MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `ఖుషి` ప్రీమియర్‌ షో చూస్తుంటే చెమటలు పట్టాయి, డైరెక్షన్ పెద్ద టార్చర్‌.. ఎస్‌ జే సూర్య షాకింగ్‌ కామెంట్స్

`ఖుషి` ప్రీమియర్‌ షో చూస్తుంటే చెమటలు పట్టాయి, డైరెక్షన్ పెద్ద టార్చర్‌.. ఎస్‌ జే సూర్య షాకింగ్‌ కామెంట్స్

SJ Suryah: దర్శకుడు, నటుడు ఎస్‌ జే సూర్య `ఖుషి` సినిమా ప్రీమియర్ షో అనుభవాలను పంచుకున్నారు. ఆ రోజు చెమటలు పట్టాయని, డైరెక్షన్‌ చేయకపోవడానికి కారణాలను వెల్లడించారు.   

3 Min read
Author : Aithagoni Raju
Published : Mar 23 2025, 06:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
kushi movie

kushi movie

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన `ఖుషి` సినిమా అప్పట్లో ఎంతటి పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. యువతని ఓ ఊపు ఊపేసింది. ఆ తరాన్ని బాగా ప్రభావితం చేసిన మూవీ అది. ఇందులో పవన్‌కి జోడీగా భూమిక హీరోయిన్‌గా నటించగా, ఎస్‌ జే సూర్య దర్శకత్వం వహించారు. 2001లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. పవన్‌ కళ్యాణ్‌ క్రేజ్‌ని, ఇమేజ్‌న అమాంతం పెంచేసిన మూవీ ఇది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Veera Dheera Sooran censoring done chiyaan vikram

Veera Dheera Sooran censoring done chiyaan vikram

అయితే ఈ మూవీ తమిళంలో వచ్చిన `ఖుషి`కి రీమేక్‌. అందులో విజయ్‌, జ్యోతిక నటించగా, ఎస్‌ జే సూర్య దర్శకత్వం వహించారు. తమిళంలో భారీ విజయం సాధించడంతో తెలుగులో రీమేక్‌ చేశారు. తమిళంలో కంటే తెలుగులోనే ఇది పెద్ద విజయం సాధించిందని, పవన్‌ కళ్యాణ్‌ సినిమా రేంజ్‌ని పెంచేశాడని ఓ సందర్భంలో ఆయన అన్నారు.

తాజాగా `ఖుషి` సమయంలో తాను ఫేస్‌ చేసి స్ట్రగుల్‌ గురించి, ఆ టెన్షన్‌ గురించి వెల్లడించారు ఎస్‌ జే సూర్య. తాజాగా ఆయన `వీర ధీర శూర` చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. విక్రమ్‌ హీరోగా నటించిన మూవీ ఇది. ఈ నెల 27న ఇది విడుదల కాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్‌లో టీమ్‌ సందడి చేసింది. 

36
sj suryah

sj suryah

ఇందులో ఎస్‌ జే సూర్య సినిమా విశేషాలను పంచుకున్నారు. విక్రమ్‌ నటన గురించి, దర్శకుడి డెడికేషన్‌ గురించి తెలిపారు. ఈ క్రమంలో ఆయనకు మళ్లీ డైరెక్షన్‌ చేసే ఆలోచన ఉందా? అనే ప్రశ్నకి సూర్య స్పందిస్తూ డైరెక్షన్‌ చేయడం అంత ఈజీ కాదని తెలిపారు.

ఒక కథ రాయడానికి ఆరు నెలలు కూర్చోవాలని, స్క్రిప్ట్ బాగా రావడం కోసం స్ట్రగుల్‌ అవ్వాలని, ఆ తర్వాత టీమ్‌ని సెట్‌ చేసుకోవడం మరో పెద్ద టాస్క్ అని, షూటింగ్‌ ఇంకో పెద్ద సవాల్‌తో కూడినది అన్నారు. సినిమాలో డైరెక్టరే అన్నీ చేయాల్సి వస్తుందన్నారు. 
 

46
kushi movie

kushi movie

సినిమా అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌ సమయంలో చుక్కలు చూడాల్సి వస్తుందని, ఫైనల్‌ కాపీ రెడీ అయ్యేంత వరకు చుక్కలు కనిపిస్తాయి. ఇక అన్నీ అయిపోయాక రిలీజ్‌ టైమ్‌లో నరకం కనిపిస్తుందని,  మధ్యలో  ఏమాత్రం కాన్ఫిడెన్స్ తగ్గినా రిజల్ట్ తేడా కొడుతుంది. షూటింగ్‌ దశలోనే ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు.

