Engagement : సాయిపల్లవి చెల్లి ఎంగేజ్ మెంట్ ఫొటోలు.. లేడీ పవర్ స్టార్ ఎలా మెరిసిపోతుందో చూశారా!
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ Pooja Kannan పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తాజాగా నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఎంగేజ్ మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి Sai Pallavi కంటే ముందే తన చెల్లి పెళ్లి పీటలు ఎక్కబోతోంది. రీసెంట్ గానే చెల్లి తన ప్రియుడిని కూడా పరిచయం చేసింది. దీంతో సాయి పల్లవి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది.
అచ్చం తన పోలికలతోనే ఉన్న చెల్లి పూజా కన్నన్ Pooja Kannan తమిళంలో హీరోయిన్ గా కూడా. 2021లో ఓ చిత్రంతో వెండితెరపై మెరిసింది. ప్రస్తుతం తన ప్రియుడు వినీత్ తో పెళ్లి పీటలు ఎక్కబోతోంది.
నిన్న పూజా కన్నన్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. గ్రాండ్ అరెంజ్ మెంట్స్ తో ఎంగేజ్ మెంట్ ను నిర్వహించారు.కార్యక్రమానికి బంధువులు, మిత్రులు అందరూ హాజరయ్యారు.
బంధువులతో కలిసి సాయిపల్లవి ఫొటోలకు ఫోజులిచ్చింది. కుటుంబంతో కలిసి వేడుకలో సందడి చేసింది. లైట్ గ్రీన్ శారీలో మెరిసిపోతూ అందరిని ఆకట్టుకుంది.
పెళ్లి ఎంగేజ్ మెంట్ లో అన్నీ తానై చూసుకుంది. బంధువులను మర్యాదగా రీసివ్ చేసుకుంది. చెల్లి నిశ్చితార్థంలో అక్క కూడా గ్రాండ్ లుక్ ను సొంతం చేసుకుంది.
నిశ్చితార్థం సందర్భంగా బంధువులతో కలిసి ఆటపాటలు ఏర్పాట్లు చేశారు. చుట్టాలతో ఆడుకుంటూ ఫొటోలకూ ఇలా ఫోజులిచ్చింది సాయి పల్లవి.
అలాగే తన డాన్స్ తోనూ అదరగొట్టింది. చీరకట్టులో ఊరమాస్ స్టెప్పులతో మైండ్ బ్లాక్ చేసింది. బంధువులతో కలిసి డాన్స్ వేస్తూ ఆకట్టుకుంది.