- Home
- Entertainment
- Thandel Movie : నాగ చైతన్య దెబ్బకి సాయి పల్లవి మైండ్ బ్లాక్.. వెంటనే ఏం చేసిందో తెలుసా
Thandel Movie : నాగ చైతన్య దెబ్బకి సాయి పల్లవి మైండ్ బ్లాక్.. వెంటనే ఏం చేసిందో తెలుసా
Sai Pallavi about Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చందూ ముండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

Sai Pallavi, Naga Chaitanya
Sai Pallavi about Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చందూ ముండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. నాగ చైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కింది. బన్నీ వాసు నిర్మాత కాగా, అల్లు అరవింద్ సమర్పకుడిగా గీతా ఆర్ట్స్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ లో చైతు, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.
Sai Pallavi
సాయి పల్లవి నటన, డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాయిపల్లవితో ఏ హీరో అయినా పోటీ పడాలంటే కత్తిమీద సామే. కానీ రీసెంట్ ఇంటర్వ్యూలో సాయి పల్లవి నాగ చైతన్య గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. నాగ చైతన్యని ప్రశంసలతో ముంచెత్తింది. ఈ చిత్రంలో ఒక కీలక సన్నివేశం ఉందట.
Thandel Movie
ఆ సీన్ లో నాగ చైతన్య పెర్ఫామెన్స్ చూసి తన మైండ్ బ్లాక్ అయినట్లు సాయి పల్లవి పేర్కొంది. చైతు అంత అద్భుతంగా నటించాడు. వెంటనే దర్శకుడికి చెప్పి ఆ సీన్ లో తన పార్ట్ రీ షూట్ చేయాలని సాయి పల్లవి కోరిందట. ఎందుకంటే చైతు పెర్ఫామెన్స్ కి తన పెర్ఫామెన్స్ ఏమాత్రం మ్యాచ్ కాలేదని.. తాను ఇంకా బాగా నటించాల్సిన అవసరం ఉందని తెలిపిందట. చైతు నటనకి న్యాయం చేయాలంటే తాను కూడా బాగా నటించాలని డిసైడ్ అయినట్లు సాయి పల్లవి పేర్కొంది.