అన్ని రకాల ఫ్రస్టేషన్స్ తట్టుకుని, దిగమింగి షూట్‌ చేయాల్సి వస్తుంది. చివరికి రిలీజ్‌ రోజు వరకు సినిమా ఎలా వస్తుందో, ఎలాంటి రియాక్షన్ వస్తుందో అనే టెన్షన్‌తో చచ్చిపోవాల్సి  వస్తుంది. రిలీజ్‌ ముందు రోజు నుంచి ఈ టెన్షన్‌ పీక్‌లో ఉంటుంది. వాటిని తట్టుకుని సినిమాకి పాజిటివ్‌ వస్తే అది గ్రేట్‌ ఫీలింగ్‌ అని తెలిపారు.

అప్పుడు కష్టం మొత్తం మర్చిపోతామని, కానీ రిలీజ్‌కి నెల రోజులు పడే స్ట్రగుల్స్ ఉంటాయో దాన్ని మాటల్లో చెప్పలేమని, దర్శకుడికి ఇచ్చే పారితోషికం ఆ రోజుల్లో పడే స్ట్రగుల్స్ కే ఇవ్వాలన్నాడు సూర్య. 
 

56
kushi, suryah

kushi, suryah

ఈ సందర్భంగా `ఖుషి` (తమిళం) సినిమా ప్రీమియర్స్ రోజు అనుభవాలను పంచుకున్నారు. ఆ రోజు చెన్నైలో ఇండస్ట్రీకి చెందిన పెద్దలు చాలా మందికి సినిమా షో వేశారు. అంతా సీరియస్‌గా మూవీని చూస్తున్నారు. ఎవరూ నవ్వడం లేదు, ఎలాంటి రియాక్షన్‌ కనిపించడం లేదు.

అదేదో స్మశాన వాటికలో ఉండి దీనంగా సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. వాళ్లని చూస్తుంటే తనకు చెమటలు పట్టాయని, అయితే నెక్ట్స్ డే ఆడియెన్స్ ముందుకు వచ్చేసరికి సీన్‌ అంతా మారిపోయిందని, వాళ్లు బాగా ఎంజాయ్‌ చేయడం చూసి నమ్మకం ఏర్పడిందని, అప్పటి వరకు ఆ బాధని మాటల్లో చెప్పలేనని వెల్లడించారు. 

read  more: Jana Nayagan OTT Rights: విజయ్‌ `జన నాయగన్‌` ఓటీటీ, థియేట్రికల్‌ రైట్స్ హాట్‌ కేక్‌.. ఎంతకి అమ్మిరంటే?

66
sj suryah

sj suryah

దర్శకత్వం చేయకపోవడానికి కారణం అదే అని, ఆ స్ట్రగుల్స్ పడలేక నటుడిగా మారిపోయినట్టు తెలిపారు. తాను నటుడిగా రాణించడం కోసమే దర్శకుడిని అయినట్టు వెల్లడించారు. హీరో అయితే బాడిని, ఫేస్‌ని బాగా చూసుకోవాలి, ఫిట్‌గా ఉండాలి.

మన దృష్టి మొత్తం మన బాడీపైనే ఉంటుంది. అదే డైరెక్షన్‌ చేస్తే అందరి గురించి మనమే ఆలోచించాలి, మన గురించి మనం ఆలోచించే టైమే ఉండదు, అందరి పెయిన్‌ మనమే భరించాలి. అందుకే డైరెక్షన్‌కి దూరంగా ఉన్నట్టు తెలిపారు సూర్య. 

read more: రామ్‌ సినిమాతో మోహన్‌ లాల్‌ టాలీవుడ్‌ రీఎంట్రీ, క్లారిటీ ఇదే.. `లూసిఫర్‌ 3` ఎప్పుడంటే?

also read: భయంతో నడిచే బంధం నాకొద్దు.. పెళ్లిపై అనుష్క సంచలన వ్యాఖ్యలు, ఇదేం ట్విస్ట్ ?
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
తమిళ సినిమా
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rohith: సీజన్ 10లో బిగ్గెస్ట్ షాక్, రోహిత్ అవుట్.. ఎలిమినేషన్ కంటే రామ్ ప్రసాద్ అన్న ఇలా చేయడమే ఎక్కువ బాధ
Recommended image2
Rudravanam PS: రుద్రవనం పీఎస్ వెబ్ సిరీస్ రివ్యూ.. ఎమ్మెల్యే తమ్ముడితో సహా 8 హత్యల మిస్టరీ, ఎలా ఉందంటే
Recommended image3
Nayanthara: నా జీవితంలో తరచుగా సమస్యలు అందుకే.. ఓపెన్ అయిన నయనతార!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved