MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ హీరో తండ్రికి సాయి పల్లవి అంటే అంత ఇష్టమా, ఆమె కోసం ఎంత రిస్క్ చేశారో తెలుసా.. లాభాల పంట

టాలీవుడ్ హీరో తండ్రికి సాయి పల్లవి అంటే అంత ఇష్టమా, ఆమె కోసం ఎంత రిస్క్ చేశారో తెలుసా.. లాభాల పంట

సాయి పల్లవి సౌత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న నటి. నటన మాత్రమే కాదు డ్యాన్స్ చేయడంలో కూడా సౌత్ లో సాయి పల్లవి బెస్ట్ హీరోయిన్స్ లో ఒకరు. కొందరు హీరోయిన్లు అందంగా ఉంటారు, బాగా నటిస్తారు. కానీ డ్యాన్స్ చేయలేకపోవచ్చు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 07 2024, 01:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Sai Pallavi

Sai Pallavi

సాయి పల్లవి సౌత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న నటి. నటన మాత్రమే కాదు డ్యాన్స్ చేయడంలో కూడా సౌత్ లో సాయి పల్లవి బెస్ట్ హీరోయిన్స్ లో ఒకరు. కొందరు హీరోయిన్లు అందంగా ఉంటారు, బాగా నటిస్తారు. కానీ డ్యాన్స్ చేయలేకపోవచ్చు. కానీ అన్ని క్వాలిటీస్ పుష్కలంగా ఉన్న హీరోయిన్ సాయి పల్లవి. అందుకే ఆమె ఫ్యామిలీ ఆడియన్స్ తోపాటు యువతని కూడా ఫిదా చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Sai Pallavi

Sai Pallavi

సాయి పల్లవి తాజాగా నటించిన చిత్రం అమరన్. శివకార్తీయన్ సరసన ఈ చిత్రంలో సాయి పల్లవి నటించింది. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళికి విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. శివ కార్తికేయన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ చిత్రం 100 కోట్లకి పైగా వసూళ్లు రాబడుతోంది. రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ లో కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. 

35
actress sai pallavi

actress sai pallavi

తెలుగులో ఈ చిత్ర థియేట్రికల్ హక్కులని యంగ్ హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్లకు ఆయన అమరన్ హక్కులు కొన్నారు. శివకార్తికేయన్ కి తెలుగులో మార్కెట్ తక్కువే. ఒక వేళ సినిమా ఆడితే సాయి పల్లవి క్రేజ్ పైనే ఆడాలి. ఈ చిత్రానికి 5 కోట్లు అంటే మంచి నంబర్ అనే చెప్పొచ్చు. సుధాకర్ రెడ్డి రిస్క్ చేయడానికి కారణం సాయి పల్లవి అని నితిన్ స్వయంగా చెప్పారు. 

45

మా నాన్నకి సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. ఎందుకు నాన్న ఈ సినిమా కొంటున్నావు అని అడిగితే.. సాయి పల్లవి ఉందిరా ఈ చిత్రంలో అని చెప్పారు. రిస్క్ చేసిన నితిన్ తండ్రికి రివార్డ్ దక్కింది. తెలుగులో ఈ చిత్రం రెట్టింపు లాభాలతో దూసుకుపోతోంది. 5 కోట్లు పెట్టి కొంటే వారం లోపే ఈ చిత్రం ఏకంగా 11 కోట్ల వరకు షేర్ రాబట్టింది. 

 

55

రానున్న రోజుల్లో వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ చిత్రం నితిన్ తండ్రికి మూడింతలు లాభాలు తెచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. శివ కార్తికేయన్ మార్కెట్ కూడా అమరన్ చిత్రంతో తెలుగులో పెరిగింది అని చెప్పొచ్చు. సక్సెస్ మీట్ లో శివకార్తికేయన్ నితిన్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. అంతే కాదు నితిన్ ఇష్క్ మూవీలో 'ఓ ప్రియా ప్రియా'అనే సాంగ్ అంటే చాలా ఇష్టం అని.. వేదికపై పాడి అలరించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
సాయి పల్లవి

Latest Videos
Recommended Stories
Recommended image1
Duniya Vijay Divorce: భార్యకి విడాకులు ఇచ్చిన బాలయ్య విలన్‌, భరణం కింద 2 కోట్లు.. మరో కండీషన్‌ కూడా
Recommended image2
Vijay Deverakonda: రామ్ చరణ్ కాదు, శ్రీకృష్ణుడిగా విజయ్ దేవరకొండ.. రీమేక్ మూవీపై పెరుగుతున్న అంచనాలు
Recommended image3
Trisha Krishnan: పుకార్లకు చెక్ పెట్టిన త్రిష, లండన్ టూర్‌ వెనుక అసలు కథ ఇదే.. అభిమానులకు గుడ్‌న్యూస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved