సాయిపల్లవికి అందుకేనా ఇంత క్రేజ్? చీరలో మెరిసిపోతున్న తమిళ బ్యూటీ..
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విరాటపర్వం ఈవెంట్ కు హాజరైన సాయి పల్లవి.. తాజాగా చేసిన ట్వీట్ తో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఫ్యాన్స్ పట్ల ఆమె చూపుతున్న శ్రద్దకు ఫిదా అవుతున్నారు.

హీరోయిన్ సాయి పల్లవి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తూ తన పాపులారిటీని పెంచుకుంటోంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ ఆడియెన్స్ ను, ముఖ్యంగా తన అభిమానులను ఖుషీ చేస్తోంది. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే తనకుంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుందీ బ్యూటీ.
‘ఫిదా’లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన తెలంగాణ యాస, భాషతో నటించి తెలుగు ఆడియెన్స్ ను ఫిదా చేసింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో సాయి పల్లవికి తగిన గుర్తింపు దక్కించుకుంది. దీంతో అటు తమిళ చిత్రాలతో పాటు, ఇటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ వస్తోంది.
చివరిగా ‘లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్’ చిత్రాల్లో నటించి ఆడియెన్స్ ను మెప్పించింది. ఒక్కో సినిమాలో ఒక్కో పాత్రను పోషిస్తూ సర్ ప్రైజ్ చేస్తోంది. తాజాగా తెలుగులో ‘విరాట పర్వం’లో నక్సలైట్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కూడా సాయి పల్లవికి మరింత సక్సెస్ ను అందించనున్నదని అభిమానులు ఆశిస్తున్నారు.
అయితే, విరాట పర్వం (Virata Parvam) చిత్ర ప్రమోషన్స్ ను తాజాగా ప్రారంభించారు. ఈ క్రమంలో నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు యూనిట్. కార్యక్రమం గాలివానతో సవ్యంగా జరగక పోయినా సాయి పల్లవి తన స్పీచ్ ను మాత్రం కంప్లీట్ చేసింది. అయితే అంతటి గాలివానలోనూ సాయి పల్లవి స్పీచ్ ను అభిమానులు ఎంజాయ్ చేయడం విశేషం.
ఈవెంట్ అనంతరం అంతటి గాలివానలో అభిమానులు ఎలా తిరిగి వెళ్లారోనని తాజాగా ట్వీట్ కూడా చేసింది సాయి పల్లవి. ‘నన్ను క్షమించండి. ఈరోజు మీ అందరినీ కలవాలని నేను నిజంగా ఎదురు చూశాను. మనం త్వరలో మళ్లీ కలుద్దాం! వర్షం కురుస్తున్నప్పటికీ తిరిగి వచ్చినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. మీరందరూ క్షేమంగా ఇంటికి చేరుకున్నారని ఆశిస్తున్నాను.’ అని పేర్కొంది. ఫ్యాన్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడటం పట్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇంత వరకు అభిమానుల క్షేమం గురించి అగ్రస్థాయి హీరోలే తప్ప.. హీరోయిన్స్ ఇంతలా కేర్ తీసుకోవడం చూడలేదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. తన ట్వీట్ కు అభిమానులు రిప్లై ఇస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు. అయితే ఈవెంట్ సందర్భంగా సాయి పల్లవి బంగారు రంగు చీరలో ఆకర్షించింది. ఆ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.