సౌత్ స్టార్ హీరోయిన్లకు షాక్ ఇచ్చిన సాయి పల్లవి, ఆ విషయంలో ఆమె టాప్..
సౌత్ స్టార్ హీరోయిన్లకు షాక్ ఇచ్చింది సాయి పల్లవి. వరుసగా మూడు సార్లు గోల్డ్ మెడల్ సాధించి సాటి హీరోయిన్లు ఈర్య్షపడేలా చేసింది. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ కూడా సాధింలేని ఘనత సాధించింది.

క్యూట్ బ్యూటీ... సాయి పల్లవి రూటే సెపరేటు. ఎంత పెద్ద స్టార్ అయినా సరే.. కళ్లు మూసుకుని సినిమాలు చేయకుండా.. ఆలోచించి అడుగులు వేస్తుంది సాయి పల్లవి. ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు చేయకుండా ఆచితూచి తనకు సెట్ అయ్యే పాత్రలను.. తాను నమ్మిన సినిమాలను చేస్తూ ఉంటుంది.
కమర్షియల్ సినిమాలు, కమర్షియల్ క్యారెక్టర్ల పట్ల పెద్దగా ఆసక్తి చూపించని సాయి పల్లవి.. రీసెంట్ గా శ్యామ్ సింగ రాయ్ సినిమా తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. నానీ కాంబినేషన్ లో మరో మంచి హిట్ లభించింది సాయి పల్లవికి.
శ్యామ్ సింగరాయ్ లో దేవదాసి పాత్రలో కనిపించింది సాయి పల్లవి. ఈ సినిమా లోని ఆమె పాత్రకు పలు అవార్డులు రివార్డులు వస్తాయని అనుకున్నారు. అనుకున్నట్లుగానే సాయి పల్లవికి శ్యామ్ సింగరాయ్ కి గాను అవార్డు దక్కింది.
తాజాగా జరిగిన బిహైండ్ వుడ్స్ అవార్డుల వేడుకలో సాయి పల్లవి శ్యామ్ సింగరాయ్ సినిమాలోని అద్బుతమైన నటనకు బంగారు పతకం దక్కించుకుంది. అయితే సాయి పల్లవి బిహైండ్ వుడ్స్ లో అవార్డు దక్కించుకోవడం ఇది ఫస్ట్ టైమ్ కాదు. గతంలో రెండు సార్లు కూడా సాయి పల్లవి బంగారు పథకం సాధించింది.
మొదటి సారి సాయి పల్లవి 2017 లో నటించిన కాళి సినిమాకు బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకుంది. ఈసినిమాలో సాయి పల్లవి నటనకు ఆడియన్స్ తో పాటు.. అవార్డ్ జ్యూరీ కూడా ఫిదా అయిపోయారు.
ఇక 2019 లో మలయాళంలో ఫహద్ ఫాసిల్ తో కలిసి నటించిన అథిరన్ సినిమాకు గాను సాయి పల్లవి గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకుంది. అథిరన్ సినిమాలో మానసికంగా సరిగా లేని అమ్మాయి పాత్రలో నటించి అద్బుతమైన తన నటన ప్రతిభను కనబర్చింది సాయి పల్లవి.
మలయాళ సినిమాలో మరో లెవల్ యాక్టింగ్ తో అందరిని ఆశ్చర్య పరిచింది. సాయిపల్లవికి పర్ఫామెన్స్ స్కోప్ ఉన్న పాత్రలు ఇస్తే.. వాటిపై గట్టి పట్టు సాధిస్తుంది. తన టాలెంట్ ఏంటో నిరూపిస్తుంది. ఇక మూడవ సారి శ్యామ్ సింగరాయ్ లో దేవదాసిగా సాయి పల్లవి నటన గోల్డ్ మెడల్ వచ్చేలా చేసింది.
ఒక సౌత్ హీరోయిన్ అతి తక్కువ సమయంలోనే మూడు గోల్డ్ మెడల్స్ ను దక్కించుకోవడం ఇదే ఫస్ట్ టైమ్. సాయి పల్లవి టాలెంట్ కు ఇంకెన్ని గోల్డ్ మెడల్స్ వచ్చినా.. ఆశ్చర్యపోవల్సిందేమి లేదంటున్నారు ఫ్యాన్స్. అంతే కాదు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సాయి పల్లవి షేర్ చేసిన గోల్డ్ మెడల్ ఫోటోను వైరల్ చేస్తున్నారు.