 సంవత్సరాల్లోనే అత్యధిక అవార్డులు గెలుచుకున్న  హీరోయిన్  గురించి మీకు తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 12 2025, 04:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎక్కువ అవార్డులు అందుకున్న హీరోయన్
Image Credit : instagram

ఎక్కువ అవార్డులు అందుకున్న హీరోయన్

సినిమా నటులు, నటీమణులకు లభించే గుర్తింపు అంటే అవార్డులే. సౌత్  సినిమాల్లో చాలా ఏళ్లుగా స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న నయనతార, త్రిషల కంటే ఎక్కువ అవార్డులు సాధించిన హీరోయిన్ ఎవరో తెలుసా?  గత 10 ఏళ్లలో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఓ  హీరోయన్ సీనియర్ల కంటే ఎక్కువ అవార్డులు గెలుచుకుంది. ఆమె కేవలం 15 సినిమాల్లోనే నటించినా, ఆమె గెలుచుకున్న అవార్డులు మాత్రం రెట్టింపు. చిన్న వయసులోనే ఇంతటి ఘనత సాధించిన ఆ నటి ఎవరో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
త్రిష, నయనతారను అధిగమించిన సాయి పల్లవి
Image Credit : Instagram / sai pallavi

త్రిష, నయనతారను అధిగమించిన సాయి పల్లవి

ఆ నటి మరెవరో కాదు... సాయి పల్లవి. సినిమాల్లోకి అడుగుపెట్టిన తొలి 10 ఏళ్లలోనే అత్యధిక అవార్డులు గెలుచుకున్న నటిగా ఆమె నిలిచింది. ఇప్పటివరకు 15 సినిమాల్లోనే నటించిన సాయి పల్లవి, 47 సార్లు అవార్డులకు నామినేట్ అయి, 28 అవార్డులు గెలుచుకుంది. తమిళం, తెలుగు, మలయాళం వంటి పలు భాషల్లో నటించినందుకు ఆమెకు అవార్డులు లభించాయి. నయనతార తన తొలి 10 ఏళ్లలో కేవలం 15 అవార్డులు మాత్రమే గెలుచుకుంది. అదేవిధంగా త్రిష తన తొలి 10 ఏళ్లలో 19 అవార్డులు గెలుచుకుంది.

34
సాయి పల్లవి గెలుచుకున్న అవార్డులు
Image Credit : Instagram / sai pallavi

సాయి పల్లవి గెలుచుకున్న అవార్డులు

నటి సాయి పల్లవి ఆరు సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకుంది. ప్రేమమ్, ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్, విరాట పర్వం, గార్గి చిత్రాలకు ఆమెకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు లభించాయి. ఇవి కాకుండా, సాయి పల్లవి మూడు సార్లు సైమా అవార్డులను కూడా గెలుచుకుంది. ప్రేమమ్, లవ్ స్టోరీ, అమరన్ చిత్రాలకు ఆమె సైమా అవార్డును గెలుచుకుంది. ఇవి కాకుండా, రెండు ఆనంద వికటన్ సినిమా అవార్డులు, రెండు ఆసియా నెట్ అవార్డులు, చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో రెండు అవార్డులు ఇలా సాయి పల్లవి గెలుచుకున్న అవార్డుల జాబితా పెరుగుతూనే ఉంది.

44
 జాతీయ అవార్డు టార్గెట్
Image Credit : Instagram / sai pallavi

జాతీయ అవార్డు టార్గెట్

నటి సాయి పల్లవికి ఇప్పటివరకు అందని ద్రాక్షగా ఉన్నది జాతీయ అవార్డు మాత్రమే. మిగతా అన్ని ప్రముఖ అవార్డులను ఆమె గెలుచుకుంది. గార్గి చిత్రానికి ఆమెకు జాతీయ అవార్డు వస్తుందని అందరూ భావించారు. కానీ అది జస్ట్ మిస్ అయింది. అమరన్ చిత్రానికి సాయి పల్లవి జాతీయ అవార్డు గెలుస్తుందని అంచనా. ఇలా అవార్డులు గెలుచుకునే స్థాయిలో నాణ్యమైన సినిమాలు చేస్తున్న సాయి పల్లవినే అసలైన లేడీ సూపర్ స్టార్ అంటూ అభిమానులు కొనియాడుతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి
నయనతార
త్రిష
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
తమిళ సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్
Recommended image2
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image3
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
చిరంజీవి కి భార్య సురేఖ అంటే భయమా ? మెగా డాటర్ సుస్మిత కొణిదెల వెల్లడించిన టాప్ సీక్రెట్
Recommended image2
4 కోట్ల రెమ్యునరేషన్, 3 కోట్ల విలువైన కార్లు, 80 కోట్ల ఆస్తి, హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ గడుపుతోన్న హీరోయిన్ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved