MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తేజూ థ్యాంక్యూ నోట్.. మాళవికా ఫస్ట్ లుక్.. అనన్య నాగళ్ల కొత్త సినిమా.. వీజే సన్నీ మూవీ.. టుడే అప్డేట్స్ ఇలా..

తేజూ థ్యాంక్యూ నోట్.. మాళవికా ఫస్ట్ లుక్.. అనన్య నాగళ్ల కొత్త సినిమా.. వీజే సన్నీ మూవీ.. టుడే అప్డేట్స్ ఇలా..

అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ నోట్ రాశారు. అనన్య నాగళ్ల కొత్త సినిమా పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇలా ఈరోజు వచ్చిన మూవీ అప్డేట్స్  ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.  

3 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 04 2023, 07:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో : ది అవతార్’. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా నిర్మించిన ఈ చిత్రం జూలై 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ ను అందుకుంది. ఈ సందర్బంగా యూనిట్ బ్రో విజయయాత్రను నిర్వహించింది. ఈ యాత్రలో సాయి ధరమ్ తేజ్ పాల్గొన్నారు. ప్రతి చోటా ఆయనను అభిమానులు ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా తేజూ అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ స్పెషల్ నోట్ విడుదల చేశారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

బ్రో విజయయాత్రలో మీరు నాపై చూపించిన ప్రేమకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరినీ కలవడం సంతోషంగా ఉంది. మీ ప్రేమను పొందడం, సినిమా గురించి మీ నోట వినడం చాలా బాగుంది. అందరూ నన్ను కలవడానికి ఆప్యాయంగా దగ్గరికి రావడం, సెల్ఫీలు, ఫొటోల కోసం ప్రయత్నించారు. నేనూ అందరికీ అందుబాటులో ఉండేందుకే ప్రయత్నించాను. కానీ కొందరు బైకులపై హెల్మెట్లు లేకుండా రావడం, డ్రైవింగ్ చేస్తూనే సెల్ఫీలు, వీడియోలు తీయడం నాకు భయం కలిగించేలా చేశాయి. అదృష్టం కొద్ది ఎలాంటి హాని జరగలేదు. మీ భద్రత నా బాధ్యతగా భావిస్తున్నాను. ఇకపై హెల్మెట్ ధరించండి, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నానంటూ కాస్తా ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. 
 

35

విక్రమ్‌ హీరోగా రూపొందుతున్న `తంగలాన్‌` చిత్రానికి పా రంజిత్‌ దర్శత్వం వహిస్తున్నారు. రా అండ్‌ రస్టిక్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్‌ సంస్థ నిర్మిస్తుంది. కర్నాటకలోని కేజీఎఫ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే పీరియాడికల్‌ చిత్రం. ఇందులో మాళవిక మోహనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఆమెతోపాటు పశుపతి, డేనియల్‌, కాల్టాగిరోన్‌ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కూడా పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా యూనిట్ ప్రమోషన్స్ ను కూడా షురూ చేసింది. ఈక్రమంలో తాజాగా Malavika Mohanan ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ లో మాళవికా లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. ట్రైబల్ గెటప్ లో అసలు గుర్తుపట్టడం కష్టంగా మారింది. తన లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. దీంతో సినిమాలో మాళవికా పాత్రపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. 
 

45

'మల్లేశం', 'వకీల్‌సాబ్‌' చిత్రాల ఫేం అనన్య నాగళ్ల (Ananya Nagalla)  ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘తంత్ర’ Tantra. హారర్‌ థ్రిల్లర్‌. చిత్రం పోస్టర్‌ను నిర్మాణ సంస్థ విడుదల చేసింది. భయంకరమైన క్షుద్రశక్తులు అనన్యని పీడిస్తున్నట్టుగా కనపడుతున్న పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. 'మగధీర'లో షేర్‌ఖాన్‌ లాంటి ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్‌ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. మరో కీలక పాత్రలో ‘మర్యాదరామన్న’ ఫేం సలోని ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తోంది. మన తంత్ర శాస్త్రానికి చెందిన విస్తు గొలిపే రహస్యాలు ఈ మూవీ ద్వారా చెప్పబోతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బి ద వే ఫిల్మ్స్‌, వి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీనివాస్‌ గోపిశెట్టి అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. భారతీయ తాంత్రిక శాస్త్రం, పురాణగాధల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుందని దర్శకనిర్మాతలు తెలిపారు. 
 

55

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై, ప్రొడక్షన్ నెం. 1, వి.జె.స‌న్నీ (VJ Sunny) హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా న‌టిస్తున్న నూతన చిత్రం, ‘సౌండ్ పార్టీ’.  రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర  నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పణ.  సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడు.  ఈ చిత్రం ఇటీవ‌ల షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ ను ఈ రోజు  ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆవిష్క‌రించారు. క‌ల్వ‌కుంట్ల క‌విత మాట్లాడుతూ...``సౌండ్ పార్టీ` టైటిల్, పోస్ట‌ర్ ఎంతో ఇంట్ర‌స్టింగ్ గా ఉన్నాయి. కాన్సెప్ట్ కూడా ఎంతో ఎంట‌ర్టైనింగ్ గా ఉండ‌బోతున్న‌ట్లు టైటిల్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు , న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు  మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నా‘ అన్నారు. నిర్మాత ర‌వి పోలిశెట్టి  మాట్లాడుతూ... ఫుల్  మూన్ మీడియా ప్రొడక్షన్స్‌లో వ‌స్తోన్నమా  మొద‌టి సినిమా `సౌండ్ పార్టీ`.  పోస్ట‌ర్ ను ఎమ్మెల్సీ క‌విత లాంచ్ చేయ‌డం పట్ల కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాం. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.  అద్భుతంగా చిత్రాన్ని తెర‌కెక్కించారు. త్వ‌ర‌లో విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాం. హీరో వీజే స‌న్ని మాట్లాడుతూ...``మా సౌండ్ పార్టీ` నుంచి ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టైటిల్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. షూటింగ్ అంతా పూర్త‌యింది. సినిమా అనుకున్న దానిక‌న్నా చాలా బాగొచ్చిందన్నారు. ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరి మాట్లాడుతూ...`` సౌండ్ పార్టీ` టైటిల్ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. క‌విత గారు మా టీమ్ అంద‌రికీ బ్లెస్సింగ్స్ అందించ‌డం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంలో  శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, చలాకి చంటి, తేజ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. చిత్రానికి  డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ : జి. అవినాష్ ; సంగీతం: మోహిత్ రెహమానిక్ అందిస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ananya Panday: భరతనాట్యం చేశావా? ఖూనీ చేశావా? అనన్య డ్యాన్స్‌పై నెటిజన్ల ఫైర్
Recommended image2
Sri Satya: యాంకర్‌గా టర్న్ తీసుకున్న బిగ్‌ బాస్‌ నటి.. కాన్స్ లో శ్రీసత్య కొత్త జర్నీ షురూ
Recommended image3
Allu Arjun: ఐకాన్ స్టార్ చేతికి అదిరిపోయే లగ్జరీ వాచ్, కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే, అల్లు అర్జున్ గడియారం రేటెంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved