వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన సాయిపల్లవి, ఏం చెప్పిందంటే..?
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు... దేశం మొత్తం హడావిడి చేస్తున్న ఇష్షూ... సాయి పల్లవి కామెంట్స్. ఈ స్టార్ హీరోయిన్ మాట్లాడిన మాటలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొంత మంది సపోర్ట్ చేస్తుంటే.. మరికొంత మంది మాత్రం విమర్షిస్తున్నారు. మరి ఈ విషయంలో సాయి పల్లవి స్పందించింది.. ఇంతకీ ఆమె ఏమన్నదంటే..?

ఎప్పుడూ ఏ వివాదం జోలికి వెళ్లదు సాయి పల్లవి. తన సినిమాలు ఏంటో.. తానేంటో.. తన లోకం ఏంటో.. అంతవరకే ఉంటుంది. కాని ఫస్ట్ టైమ్ ఆమె ఒక వివాదాస్పద అంశం గురించిమాట్లాడి.. వార్తల్లో నిలుస్తున్నారు. కశ్మీరీ ఫైల్స్ సినిమాకు సంబంధించి.. కొన్ని వ్యాఖ్యలు చేసింది సాయి. ఇంతకీ ఆమె ఏమన్నదంటే..
రానా దగ్గుబాటి , సాయిపల్లవి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సినిమా విరాట పర్వం. జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది ఈమూవీ. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కొన్ని రోజుల ముందు కూడా నేను ఈ కశ్మీరీ ఫైల్స్ వచ్చింది కద.. సో.. కశ్మీరీ ఫైల్స్ వచ్చినప్పుడు వాళ్లు చూపించారు ఎట్లా చంపారు. ఆ టైంలో అక్కడ ఉన్న కశ్మీరీ పండిట్స్‌ను ఎట్లా చంపారనేది చూపించారు కద. కోవిడ్ టైంలో ఎవరో If You Taking A Religious Conflict లాగా తీసుకుంటే రీసెంట్‌గా ఎవరో ఒక బండిలో ఆవుని తీసుకెళుతున్నారు. ఆ బండి డ్రైవ్ చేసేవాళ్లు ముస్లింగా ఉన్నారు. కొన్ని జనాలు కొట్టి జై శ్రీరాం.. జై శ్రీరాం అని చెప్పారా. అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగిన దానికీ తేడా ఎక్కడ ఉంది..? అంటూ క్యాజువల్ గా కామెంట్ చేసింది.
అంత కాదు ఇప్పుడు మనం Religious పేరులో మనం మంచిగా ఉండాలి. మనం మంచి పర్సన్‌గా ఉండి ఉంటే హర్ట్ చేయం. ఒక పర్సన్ పైన ఆ ప్రెజర్ పెట్టం అని సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు కాక రేపాయి. సాయిపల్లవి అవగాహన లేకుండా మాట్లాడుతోందని కొందరు నెటిజన్లు ట్వీట్ చేస్తుంటే.. మరికొందరు కశ్మీరీ పండిట్స్‌ను గోవుల అక్రమ రవాణా చేసిన వారితో పోల్చడమేంటని ఆమెపై మండిపడుతున్నారు.
సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. కొందరు ఆమెపై కేసులు పెట్టే వరకు వెళ్లారు. రెండు రోజులుగా ఆమెపై సోషల్ మీడియాలో కూడా బీభత్సంగా ట్రోలింగ్ జరుగుతుంది. తాజాగా ఈ వివాదంపై సాయిపల్లవి స్పందించింది.
గురువారం విశాఖపట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నేను చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెబుతాను.. కానీ ఇది సమయం కాదు. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా.. అదేదో సినిమా ప్రమోషన్ కోసం చేశానని, చెప్పానని అనుకుంటారు. ఈ వివాదం నుంచి నన్ను సేవ్ చేయాలని నా అభిమానులు కూడా చూస్తున్నారని తెలుసు. ప్రస్తుతం నేను విరాట పర్వం సినిమా విడుదలవుతున్న ఆనందంలో ఉన్నాను. సినిమా విడుదల తర్వాత.. ఈ వివాదంపై మాట్లాడతాను.. అని సాయిపల్లవి చెప్పుకొచ్చింది.
ఇదే వేడుకలో ఈ వివాదంపై రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. నేను లేని సమయంలో సాయిపల్లవిని మాట్లాడించారు. నేను ఉంటే ఇంత వరకు వచ్చేది కాదు. అయినా ఇంత పెద్ద ప్రెస్ మీట్‌లో వివాదాల గురించి మాట్లాడాల్సిన సందర్భం అయితే ఇది కాదు. టీమ్ అంతా ఎంతో కష్టపడి విరాట పర్వం చేశాము. ఈ సక్సెస్ చేయాలని ప్రేక్షకులను కోరుతున్నాను.. అన్నారు.