- Home
- Entertainment
- జూ.ఎన్టీఆర్ పై దారుణమైన కామెంట్స్ ఎఫెక్ట్.. నన్ను నా ఫ్యామిలీ ఇబ్బంది పెట్టొద్దు, సునిశిత్ క్షమాపణ
జూ.ఎన్టీఆర్ పై దారుణమైన కామెంట్స్ ఎఫెక్ట్.. నన్ను నా ఫ్యామిలీ ఇబ్బంది పెట్టొద్దు, సునిశిత్ క్షమాపణ
శాక్రిఫైజ్ స్టార్ గా యూట్యూబ్ లో పాపులర్ అయిన సునిశిత్ ఇటీవల రాంచరణ్ అభిమానుల చేతిలో చావు దెబ్బలు తిన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో చాలా మంది సెలెబ్రిటీలపై సునిశిత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నెగిటివ్ పబ్లిసిటీ పొందాడు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
శాక్రిఫైజ్ స్టార్ గా యూట్యూబ్ లో పాపులర్ అయిన సునిశిత్ ఇటీవల రాంచరణ్ అభిమానుల చేతిలో చావు దెబ్బలు తిన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో చాలా మంది సెలెబ్రిటీలపై సునిశిత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నెగిటివ్ పబ్లిసిటీ పొందాడు. తనకి హీరోయిన్లతో చాలా లవ్ ఎఫైర్స్ ఉన్నాయి అంటూ గతంలో సునిశిత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
అయితే అతడి కామెంట్స్ కి స్పందించే వారి కంటే నవ్వుకునే వారే ఎక్కువ. కాబట్టి అతడి వీడియోలు యూట్యూబ్ లో వైరల్ అవుతూ వచ్చాయి. టాలీవుడ్ లో తనకి తెలియని విషయం లేదని.. తనతో ప్రేమలో పడని హీరోయిన్ లేదని సునిశిత్ చేసే కామెంట్స్ ని ఎదో పిచ్చివాగుడు అన్నట్లుగా నెటిజన్లు చూస్తూ వచ్చారు.
సునిశిత్ ఇటీవల రాంచరణ్ సతీమణి ఉపాసన గురించి కామెంట్స్ చేయడంతో.. చరణ్ ఫ్యాన్స్ అతడిని చుట్టుముట్టి చితకబాదారు. ఏ హీరో గురించి, నటి గురించి, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చి.. ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చి పంపారు.
అయినా సునిశిత్ బుద్ది మారలేదు. చరణ్ ఫ్యాన్స్ చావబాదినప్పటికీ సునిశిత్ గుణపాఠం నేర్చుకోలేదు. జూ.ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ మరో ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ పెద్ద హీరో కదా.. కానీ ఎన్టీఆర్ అశ్లీల చిత్రాల్లో నటించారు అంటూ సునిశిత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. జూ. ఎన్టీఆర్ గురించి ఈ విషయం టాలీవుడ్ లో ఎవ్వరూ చెప్పరు.. సునిశిత్ అనే హీరో తప్ప అంటూ తన గురించి తానూ బిల్డప్ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు.
దీనితో రంగంలోకి దిగిన తారక్ అభిమానులు సునిశిత్ తమ కి దొరికితే మాత్రం తగినశాస్తి చేస్తాం అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. నీకు చావే అంటూ బెదిరించారు కూడా. దీనితో భయపడిన సునిశిత్.. దిగి వచ్చి క్షమాపణ చెప్పాడు. నన్ను, నా ఫ్యామిలీని దయచేసి ఇబ్బంది పెట్టొద్దు. తారక్ పై చేసిన కామెంట్స్ కి క్షమాపణ కోరుతున్నా. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయను.
నేను కూడా తారక్ అభిమానినే.. కానీ పబ్లిసిటికి వస్తుందని ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నా. ఇకపై నా నుంచి ఇలాంటివి ఉండవు అని సునిశిత్ పేర్కొన్నాడు. మరి తారక్ అభిమానుల కోపం చల్లారుతుందా.. లేక సునిశిత్ ని టార్గెట్ చేస్తారా అనేది చూడాలి.