లెజెండరీ గాయనిపై దారుణమైన రూమర్స్‌.. ఎస్పీబీ ఆవేదన

First Published 29, Jun 2020, 11:54 AM

సోషల్‌ మీడియా అభివృద్ధి చెందుతున్న దగ్గర నుంచి లాభాలతో పాటు నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీ విషయంలో కొంత మంది ఆకతాయిలు సృష్టిస్తున్న రూమర్స్‌ వాళ్లకు తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయి. తాజాగా అలాంటి రూమరే సౌత్‌ సినీ పరిశ్రమలు కుదిపేసింది. ఎన్నోఅద్భుతమైన పాటలను ఆలపించిన లెజెండరీ సింగర్‌ ఎస్‌ జానకి ఇక లేరంటూ కొంత మంది ఆకతాయిలు సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు.

తెలుగు జాతి గర్వించదగ్గ మహాగాయని కావటంతో తీవ్ర ఆవేదన చెందిన అభిమానులు ఆ వార్తను షేర్‌ చేశారు. దీంతో కొద్ది సమయంలోనూ జానకికి సంబంధించిన వార్త వైరల్‌గా మారింది. ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న తరుణంలో ఈ వార్త సినీ అభిమానులను మరింత షాక్‌కు గురిచేసింది. ఈ విషయం జానకి కుటుంబ సభ్యుల వరకు చేరటంతో వారు స్పందించారు.

జానకమ్మ ఆరోగ్యం గురించి ఎలాంటి వందుతులు షేర్ చేయవద్దని వారు వేడుకున్నారు. ఇటీవల జానకికి ఓ చిన్న శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. అయితే ఆమె ఆసుపత్రిలో ఉండటంతో ఇలాంటి వదుంతులు వచ్చాయిని భావిస్తున్నారు.

అయితే జానకి ఆరోగ్యం పై ఇలాంటి వదంతులు రావటంపై లెజెండరీ సింగర్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్పందించారు. ఇలాంటి వదంతులు ఎవరు, ఎందుకు ప్రచారం చేస్తారో అర్ధం కావటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. `జానకమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఉదయం నుంచి నాకు 20 మంది కాల్ చేశార`ని తెలిపారు.

`కొంత మంది సోషల్ మీడియాలో జానకమ్మ పోయారంటూ పోస్ట్ లు పెట్టడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఈ అర్ధం పర్థం లేని పనులు. నేను ఆమెతో మాట్లాడాను. ఆమె బాగున్నారు` అంటూ బాలు స్పష్టం చేశారు.

సోషల్ మీడియాను మంచి విషయాలు ప్రచారం చేయడానికి వాడాలి, ఇలాంటి ఆకతాయి పనులు చేయడానికి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు బాలు. మరో గాయకుడు మనో కూడా జానకమ్మ ఆరోగ్యం పై స్పందించారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు, మైసూర్‌లో ఉన్నారు. దయచేసి వదంతులు ఆపండి అంటూ ఆయన ట్వీట్ చేశాడు.

loader